Warangalvoice

Political

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ
Political

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ

తీన్మార్ మల్లన్నకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇటీవల పార్టీ వ్యతిరేక విధానాలు, నాయకత్వంపై చేసిన వ్యాఖ్యల కారణంగా జారీ అయ్యాయి. తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రభుత్వ కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలపై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాంటి వ్యాఖ్యలు పార్టీలో విభేదాలు తేవడంతోపాటు ఆందోళనలు కలిగిస్తాయని భావించి నిర్ణయం తీసుకుంది.అంతేకాదు మల్లన్నకు అధికారికంగా నోటీసులు జారీ చేయకముందే కాంగ్రెస్ పార్టీ నోటీసుల గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఏమైనా మీ సొంతమా, కాంగ్రెస్ పార్టీ బీసీలదంటూ వ్యాఖ్యానించారు. పార్టీ పేరుతో తనను బెదిరించాలని చూస్తే కుదరదని హె...
Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ లేఖ .. ఎందుకంటే..
Political

Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ లేఖ .. ఎందుకంటే..

Minister Konda Surekha: ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సేరేఖ ఇవాళ ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. వరంగల్ వాయిస్ హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలకు సోనియా, రాహుల్ గాంధీలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో బీసీ కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా శ్రమించారని వెల్లడించారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేష‌న్‌లో పేర్కొన్న...
Political
ఈ క్రమంలో వీలైనంత వరకు అందరికీ పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. దీని ద్వారా ట్రాఫిక్‌ జామ్‌, రద్దీని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.ఈసారి మహా కుంభమేళాలో ఇతర రాష్టాల్ర నుంచి వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఇతర రాష్టాల్ర నుంచి వచ్చే వాహనాలు ఆ ప్రాంతంలో ప్రవేశించకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భక్తులు ఆన్‌లైన్‌లో ముందుగా తమ వాహనాన్ని నమోదు చేసుకుని మాత్రమే పర్యటనకు రావాల్సి ఉంటుంది. ఈ చర్యకు అనుగుణంగా, వాహనాల సంఖ్యను కూడా నియంత్రించేందుకు ఇది సహాయపడుతుంది. భక్తుల రవాణా సరళతను పెంచేందుకు, ప్రయాగ్‌ రాజ్‌ నగరంలో వన్‌ వే రూట్‌ వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమైన ప్రాంతాలకు, ఘాట్ల దగ్గరకు వెళ్లే దారులను ఒకవైపుగా మార్చి, మరో వైపు నుంచి రాకపోకలను పూర్తిగా వేరే రూట్లతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ...
Enugula Rakesh Reddy | నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్
Political

Enugula Rakesh Reddy | నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్

జాబ్ క్యాలెండర్ అంటూ మోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు నమ్మించి నట్టేట ముంచారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు. జాబ్ క్యాలండర్ అని ప్రకటించి జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో పండగలు, పబ్బాలు, పంచాంగం తప్ప ఎక్కడా ఉద్యోగ నియామకాల ఊసే లేదని మండిపడ్డారు. మైసూరు బజ్జీలో మైసూరు లేకున్నా కనీసం బజ్జీ ఉంటుంది..బొంబాయి రవ్వలో బొంబాయి లేకున్నా రవ్వ అయినా ఉంటుంది.. కానీ, కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో జాబు లేదు, క్యాలండర్ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటున్న రేవంత్ రెడ్డి మరి జాబ్ క్యాలెండర్ విషయంతో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. జీవో 46, జీవో 29 బాధితులపై ప్రభుత్వం కక్ష కట్టి కోట్లు ఖర్చు పెట్టి కేసులు వాదిస్తూ తీవ్ర అన్య...
బీసీల సంక్షేమానికి పోరాడుదాం
Political, Telangana

