పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంఎమ్మెల్యే శంకర్ నాయక్వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 47 మంది బాధితులకు మంజూరైన రూ.15,99,500 విలువ గల చెక్కులను అందించారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ప్రజాకర్షణ పథకా...