అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు
దేశ రక్షణకు సైనికులు..
అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు
కొనియాడిన మంత్రి సురేఖ
రేపు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
వరంగల్ వాయిస్, వరంగల్ : దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, దేశ సహజవనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సెప్టెంబర్ 11 సందర్భంగా అడవుల సంరక్షణకై ప్రాణాలు అర్పించిన అమరవీరులు త్యాగాలను స్మరించుకుంటూ, అటవీ సంపద సంరక్షణకు, వన్యప్రాణుల పరిరక్షణకు అటవీ ఉద్యోగులు చేస్తున్న కృషిని మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. ‘మనిషి జీవితం అడవుల నుంచే ఆరంభమైంది. మానవ పరిణామక్రమానికి అడవులు సాక్షిభూతంగా నిలిచాయి. మనిషి ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా రూపాంతరం చెందే క్రమంలో అడవులే ఆలవాలమయ్యాయి. తల్ల...