Warangalvoice

Telangana

District News, Hanamkonda, Telangana, Top Stories

రైల్వే వర్క్ షాప్ పేరిట రాజకీయ పార్టీల డ్రామా

రైల్వే రిపేరు వర్క్ పేరిట ప్రజలను మోసంరాబోయే ఎన్నికల కోసం  పార్టీల స్టంట్కాజీపేట తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జాక్  వరంగల్ వాయిస్, కాజీపేట : కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ (పి ఓ హెచ్), వ్యాగన్ తయారీ పరిశ్రమ విషయంలో గత నాలుగైదు రోజులుగా మీడియాలో, పత్రికలలో కాజీపేట ప్రాంత ప్రజలను అయోమయానికి గురిచేసేవిదంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు  ఈ పరిశ్రమల పైన అవగాహన లేకుండా, ఒక పెద్ద డ్రామాలు మాట్లాడుతున్నారన్నారు. అందుకే తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో  కాజీపేట రైల్వే ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణలో  ఏర్పాటు విలేకరుల సమావేశంలో కాజీపేట  తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జాక్ కో, కన్వీనర్ పాక వేద ప్రకాష్ మాట్లాడుతూతెలంగాణ రైల్వే జాక్ 2011 పిబ్రవరి నెలలో ఆవిర్భావం రైల్వే సమస్యల పైన కాజీపేట జంక్షన్ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న విషయం ఈ ప్రాంతంలోని ప్రజానీకానికి తెలిసిందే అని, అప్ప...
గిరిజన ఆదివాసీ జీవితాల్లో వెలుగులు
District News, Telangana

గిరిజన ఆదివాసీ జీవితాల్లో వెలుగులు

పోడు పట్టాలతో పాటు పోడు కేసుల ఎత్తివేత ఇకముందు వారిపై ఎలాంటి కేసులూ ఉండవు ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే 47వేల ఎకరాలకు పోడు పట్టాలు పోడు పట్టాలతో పాటు రైతుబంధు కూడా అమలు ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీ ఫేజ్‌ కరెంట్‌కు ఆదేశాలు కౌటాలా వార్ధా మధ్య బ్రిడ్జికి 75 కోట్లు మంజూరు ఆసిఫాబాద్‌ వేదికగా సిఎం కెసిఆర్‌ ప్రకటన వరంగల్ వాయిస్ , కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ : గిరిజనులకు పోడు పట్టాలు అందించడంతో పాటు వారికి మరో శుభవార్తను కెసిఆర్‌ అందించారు. పోడుభూములకు సంబంధించి ఆదివాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇక వారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. పట్టాలు పంపిణీ చేసిన అనంతరం కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత పేదల బతుకుల గురించి ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. తెలంగా...
ఉపవాస పర్వం, భక్తి శ్రద్ధల పారవశ్యం – తొలి ఏకాదశి
Cultural, District News, Telangana

ఉపవాస పర్వం, భక్తి శ్రద్ధల పారవశ్యం – తొలి ఏకాదశి

తొలి ఏకాదశి జూన్ 29న శ్రీ మహా విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే సమయం చాతుర్మాస వ్రతం పుణ్యఫలం ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం...
రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ ….
District News, Telangana, Top Stories

రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ ….

జూన్ 28న జయంతి      రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పీవీకి పేరుంది.  పదవిని చేపట్టినా అది ప్రజల పక్షంగానే నడిపించింది. తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం ఆయన సొంతూరు. రుక్మిణి, సీతారామారావు తల్లిదండ్రులు. 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. పీవీ ప్రాథమిక విద్య వంగర, హన్మకొండలో సాగింది. 1936లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులయ్యారు. 1938లో నిజాం వ్యతిరేక పోరాటంలో పీవీ పాల్గొన్నారు. దీంతో ఆనాడు రాష్ర్టంలో ఎక్కడ చదవకుండా ప్రభుత్వం నిర్భంధం విధించింది. చదువుపై మమకారంతో మహారాష్ర్టలోని పూణేలో బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన పీవీ హైదరాబాద్ రాష్ర్ట ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటు ప్రత్యేక మ...
ఆ ఒక్క టిక్కు పెట్టి ఉంటే..
District News, Telangana, Today_banner

ఆ ఒక్క టిక్కు పెట్టి ఉంటే..

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల్లో తెలుగువాళ్లే దాదాపు 120 మంది ఉన్నారని తెలుస్తోంది. చనిపోయినవారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఈ పరిస్థితుల్లో, ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా ఆదుకుంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా నామమాత్రం. కేవలం 45 పైసల ఖర్చుకే ₹10 లక్షల బీమా అందుతుంది. 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా మీరు కూడా తరచుగా/అరుదుగా రైలు ప్రయాణం చేస్తుంటే, ఇప్పుడు చెప్పబోయే అతి ముఖ్యమైన విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పటివరకు చాలాసార్లు రైలు ప్రయాణం చేసినా, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుని ఉండరు. రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీనిని టిక్ చేయండి. దీనివల...
అభ్యుదయ యుగానికి నాంది ప్రస్థాపకుడు
Cultural, Telangana

