ఇంటి వద్దకే ఉచిత వైద్య సేవలు
ప్రభుత్వం అందిస్తున్న ‘ఈ-సంజీవని’తో అందుబాటు!
హాస్పిటల్ కు వెళ్ళకుండానే వైద్య సేవలు
ఉచిత కన్సల్టేషన్ తోపాటు, వాడవలసిన మందుల వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అందుబాటులో వేలాదిమంది వైద్యులు, స్పెషలిస్టులు
వీడియో కాల్ సదుపాయం
చికిత్స వివరాలు ఎప్పడంటే అప్పుడు తెలుసుకునే వెసులుబాటు
పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మన జీవితాలను మరింత సులభతరం చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఈ-సంజీవని’ (e-Sanjeevani) అనే అద్భుతమైన టెలిమెడిసిన్ ప్లాట్‌ఫాం, ఈ విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక వరం లాంటిది. డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో నుంచే డాక్టర్‌ను సంప్రదించి, వైద్య సలహాలు పొందవచ్చు. ఈ సేవలను తెలంగాణలోన...