జలకళ సంతరించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు
మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తి నీటి విడుదలరాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
వరంగల్ వాయిస్, జయశంకర్‌భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు.. పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి బ్యారేజీలకు వరద తాకిడి పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో 24 గేట్లు ఎత్తి… నీటిని భారీగా దిగువకు పంపిస్తున్నారు.మేడిగడ్డ బ్యారేజీకి 60వేల530 క్యూసెక్కుల ప్రవాహం రాగా… 24 గేట్లు తెరిచి 62వేల 940 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డలో 9.8 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు… పరవళ్లు తొక్కుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభా...