Warangalvoice

Political

మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ వంద జోడో యాత్ర‌లు చేసినా.. ఈ అభివృద్ధిని సాధించ‌లేరు : కేటీఆర్
Political

మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ వంద జోడో యాత్ర‌లు చేసినా.. ఈ అభివృద్ధిని సాధించ‌లేరు : కేటీఆర్

KTR | దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ మ‌రో వంద జోడోయాత్ర‌లు చేసినా.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ మ‌రో వంద జోడోయాత్ర‌లు చేసినా.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. గత పదేళ్లు కేసీఆర్ మొక్కవోని పట్టుదలతో తెలంగాణలో అభివృద్ధి యజ్ఞం చేశారు.. అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికనే చెప్తున్నది అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు....
MLC Kavitha | సుప్రీం తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు.. రేవంత్, మోదీ చేసిందేమీ లేదు : ఎమ్మెల్సీ క‌విత‌
Political

MLC Kavitha | సుప్రీం తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు.. రేవంత్, మోదీ చేసిందేమీ లేదు : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | సుప్రీంకోర్టు తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు ప‌డ్డాయ‌ని, ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు ప‌డ్డాయ‌ని, ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ క‌విత నివాసంలో దళిత బంధు సాధన సమితి సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి.. వెంటనే వర్గీకరణ చేయాలి. దళితుల మధ్య పంచాయితీ పెట్టవద్దు… ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలి. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారు....
Gandra Venkataramana Reddy | హ‌త్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అల‌వాటు.. బీఆర్ఎస్ పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌దు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.
Political

Gandra Venkataramana Reddy | హ‌త్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అల‌వాటు.. బీఆర్ఎస్ పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌దు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : హ‌త్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అల‌వాటు.. బీఆర్ఎస్ పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌దు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మ‌తి భ్ర‌మించి మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లిలో రాజలింగ మూర్తి హత్యను బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతోంది. ఈ హ‌త్య‌ను బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హ‌రీశ్‌రావుకు ఆపాదించాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నించడం దుర్మార్గం. స్థానిక భూవివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగిందని ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కొందరి ఒత్తిడితో రాజలింగ మూర్తి భార్య నాపై ఆరోపణలు చేస్తున్నారు అని వెంక‌ట ర‌మ‌ణారెడ్డి తెలిపారు. ఈ హ‌త్య‌పై సీబీఐ, సీఐడీ విచార...
KCR: మళ్లీ మనదే అధికారం.. కష్టపడి పనిచేయాలి
Political

KCR: మళ్లీ మనదే అధికారం.. కష్టపడి పనిచేయాలి

బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎంపై ప్రజల్లో ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదని ఎద్దేవా చేశారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తాజాగా జరిగిన బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) నేతల విస్తృతస్థాయి సమావేశంలో కమ్యూనిస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కమ్యూనిస్టులు అధికార పార్టీతో అనుసంధానమై, ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యతను విస్మరించి కాంగ్రెస్‌కు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. అంతేకాదు ఈ సమావేశంలో కేసీఆర్, తెలుగుదేశం పార్టీ (TDP) ప్రాస్థానం గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) పడిన కష్టనష్టాలను వివరించారు. టీడీపీ ఎన్టీఆర్ కాలంలో ఉన్న పరిస్థితులను గుర్తుచేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై ప్రజలలో వ్యతిర...
KCR | వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం.. బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలు
Political

KCR | వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం.. బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

KCR | తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : KCR | తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది. భేటీలో బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలపై కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై నేతలతో కేసీఆర్‌ చర్చించి.. శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానాన్ని పార్టీ నేతలకు గుర్తు చేశారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన...
KTR | రేవంత్ రెడ్డికి రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు : కేటీఆర్
Political

KTR | రేవంత్ రెడ్డికి రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు : కేటీఆర్

KTR | రేవంత్ రెడ్డికి స్వార్థం త‌ప్ప ఇంకోటి తెలియ‌దు.. రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆమ‌న్‌గ‌ల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్ష‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : రేవంత్ రెడ్డికి స్వార్థం త‌ప్ప ఇంకోటి తెలియ‌దు.. రియ‌ల్ ఎస్టేట్ త‌ప్ప‌.. స్టేట్ ఫిక‌ర్ లేదు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆమ‌న్‌గ‌ల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్ష‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. అన్న‌దాత‌లు, మ‌హిళ‌లు జాగ్ర‌త్త‌గా, చైత‌న్య‌వంతంగా ఉండాలి. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో రుణ‌మాఫీ కాక చందు అనే రైతు బ్యాంక్ ముందు బైక్ కాల‌బెట్టి నిర‌స‌న చెప్పిండు. ఆదిలాబాద్‌లో జాద‌వ్ రావు అనే రైతు బ్యాంకులోనే ఎండ్రిన్ తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మేడ్చ‌ల్‌లో సురేంద్ రెడ్డి అనే రైతు వ్య‌వ‌సాయ శాఖ ...
Bala Lakshmi | అసంపూర్తి సర్వే కాదు.. పూర్తిస్థాయి సర్వే చేయాలి: బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి
Political

