Seetakka | మా జోలికొస్తే నాశనమైపోతావ్
సొంత చెల్లిని కూడా ఓర్వలేని అహంకారం నీది
కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్
వరంగల్ వాయిస్, ములుగు : సమ్మక్క-సారక్క వారసులం.. మా జోలికొస్తే నాశనమైపోతావ్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సొంత చెల్లెలిని కూడా ఓర్చలేని అహంకారం నీదన్నారు. నిజంగా నీకు ఆడబిడ్డల మీద గౌరవముంటే నా మీద ఈ దాడులు జరిగేవి కావన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క కేటీఆర్ పై తీవ్రవ్యాఖ్యలు చేశారు. తాను ఆదివాసి మహిళనని చూడకుండా కావాలని రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి కోయ వర్గానికి మంత్రి పదవి లభించిందని, అదే తనకు ఓ బాధ్యతగా భావించి ములుగు అభివృద్ధికి కృషి చేస్తున్నానని సీతక్క తెలిపారు. నేను ఎలాంటి తప్పు చేసినా, అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయండన్నారు. అంతేకాని పక్క నియోజకవర్గాల నుంచి ప...