Ex MLA Julakanti | వారిని బయటికి తీసుకొచ్చే చర్యలను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు
వరంగల్ వాయిస్, మిర్యాలగూడ : ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల జాడ ఇంకా తెలియకపోవడం దారుణమని అన్నారు.
ఇప్పటికే ఐదు రోజులు దాటిపోయిందని, ప్రభుత్వ యంత్రాంగం వారిని బయటకు తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలను వేగవంతం చేయాలని రంగారెడ్డి కోరారు. 2006లో ఈ సొరంగ మార్గం పనులు ప్రారంభం కాగా 19 ఏండ్లయినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం నల్ల...