Seethakka criticizes BRS and BJP: అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ డుమ్మాపై సీతక్క ఫైర్
Seethakka criticizes BRS and BJP: బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి సీతక్క. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ఎంపీలు డుమ్మాకొట్టారు. దీనిపై సీతక్క స్పందించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ ఎంపీలు హాజరుకాకపోవడంపై మంత్రి సీతక్క (Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీం అని మరోసారి రుజువైందన్నారు. కేసులు ఉన్నాయి కాబట్టే వారు కేంద్రంపై పోరాటం అంటే సమయానికి ఎగ్గొడతారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. అందుకే అఖిలపక్ష ఎంపీల సమావేశానికి రాలేదన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పదే పదే కోరే బీఆర్ఎస్ ఈరోజు...