బీసీల సంక్షేమానికి పోరాడుదాం

మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వరంగల్ వాయిస్, హైదరాబాద్ : మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ బీసీ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. వెనుకబడిన కులాలకు అన్ని రంగాలలో అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యల గురించి బీఆర్ఎస్ పార్టీ బీసీ ప్రజా ప్రతినిధులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో వెనుకబడిన కులాల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం విచారకరమన్నారు. తమిళనాడు పర్యటన సందర్బంగా ఇటీవల పరిశీలించిన అంశాలను గురించి చర్చించారు. చట్టసభలలో బీసీలకు 33శాతం, స్థానిక సంస్థల ఎన్నికలలో 42శాతం రిజర్వేషన్స్ అమలయ్యే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు...
లోగో మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
Political, Top Stories

లోగో మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జిలతో నిరసన వరంగల్ వాయిస్, బాలసముద్రం : తెలంగాణ లోగో మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్ అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. కాకతీయ తోరణం, చార్మినార్ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ఇముడింప చేసేలా ఉన్న గుర్తులను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రజల అభీష్టం మేరకు పాలన కొనసాగించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లోగో మార్పు నిర్ణయం వెనక్కి తీసుకొని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు నయిమోద్దీన్, చాగంటి రమేష్, బొల్లు రవి, ఎండీ మహమూద్, సంపత్, ఇస్మాయిల్, సందీప్, రాజేశ్వర్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.  ...
పట్టభద్రుల ఓటును అడిగే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ లకు లేదు
Political

పట్టభద్రుల ఓటును అడిగే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ లకు లేదు

వరంగల్ వాయిస్, తొర్రూరు : మండలంలోని వెలికట్టే గ్రామంలో గల స్థానిక రామ ఉపేందర్ ఫంక్షన్ హాల్ లో గురువారం వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల సన్నాహాక సమావేశం పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సభాధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావాలంటే తీన్మార్ మల్లన్నను గెలిపించవలసిన అవసరం పట్టభద్రులకు ఉందన్నారు. గతంలో పట్టభద్రులు పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల గురించి ఏనాడు కూడా రాష్ట్ర శాసనమండలిలో మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులను పూర్తిగా విస్మరించా...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపు
Political

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపు

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్ వాయిస్, పరకాల : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని, చట్టసభల్లో నిజాయితీతో కూడిన తెలంగాణ గళం వినిపించాలంటే.. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ, బిట్స్ పిలానీలో చదివిన విద్యాధికుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్, ఎంపీ అభ్యర్థి మారేపెల్లి సుధీర్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. నియోజకవర్గంలో ఓటు హక్కు...
Amit Shah: మెజార్టీ రాకపోతే.. ‘ప్లాన్ బి’ ఉందా..? అమిత్ షా సమాధానమిదే..
Political

Amit Shah: మెజార్టీ రాకపోతే.. ‘ప్లాన్ బి’ ఉందా..? అమిత్ షా సమాధానమిదే..

Lok sabha elections: లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ రాకపోతే.. తదుపరి ప్లాన్ ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సమాధానం ఇచ్చారు. దిల్లీ: కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భాజపా విశ్వాసంగా ఉంది. లోక్సభ ఎన్నికల సమరంలో భాగంగా ఇప్పటివరకు నాలుగు విడతల పోలింగ్ పూర్తికాగా.. మరో మూడు దశల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమయంలో భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. జూన్ 4న భాజపాకు 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్ బి ఏంటి..? అంటూ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. (Lok sabha elections) "అలాంటి అవకాశాలు నాకు కనిపించడం లేదు. 60 కోట్ల లబ్ధిదారుల సైన్యం మోదీకి అండగా ఉంది. వారికి ఎలాంటి కు...
Supreme Court: షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
Political

Supreme Court: షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే

ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దిల్లీ: ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసుపై ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్ జిల్లా వైకాపా అధ్యక్షుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు.. హత్య కేసుపై మాట్లాడవద్దని ఏప్రిల్ 16న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిగింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా.. వాక్ స్వాతంత్య్రం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదుల...