Warangalvoice

Political

Political, Top Stories
సాదాసీదాగా బడ్జెట్‌ కేటాయింపులు ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7లక్షలు ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను రూ.7 నుంచి 9 లక్షల వరకు 5శాతం పన్ను ఆదాయం రూ.30లక్షలు దాటితే 30శాతం పన్ను భారీగా పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపు పెరగనున్న బ్రాండెడ్‌ దుస్తుల ధరలు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెంపు భారీగా తగ్గనున్న టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గింపు లిథియం బ్యాటీరీలపై 21 నుంచి 13శాతానికి కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్‌ లిమిట్‌ రూ.15 నుంచి 30లక్షలకు పెంపు 63వేల సొసైటీల డిజిటలైజేషన్‌ కోసం రూ.2,516 కోట్లు కేటాయింపు ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్‌ పథకం స్వదేశీ ఉత్పత్తుల అ...
కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసులు
Political

కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసులు

28న విచారణకు హైదరాబాద్‌కు రావాలని సూచన వరంగల్ వాయిస్,కడప: కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసులిచ్చింది. ఈనెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్‌రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. అయితే.. ఆరోజు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో తాను విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకి అవినాష్‌ రెడ్డి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో... ఈ నెల 28న విచారణకు హాజరుకావల్సిందిగా ఎంపి అవినాష్‌ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసులిచ్చింది.  ...
కనకదుర్గమ్మ సన్నిధిలో జనసేనాని
Political

కనకదుర్గమ్మ సన్నిధిలో జనసేనాని

వారాహికి ప్రత్యేక పూజలో పాల్గొన్న పవన్‌ కళ్యాణ్‌ వరంగల్ వాయిస్,విజయవాడ: కొండగట్టులో తొలిపూజ చేసిని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవారం విజయవాడలోని శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రచారరథం వారాహికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం పవన్‌ వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ అర్చకులు పవన్‌ కు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రికి వచ్చానని పవన్‌ అన్నారు. మంగళవారం కొండగట్టులో వారాహికి పూజలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడనని.. ఏపీ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానట్లు చెప్పారు. రాజకీయల్లో కొత్త నాయకులు రావాలని కోరుకుంటున్నానని, రాక్షస పాలనను తరిమికొట్టడమే వారాహి లక్ష్యమని పవన్‌ స్పష్టం చేశారు. పవన్‌ పర్యటన సందర్భంగా విజయవాడ, ఇంద్రకీలాద్రి పరిసరాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. జనసేన అధినేత పవన్‌ ...
నేడు ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్‌ యుద్దభేరీ
Political, Telangana

నేడు ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్‌ యుద్దభేరీ

బిజెపి లక్ష్యంగా సమరశంఖం పూరించనున్న కెసిఆర్‌ బిజెపికి ప్రత్యామ్నాయం చూపే దిశగా బిఆర్‌ఎస్‌ అడుగు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్‌ తొలి బహిరంగసభకు రంగం సిద్దం అయ్యింది. ఈనెల 18న బుధవారం సాయంత్రం జరిగే సభతో బిజెపికి సవాల్‌ విసిరేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ రంగం సిద్దం చేసుకున్నారు. 9 రాష్టాల్ల్రో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. కెసిఆర్‌ అవినీతి పాలన అంటూ విమర్శలు చేస్తోంది. తెలంగాణలో అధికారం తమదే అని ప్రకటించుకుంది. ఈ క్రమంలో కేంద్రంలోని బిజెపిని చెండాడడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్‌ తొలి అడుగు ఖమ్మం నుంచి వేయబోతోంది. బిజెపికి కెసిఆర్‌ సవాల్‌ విసరబోతున్నారు. అలాగే దేశంలో బిజెపిని ఎదుర్కొనేందుకు వివిధ ప్రాంతీయపార్టీలతో కలసి కెసిఆర్‌ బిఆర్‌ఎస్‌ను ముందుకు తీసుకుని వెల్లేందుకు పక్కా వ్యూహం సిద్దం చేసుకున్నారు. తెలంగాణలో బిజెపిని చా...
ధరలు తగ్గించాల్సిందే..
District News, Hanamkonda, Political

ధరలు తగ్గించాల్సిందే..

పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలి బీజేపీ, టీఆర్ ఎస్ దొందుదొందే కాంగ్రెస్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నిత్యావసర, పెట్రో, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ , హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను, గ్యాస్ ధరలను తగ్గించాలని ఉప్పులు, పప్పులపై, పాలపై విధించిన జీఎస్టీని వేసి పేదల నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాలు వెంటనే అధిక ధరలను, తగ్గించి జీఎస్టీని ఎత్తివేయాలని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిరాశ్రయులైన వరద బ...
పాద‌యాత్ర‌ల జోరు
Political, Today_banner, Top Stories

