Warangalvoice

Political

Caste Census Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే
Political

Caste Census Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే

Caste Census Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వేల ప్రారంభంకానుంది. మూడు విధానాలలో వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది. వరంగల్ వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో (Telangana) మరోసారి కులగణన సర్వే మొదలుకానుంది. రేపటి (ఆదివారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో సారి కులగణన సర్వే (Caste Census Survey) ప్రారంభంకానున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ (Telangana Govt) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి విడతలో కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వే కొనసాగనుంది. మూడు విధాలుగా వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఎన్యూమరేటర్లను పిలిపించుకునే ఛాన్స్ కూడా ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సర్వేపై కీలక సూచనలు చేసి టోల్ ఫ్రీ నంబర్‌ను ...
Laxman:రేవంత్ రెడ్డిను చూసి సమాజం తలదించుకుంటోంది
Political

Laxman:రేవంత్ రెడ్డిను చూసి సమాజం తలదించుకుంటోంది

Laxman: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్‌కు పట్టిన గతే.. రేవంత్‌కూ పడుతుందని మండిపడ్డారు. మోదీ తినే ఆహారాన్ని, వేసుకునే బట్టలను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. వరంగల్ వాయిస్, సిద్దిపేట : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేటలో లక్ష్మణ్ పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మోదీ ఒక వర్గానికి, సమాజానికి చెందిన వారు కాదు.. ప్రజలందరి మనిషి. ప్రపంచ ఖ్యాతి కలిగిన వ్యక్తి అని తెలిపారు. మోదీపై గతంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇలాగే అవాకులు, చెవాకులు పేలారని అన్న...
Kishan Reddy: తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విసుర్లు
Political

Kishan Reddy: తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విసుర్లు

Kishan Reddy: రైతుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎరువులకు సబ్సిడీ ఇస్తూ రైతులను బీజేపీ అండగా ఉందని అన్నారు. వరంగల్ వాయిస్, నల్గొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం లక్షా 20వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. రూ. 80వేల కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. కేంద్రం నుంచి రీజనల్ రింగ్ రోడ్, మెగా టెక్స్ టైల్ పార్క్, రైల్వే కోచ్ తెచ్చామని ఉద్ఘాటించారు. ఇవాళ(శనివారం) నల్గొండలో కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సరోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరార...
CM Revanth Reddy: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
Political

CM Revanth Reddy: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్

CM Revanth Reddy: యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం ఆయా నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపులు పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంద నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పన...
Talasani Srinivas Yadav: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్
Political

Talasani Srinivas Yadav: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్

Talasani Srinivas Yadav: రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కులగణన సర్వే చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఈ సర్వేలో 60లక్షల మంది ఎక్కడకు పోయారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. వరంగల్ వాయిస్,  హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇప్పటికే పార్టీ మారిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కేడర్ చాలా హుషారుగా ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. కుట్ర పూరితంగా కులగణన సర్వే చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌తో సహా.. గ్రామాల్లో కూడా సర్వే సక్రమంగా జరుగల...
CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Political

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని గర్వంగా చెబుతున్నానని అన్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అని చెప్పారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ విస్తరణలో భాగంగా నూతన భవనాన్ని ఇవాళ (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర...
GHMC Politics: జీహెచ్ఎంసీలో కొత్త రాజకీయం.. బీఆర్ఎస్ ప్లాన్ ఇదే..
Political

GHMC Politics: జీహెచ్ఎంసీలో కొత్త రాజకీయం.. బీఆర్ఎస్ ప్లాన్ ఇదే..

Talasani Srinivas Yadav: జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కాక రేపుతుంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నయా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వరంగల్ వాయిస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శోభన్‌ రెడ్డిలపై అవిశ్వాస కత్తి వేలాడుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్ చేస్తుందనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పాలక మండలికి నాలుగేళ్లు పూర్తి కావడంతో ఏ క్షణంలోనైనా మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వ...
HARISH RAO: మా పోరాటం ఆగదు.. రేవంత్ ప్రభుత్వానికి హరీష్‌రావు మాస్ వార్నింగ్
Political

HARISH RAO: మా పోరాటం ఆగదు.. రేవంత్ ప్రభుత్వానికి హరీష్‌రావు మాస్ వార్నింగ్

HARISH RAO: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం వల్లే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర అందించాలని అన్నారు. వరంగల్ వాయిస్, సిద్దిపేట: రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతుల కోసం తాము నిరంతర పోరాటం కొనసాగిస్తామని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ(మంగళవారం) సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషించారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ, కాలువ పక్కన ఆగ...
Election Commission: స్థానిక ఎన్నికల నగరా.. స్వీడ్ పెంచిన ఎన్నికల సంఘం
Political

Election Commission: స్థానిక ఎన్నికల నగరా.. స్వీడ్ పెంచిన ఎన్నికల సంఘం

Telangana State Election Commission: స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్, కీలక ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ వాయిస్ హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ , స్టేట్ రిసోర్స్ పర్సన్‌లను ఎంపిక చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్‌లకు ఎంసీహెచ్ఆర్డీలో ఎన్నికల సంఘం ట్రైనింగ్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్, కీలక ఆదేశాలు జారీ చేసింది. మండల, జిల్లా పరిషత్, పంచాయతీ రిటర్నింగ్ అధికారులను ఫిబ్రవరి 10వ తేదీ లోపు ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది. పంచాయితీలు, మండల పరి...
HarishRao: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం
Political

HarishRao: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

HarishRao:రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్ హైదరాబాద్: గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు ఆస్పత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రేవంత్ ప్రభుత్వంపై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒకటి కాదు రెండు కాదు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో నమోదయ్యాయని అన్నారు. వందల మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కాగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశార...