Warangalvoice

Political

నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని కావడం ఖాయం
District News, Political

నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని కావడం ఖాయం

కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్వరంగల్ వాయిస్, హనుమకొండ : నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని కావడం ఖాయమని 60 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ కి మద్దతుగా ఆదివారం 60వ డివిజన్ వడ్డేపల్లి లోని మిడిదొడ్డి వాడ, కటకంవాడ, కట్క వాడ లలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ ప్రచారం లో పాల్గొని నరేంద్రమోడీ  అభివృధి కార్యక్రమాలు వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీరంగం సాగర్, 60వ డివిజన్ అధ్యక్షులు సతీష్, ప్రధాన యాదగిరి, అడప రాము, సాగర్ గౌడ్, నరేష్, బాబీ, చందు, సంతోష్, కటకం రాజు, కందికొండ రాజు, రాజేష్, హరీష్, రాము, శ్యామ్, సతీష్, బూత్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అరూరి రమేష్
District News, Political

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అరూరి రమేష్

వరంగల్  వాయిస్, వరంగల్ : గత మూడు రోజులుగా ఉత్కంట రేపిన అరూరి రమేష్ పార్టీ మారుడం ఎట్టకేలకు తెరవీడింది.  బీఆర్ఎస్ పార్టీకి , వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవకీ రాజీనామ చేస్తున్నట్లు లేఖ విడిదలజేసారు. అదే విధంగా ఇంతకాలం పార్టీలో అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గార్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాల్లూ తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు....
అధికారంలోకి రాగానే.. కేసీఆర్ చర్లపల్లి జైలుకే
District News, Hanamkonda, Political

అధికారంలోకి రాగానే.. కేసీఆర్ చర్లపల్లి జైలుకే

పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ వాయిస్, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా చర్లపల్లి జైలుకే పంపిస్తామని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సమావేశం దేశ, రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారనుందన్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పురించబోతున్నామని ఆయన ప్రకటించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నట్టేటా ముంచుతున్నారన్నారని మండిపడ్డారు. ప్రజలకోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యం కోసం రాజాకీయాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రె...
విమోచనోద్యమం స్ఫూర్తితో మొదలైన.. మరో సమరం
Latest News, Political, Warangal

విమోచనోద్యమం స్ఫూర్తితో మొదలైన.. మరో సమరం

మంత్రి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వరంగల్ వాయిస్, పరకాల : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ఆనాటి త్యాగధనుల సేవలను ప్రజలకు తెలియజేస్తామని కేంద్ర కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి బైక్ ర్యాలీగా పరకాలకు విచ్చేసిన ఆయన అమరధామంలో నివాళులర్పించారు. పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విమోచనోద్యమం స్ఫూర్తితో మరో సమరం మొదలైందన్నారు. తెలంగాణ ద్రోహి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ఇక్కడి ప్రజలను అవమానపరిస్తున్నాడని మండిపడ్డారు. నిజాం పాలకులు తెలంగాణలో కర్కషత్వంగా వ్యవహరించి లక్షలాదిమంది ప్రజలను ...
బండి సంజయ్‌ అరెస్ట్‌పై మండిపడ్డ కిషన్‌ రెడ్డి
Political, Telangana

బండి సంజయ్‌ అరెస్ట్‌పై మండిపడ్డ కిషన్‌ రెడ్డి

ఏ అభియోగం కింద అరెస్ట్‌ చేశారని డిజిపికి ప్రశ్న వరంగల్ వాయిస్,హైదరాబాద్‌:బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్ట్‌, ఆయనపై నమోదైన కేసులపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌ లో అర్థరాత్రి నుంచి ఉన్న బండి సంజయ్‌ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. బండి సంజయ్‌ కుట్ర చేశారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బండి సంజయ్‌ పై ఏయే సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారనే వివరాలను మాత్రం పోలీసులు ఇంకా వెల్లడిరచలేదు. దీనిపై గందరగోళం నెలకొంది. బండి సంజయ్‌ పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ కు ఫోన్‌ చేసి.. మాట్లాడారు. డీజీపీ సైతం ఫోన్‌లో వివరాలు వెల్లడిరచలేదు. అన్ని వివరాలు తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి...
ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే కుట్ర
Political, Telangana

ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే కుట్ర

బండి సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి మంత్రులు జగదీశ్‌ రెడ్డి, గంగుల డిమాండ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీలో రాజకీయ అన్నారు. పశ్నాపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తప్పుచేసి అడ్డంగా దొరికినప్పటికీ సంజయ్‌ని ఆ పార్టీ నేతలు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్‌లోకి చోచ్చుకెళ్ళి దొంగను రక్షించే చెందంగా బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్‌ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తున్నదని ఆరోపించారు.పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్‌ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ క్షుద్రాజకీయ క్రీడకు తెరలేపిందని చెప...
పోలవరంపై కేంద్రం కప్పదాటు వ్యవహారం
Political

పోలవరంపై కేంద్రం కప్పదాటు వ్యవహారం

గట్టిగా నిలదీయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలం విభజన జరిగి 9 ఏళ్లు కావస్తున్న కదలని ప్రాజెక్ట్‌ నిర్వాసితుల విషయంలో కేంద్ర, రాష్టాల్ర దోబూచులాట వరంగల్ వాయిస్,అమరావతి:పోలవరానికి కేంద్రం కల్పిస్తున్న అడ్డంకులపై నిలదీసి పోరాడడంలో వైసిపి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పోలవరంపై చంద్రబాబుపై విమర్శలకే మంత్రులు, సిఎం జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాకాకుండా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు. దీంతో విభజన జరిగి 9 ఏళ్లు కావస్తున్నా పోలవరం పూర్తి కాలేదు. నిర్వాసితులకు పరిహారం దక్కలేదు. నిధులు సాధించి సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్లుంటోంది. కేంద్రం వద్దకెళ్లి నిధులను డుగుతున్నాం అని చెపుతున్నా..ప్రగతి మాత్రం కనిపించడం లేదు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా చేసిన పనులకు రూ.2,600 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడిరచగ...
మోగిన కర్నాటక ఎన్నికల నగారా
Political

మోగిన కర్నాటక ఎన్నికల నగారా

మే 10న ఒకే దశలో ఎన్నికల నిర్వహణ మే 13న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాల ప్రకటన ఏప్రిల్‌ 13వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల ఏప్రిల్‌ 20వ తేదీ వరకు నామినేషన్లకు గడువు 80 ఏళ్ల పైబడ్డవారికి, వికాలంగులకు ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచిన సిఇసి రాజీవ్‌ కుమార్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:కర్నాటకలో ఎన్నికల నగారా మోగింది. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌ ప్లీనరీ హాలులో బుధవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు కర్ణా...
లక్షద్వీప్‌ ఎంపి సభ్యత్వం పునరుద్దరణ
Political, Today_banner

లక్షద్వీప్‌ ఎంపి సభ్యత్వం పునరుద్దరణ

సుప్రీం కేసు నేపథ్యంలో లోక్‌సభ దిద్దుబాటు చర్య వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: లక్షద్వీప్‌ ఎంపీ, ఎన్‌సీపీ సీనియర్‌ నేత మహ్మద్‌ ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్‌ వెనక్కి తగ్గింది. వెంటనే అతని ఓలక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. సుప్రీం కోర్టులో బుధవారం వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఫైజపై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ ప్రకటించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్‌ జనరల్‌ పేరిట ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. దీంతో జనవరి 13వ...
కన్నడనాట బిజెపి ఎదురీత
Political, Today_banner

కన్నడనాట బిజెపి ఎదురీత

అధికార పార్టీలో లంచావతారాల తంటా మరోమారు అధికారం కోసం జెడిఎస్‌ యత్నాలు వరంగల్ వాయిస్,బెంగళూరు: కర్ణాటకలో మరో నెలన్నరలోగా ఎన్నికలు జరగనుండడంతో.. రాజకీయ సవిూకరణలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీఇప్పటికే 224 స్థానాలకు గాను.. 124 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ.. ఆచితూచి అడుగులు వేస్తోంది. కన్నడనాట బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్‌ బలమైన మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ కలవకుండా బిజెపి లోపాయకారి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు మాజీమంత్రి, మాజీ బిజెపి నేత గాలి జనార్ధన్‌ రెడ్డి కూడా ప్రాంతీయ పార్టీ పెట్టి రంగంలోకి దిగారు. తమ గుర్తును ఆయన ఫుట్‌బాల్‌గా ఎంచుకున్నారు. నిజానికి కర్నాటకలో బిజెపి నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఏర్పడ్డా..అధికారం దక్కలేదు. కుమారస్వామి ...