పాద‌యాత్ర‌ల జోరు

సెంటిమెంటుగా భావిస్తున్న నేత‌లు ఎన్టీఆర్‌తో శ్రీ‌కారం.. వైఎస్ తో వైభవం రాష్ట్రంలో కొన‌సాగుతున్న వైఎస్ శ‌ర్మిల, ప్రవీణ్ కుమార్ పాద‌యాత్ర‌ అత్య‌ధిక రోజులు పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌ నేడు యాదాద్రిలో మూడో విడ‌త ప్రారంభించిన బండి సంజ‌య్‌ రాష్ట్రంలో పాద‌యాత్ర‌ల జోరు కొన‌సాగుతోంది. అధికార‌మే ల‌క్ష్యంగా పాద‌యాత్ర‌ల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. పాద‌యాత్ర‌లు చేయ‌డం ద్వారా ప‌వ‌ర్‌లోకి రావ‌చ్చ‌ని భావిస్తున్నారు. గ‌తంలో ఇది వ‌ర్క‌వుట్ కావ‌డంతో నేటి నేత‌లు సెంటిమెంటుగా భావిస్తున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి సారిగా ఎన్టీరామారావు పాద‌యాత్ర చేప‌ట్ట‌డంద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువై అధికారంలోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా రాష్ట్రమంతా పాద‌యాత్ర చేసి అధికారాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఇదే ఒర‌వ‌డిని వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా కొన‌సాగించి ముఖ్య‌మంత్రి అయ్యా...
టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు
District News, Hanamkonda, Political

టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు

గులాబీకి కన్నెబోయిన రాజయ్య గుడ్ బైత్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వరంగల్ వాయిస్, హనుమకొండ: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నడిచిన సీనియర్‌ నేత, షిప్‌ అండ్‌ గోట్‌ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఆత్మగౌరవం లేని టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండలేకపోతున్నట్లు సీనియర్‌ నేత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్ల నుంచి సీఎం కేసీఆర్ తో కలిసి నడిచిన నేతగా రాజయ్య యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. నాటి ఉద్యమ నేత కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరుగురు సీనియర్‌ నేతలతో కలిసి దీక్ష చేసిన నాయకుల్లో రాజయ్య ఒకరుగా నిలిచారు. కరీంనగర్‌ అలుగునూర్‌ వద్ద అరెస్ట్‌ అయి ఖమ్మం జైలులో కేసీఆర్‌తో కలిసి ఉన్న నేతల్లో రాజయ్య యాదవ్‌ కూడా ఉన్నారు. రాజీమానామాపై విూడియాతో మాట్లాడిన రాజయ్య… టీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవం లేదన్నారు....
హ‌ద్దు మీరొద్దు
District News, Political, Warangal

హ‌ద్దు మీరొద్దు

పార్టీ క్యాడ‌ర్‌కు ఎమ్మెల్యే చ‌ల్లా హెచ్చ‌రిక‌విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై సీరియ‌స్‌ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐదుగురిపై చ‌ర్య‌లుజ‌వాబుదారిత‌నంగా వ్య‌వ‌హ‌రించాలంటూ హిత‌వుప‌ర‌కాల‌లో తిరిగి గులాబీ జెండా ఎగురేసేందుకు కృషి చేయాలి ‘‘ప్ర‌జా సేవే ల‌క్ష్యంగా పార్టీ క్యాడ‌ర్ ముందుకు సాగాలి.. ప్ర‌తీ ఒక్క‌రు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిత‌నంగా వ్య‌వ‌హ‌రిస్తూ వారి అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాలి.. ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ప‌ర‌కాల‌లో తిరిగి గెలిపించేందుకు కృషి చేయాలి.. వివాదాల్లో త‌ల‌దూర్చుతూ హ‌ద్దు మీరి వ్య‌వ‌హ‌రిస్తే వేటు త‌ప్ప‌దు..పార్టీ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది లేదు.. పార్టీలో ప‌ట్టప‌గ్గాలు లేకుండా వ్య‌వ‌హ‌రించేవారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు..’’ అంటూ ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారావు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలిసింది. ప‌ర‌కాల ...
‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి
District News, Political, Telangana, Top Stories

‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి

ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీపార్టీ బలోపేతమే లక్ష్యంఆగ‌స్టు 2నుంచి బండి సంజ‌య్ మూడో విడ‌త పాద‌యాత్ర‌యాదాద్రి లక్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధినుంచి ప్రారంభం26న వ‌రంగ‌ల్‌లో భారీ ముగింపు స‌భ‌హాజ‌రుకానున్న బీజేపీ చీఫ్ న‌డ్డా ఓరుగల్లుపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. అధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్ట‌నున్న‌ మూడో విడ‌త పాద‌యాత్ర‌ను మొద‌ట వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధినుంచే ప్రారంభించి యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధిలో ముగించాల‌ని భావించినా చివ‌రి నిమిషంతో షెడ్యూల్ మారింది. పాద‌యాత్ర‌ను యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధిలో ఆగ‌స్టు 2వ‌ తేదీన ప్రారంభించి అదే నెల 26న వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధిలో ముగించేలా ప్లాన్ చేశారు. ముగింపు సంద‌ర్భంగా క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో భ...
కాంగ్రెస్ సత్యాగ్రహ..
District News, Hanamkonda, Political

కాంగ్రెస్ సత్యాగ్రహ..

సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణపై ఆగ్రహంఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల దీక్షలుఅక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్హనుమకొండలో ‘నాయిని’ ఆధ్వర్యంలో నిరసన వరంగల్ వాయిస్, హనుమకొండ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ అక్రమ నోటీసులు జారీ చేయడాన్ని, రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ భవన్ లో "సత్యాగ్రహ దీక్ష" నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యం, ప్రజల పక్షాన పోరాటాలు చేసే వారు లేకుండా చేయాలని బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై అక్రమ కేసులు పెట్టి ఈడీ విచారణ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీనిపై దేశప్రజలు ఆలోచించాలని, మో...