Bala Lakshmi | అసంపూర్తి సర్వే కాదు.. పూర్తిస్థాయి సర్వే చేయాలి: బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు. వరంగల్ వాయిస్, పీర్జాదిగూడ, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు. మంగళవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్యుమరేటర్లు, వార్డు అధికారులకు కుల గణనపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రెష్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల గణన సర్వేకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని, ఈ సర్వేలో పాల్గొని వారి కుటుంబ సభ్యుల పేర్లు రీ సర్వేలో నమోదు చేసుకోవాలన్నారు. తదితర అంశాల...
Yennam Srinivas Reddy | మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Political

Yennam Srinivas Reddy | మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు. వరంగల్ వాయిస్, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి  అన్నారు. ఇది ఒక్కరితో సాధ్యం కాదని, ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని కోరారు. ఇందులో భంగా మహబూబ్‌నగర్‌ విద్యానిధిని ఏర్పాటు చేశామని, సామాజిక స్పృహ కలిగిన వారు సహకరించాలన్నారు. పట్టణంలోని బీఈడీ కాలేజీలో నూతనంగా నిర్మించిన శౌచాలయాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలేజీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మన కళాశాలను, పాఠశాలలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ పేద విద్యార్థులు చదువుకుంటారని వారికి...
New Ration Cards | కొత్త రేషన్‌కార్డులపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు..!
Political

New Ration Cards | కొత్త రేషన్‌కార్డులపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు..!

New Ration Cards | కొత్త రేషన్‌కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్‌ కొత్త రేషన్‌కార్డులకు సంబంధించిన డిజైన్లను సోమవారం పరిశీలించారు. New Ration Cards | కొత్త రేషన్‌కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్‌ కొత్త రేషన్‌కార్డులకు సంబంధించిన డిజైన్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్‌కార్డుల జారీకి వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల్లో కోడ్‌ అమలులోకి వచ్చింది. అయితే, కోడ్‌ అమలులో లేని జిల్లాల్లో రేషన్‌కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేస్తున్నారని.. ఈ క్రమంలో వారంతా మళ్లీ దరఖాస్తులు చేయకుండగా అవగాహన కల్పించాలని సూచించారు....
Places of Worship Act: ప్రార్థ‌నా స్థ‌లాల చ‌ట్టం.. మ‌ధ్యంత‌ర పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం
Political

Places of Worship Act: ప్రార్థ‌నా స్థ‌లాల చ‌ట్టం.. మ‌ధ్యంత‌ర పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం

Places of Worship Act : ప్రార్థ‌నా స్థ‌లాల చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన మ‌ధ్యంత‌ర పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ పిటీష‌న్ల‌కు ఓ ప‌రిమితి ఉండాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది. ఏప్రిల్‌లో ఈ కేసును మ‌ళ్లీ విచారించ‌నున్నారు. వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: 1991 నాటి ప్రార్థ‌నా స్థ‌లాల చ‌ట్టం(Places of Worship Act)పై ఇంకా పిల్స్ దాఖ‌లు అవుతున్నాయి. ఆ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ కేసులు ఫైల్ చేయ‌డాన్ని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. మ‌ధ్యంత‌ర అప్లికేష‌న్లు దాఖ‌లు చేయ‌డానికి ఓ ప‌రిమితి ఉండాలని అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొన్న‌ది. చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టిస్ పీవీ సంజ‌య్ కుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం .. ప్రార్థ‌న స్థ‌లాల చ‌ట్టం అమ‌లుపై వాద‌న‌లు చేప‌ట్టింది. మ‌ధ్యంతర పిటీష‌న్లు ఎక్కువ కావ‌డంతో ఇవాళ ఆ కేసును విచార‌ణకు స్వీక‌రించ‌లేమ‌న్నారు. త్రిస‌భ్ ధ‌ర్మాస‌నం ముంద...