అభ్యుదయ యుగానికి నాంది ప్రస్థాపకుడు

శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ జయంతి ఏప్రిల్ 30న వరంగల్ వాయిస్, ప్రత్యేకం: జీవితాన్ని కవిత్వంలోనూ వడబోస్తూ, తెగిన గాలి పటంలా గడిపానని శ్రీ శ్రీ అనేవారు. 1936లో ‘వీణ’ పత్రిక సంపాదక వర్గంలో కొంత కాలం పనిచేశారు. 1938లో ఆంధ్రప్రభలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. శ్రీ శ్రీ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, కవితా వ్యాసంగం మాత్రం వదలలేదు. ఆనాటి రోజుల్లో అధికంగా వాడుకలో ఉన్న సంప్రదాయ, భావ కవిత ధోరణులు ఆకర్షించిన వాడైనా, కొన్ని కొత్త ధోరణులు తన కవితలో శ్రీ శ్రీ ప్రదర్శించే వారని, ప్రముఖ కవులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తదితరులు పేర్కొన్నారు. శ్రీ శ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ అఖిలాంధ్ర కీర్తి తెచ్చి పెట్టింది. ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక కొత్త మలుపును సృష్టించిన నవ్య సాహిత్య పరిషత్తును 1936లో ప్రారంభించడంలో శ్రీ శ్రీ కూడా ప్రముఖ పాత్ర వహించాడు. అయితే 1937లో తన ఆప్తమిత్రుడు కొంపెల్లి జనార్ధనరావు మరణించ...
భారతజాతి నేత డాక్టర్ బాబా సాహెబ్
Cultural, District News, Telangana

భారతజాతి నేత డాక్టర్ బాబా సాహెబ్

అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న వరంగల్ వాయిస్, కల్చరల్ :  అంబేద్కర్ అంటే అందరికి అర్థమయ్యేది ఆయన అంటరాని కులంలో పుట్టాడని, కాదంటే దళిత నాయకుడు అని అయితే ఈ దేశానికి రాజ్యాంగం రాసినాయన రాజ్యాంగ నిర్మాతగా పరిచయం అవుతాడు. మరి కొంత మందికి సామాజిక విప్లవకారుడుగా కనిపిస్తాడు. ఇంకొంత మందికి సాంఘీక సంస్కర్తగా కనిపిస్తాడు. వేరే వారికి ఒక న్యాయవాదిగా న్యాయశాఖ మంత్రిగా కనిపిస్తే మరికొంత మందికి మంచి రచయితగా కనిపిస్తాడు. భారతదేశంలోని సామాజిక ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవటానికి కావలసిన పరిశోధనలు చేశాడు. పరిశోధనాసార పుస్తకాలుగా రాశాడు. ఆయన ఎంచుకున్న పరిశోధనలు కూడా చాలా క్లిష్టమైనవి. అంటరానితనం అంటే ఏమిటి? వారు అంటరాని వారు ఎలా అయ్యారు? అనేవి. శూద్రులెవరు? అనేవి? శుద్రులెవరు? కుల నిర్మూలన అంశాల మీద పుస్తకాలు రాశాడాయన. భారతదేశంలోని రచయితలు సామాజిక శాస్త్రవేత్తలు ‘కులం’ గురించి పరిశోధనలు చేయలేదు. పుస్తకాలు...
కసిఆర్‌ ప్రభుత్వానికి కాలం చెల్లింది
Telangana

కసిఆర్‌ ప్రభుత్వానికి కాలం చెల్లింది

బండి అరెస్ట్పై ఆగ్రహించిన తరుణ్‌ చుగ్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: తెలంగాణలో కెసిఆర్‌ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ఇక ఆయనను సాగనంపడమే తరువాయి అని బండి సంజయ్‌ అరెస్ట్‌ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్ట్‌ తీరును తప్పుపట్టారు. బండి సంజయ్‌ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అరెస్టుకు కారణాన్ని వెల్లడిరచడంలో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఇష్యూను బీజేపీ ప్రశ్నిస్తున్నందుకే తమ నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు భయపడే... ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అహంకారానికి బండి సంజయ్‌ అరెస్ట్‌ ఒక నిదర్శనం అని తరుణ్‌ చుగ్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కు భయపడేది ల...
ఆందోళన కలిగించేలా దేశంలో కరోనా వ్యాప్తి
Telangana, Today_banner

ఆందోళన కలిగించేలా దేశంలో కరోనా వ్యాప్తి

నాలుగు వేలకు పైనే కొత్త కేసులు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా మూడు వేల కేసులు నమోదవ్వగా.. తాజాగా 24 గంటల వ్యవధిలో ఏకంగా నాలుగు వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,31,086 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది.కాగా, 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబర్‌ 25న 4,777 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో దేశంలో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 44,733,719కి చేరింది. ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో కరోన...
బండి సంజయ్‌ అరెస్ట్‌పై మండిపడ్డ కిషన్‌ రెడ్డి
Political, Telangana

బండి సంజయ్‌ అరెస్ట్‌పై మండిపడ్డ కిషన్‌ రెడ్డి

ఏ అభియోగం కింద అరెస్ట్‌ చేశారని డిజిపికి ప్రశ్న వరంగల్ వాయిస్,హైదరాబాద్‌:బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్ట్‌, ఆయనపై నమోదైన కేసులపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌ లో అర్థరాత్రి నుంచి ఉన్న బండి సంజయ్‌ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. బండి సంజయ్‌ కుట్ర చేశారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బండి సంజయ్‌ పై ఏయే సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారనే వివరాలను మాత్రం పోలీసులు ఇంకా వెల్లడిరచలేదు. దీనిపై గందరగోళం నెలకొంది. బండి సంజయ్‌ పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ కు ఫోన్‌ చేసి.. మాట్లాడారు. డీజీపీ సైతం ఫోన్‌లో వివరాలు వెల్లడిరచలేదు. అన్ని వివరాలు తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి...