Warangalvoice

Political

పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
Political, Telangana, Today_banner

పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవస్థ పటిష్టంగానే ఉంది అపోహలు సృష్టించేవారిని యువత నమ్మొద్దు త్వరలోనే మళ్లీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అసవరం లేదు తప్పు చేసిన ఇద్దరి వెనక ఎవరున్నా వదలిపెట్టం విూడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ స్పష్టీకరణ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పటిష్టంగా ఉందని...పేపర్‌ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని మంత్రి కేటీఆర్‌ వివరించారు. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్‌ పీఎస్సీ గుర్తింపు పొందిందని.. కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే ఓటీఆర్‌.. వన్‌ టైం రిజిస్టేష్రన్‌ తీసుకు రావటం జరిగిందన్నారు. ప్రభుత్వ...
ఇడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
Political, Telangana

ఇడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత విచారణ కొనసాగిస్తున్న ఇడి అధికారులు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం అనే సంకేతం ఇస్తూ కవిత కార్యాలయం లోకి వెళ్లారు. కాగా, కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నేతలు తుగ్లక్‌రోడ్డులోని నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావుతో కవిత భేటీ అయ్యారు. గతరాత్రినుంచే వీరు అనేక అంశాలపైనా చర్చించారు. ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో కసరత్తు చేశారని సమాచారం. ఇదిలావుంటే ఈడీ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో.. ఆ ఆఫీస్‌లో కూర్చున్న తర్వాత కవిత ముఖంలో కనిపించిన ఆందోళన, భయానికి ...
హస్తిన వేదికగా లేచింది మహిళా లోకం
Political, Today_banner

హస్తిన వేదికగా లేచింది మహిళా లోకం

మహిళా రిజర్వేషన్లపై పిడికిలి బిగింపు జంతర్‌మంతర్‌ వద్ద దీక్షను ప్రారంభించిన ఏచూరి మహిళాబిల్లు చారిత్రక అవసరమన్న కవిత వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకూ విశ్రమించేది లేదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వెళ్లడిరచారు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని కవిత అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత ఢల్లీిలోని జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేపట్టారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఫీుభావం ప్రకటించారు. అంతకుముందు వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవ...
ఇక జగన్‌కు విశాఖ ఉక్కు సెగ
Political

ఇక జగన్‌కు విశాఖ ఉక్కు సెగ

రాజధానిని తరలిస్తే మరింత ఉధృతంగా పోరాటం ఇక నిరంతరంగా పోరాటాలకు అవకాశం వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: విశాఖకు రాజధానిని మారుస్తానని, త్వరలోనే తన నివాసం కూడా విశాఖే అని చెబుతున్న సిఎం జగన్‌ ఇక వివృాక ఉక్కు ఆందోళనలను ప్రత్యక్షంగా ఎదుర్కోక తప్పదు. ఆరునూరైనా విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మేస్తామన్న కేంద్రం ప్రకటనతో ఇప్పటికే విశాఖ ప్రజలు,కార్మిక సంఘాలు,రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కానివ్వబోం.. అంటూ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం కుండ బద్ధలు కొట్టేసింది. ఏ మాత్రం అనుమానాల్లేకుండా ప్లాంట్‌ ప్రైవేటీకరణ తథ్యమని ప్రకటించింది. ప్లాంట్‌ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్పింది. ఈ క్రమంలో జగన్‌ బస ఇక విశాఖకు మారితే ఉక్కు ఫ్యాక్టర...
ఇడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం
Political, Telangana, Top Stories

ఇడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం

బిఆర్‌ఎస్‌ను కూల్చే కుట్రలు ఫెయిల్‌తో నోటీసులు తెలంగాణ బిడ్డలం వెరిచేది లేదన్న ఎమ్మెల్సీ కవిత మోడీ పాలనా వైఫల్యాలపై ఘాటు విమర్శలు వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను.. తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ బిడ్డనని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని అన్నారు. ఢల్లీిలో ఎమ్మెల్సీ కవిత విూడియాతో మాట్లాడారు. తాను విచారణకు సహకరిస్తాన్న కవిత ..ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్‌ సంతోష్‌ సిట్‌ ముందుకు ఎందుకు రావడం లేదని ఎదురు ప్రశ్నించారు. సిట్‌ ముందుకు వచ్చేందుకు బీఎల్‌ సంతోష్‌కు భయమెందుకు..? అని కవిత ప్రశ్నించారు. బీజేపీ నేతలు, బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఉండవు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు పెడుతారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ...
అవి ఇడి సమన్లు కాదు..మోడీ సమన్లు
Political, Telangana

అవి ఇడి సమన్లు కాదు..మోడీ సమన్లు

వరుసగా మంత్రులు,నేతలపైనా దాడులు తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను అస్థిర పరచే కుట్ర విపక్షాలపైనే 90 శాతం దాడులు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న తీరు దారుణం ఆదానీకి బినావిూగా మోడీ అన్నదే నిజం డబుల్‌ ఇంజన్‌ అంటే మోడీ..ఆదానీ ఆదానీ సంస్థల్లో అవినీతిపై నోరు మెదపని మోడీ ఆదానీ పోర్టుల్లో డ్రగ్స్‌ దొరికినా చలనం లేదు నిబంధనలకు విరుద్దంగా ఆదానికీ ఆరు ఎయిర్‌పోర్టులు విూడియా సమావేశంలో మోడీని ఏకిపారేసిన కెటిఆర్‌ వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు.. కచ్చితంగా మోదీ సమన్లని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. వరుసగా మంత్రుల విూదా ఇడి,ఐటి దాడులు చేయించారని అన్నారు. మా మంత్రి గంగుల విూద ఈడీ, సీబీఐ దాడులు చేయించారు. మల్లారెడ్డి విూద ఐటీ దాడులు చేయించారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పీఏ ఇంటి విూద ఈడీ దాడి చేసి...
న్యూఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు
Political, Telangana

న్యూఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు

కెసిఆర్‌ తనయ కవితకు ఇడి నోటీసులు 9న విచారణకు రావాలని ఆదేశాలు 15 తరవాత వస్తానంటూ కవిత లేఖ కవితకు నోటీసులపై భగ్గుమన్న బిఆర్‌ఎస్‌ నేతలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణకు 9న గురువారం హాజరు కావాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఇడి లేఖ రాసింది. అయితే ముందస్తు బిజీ షెడ్యూల్‌ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని వెంటనే కవిత కూడా బదులిచ్చారు. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మార్చి 9న ఈడీ విచారణకు హాజరుకాలేనని లేఖలో తెలిపారు. ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10న ఢల్లీిలో జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష ఉన్నందున సమయం కావాలని కోరారు. ముందస్తు అపాయింట్‌మెంట్స్‌ ఉన్నందున.. విూరు చెప్పిన టైంలో విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ.. ఈడీకి కవిత లేఖ రాశారు. ఈ లేఖకు ఈడీ ఎలాంటి సమాధానం ఇస్తుందనే ఆసక్తికరంగా మారింది. ...
గవర్నర్‌ మార్పు వెనక రాజకీయ లక్ష్యం ?
Political

గవర్నర్‌ మార్పు వెనక రాజకీయ లక్ష్యం ?

జగన్‌ నిర్ణయాలకు చెక్క పెట్టే ఉద్దేశ్యం ఎపిలో పాగా వేయాలన్న వ్యూహంలో భాగమా వరంగల్ వాయిస్,అమరావతి: ఎపిలో అధికారం కోసం అర్రులు చాస్తున్న బిజెపి మెల్లగా జగన్‌కు చెక్‌ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే గవర్నర్‌ మార్పు అన్న చర్చ జరుగుతోంది. అనూహ్యంగా ఎపికి కొత్త గవర్నర్‌గా మాజీ సుప్రీం న్యాయమూర్తిని నియమించడం ద్వారా జగన్‌కు హెచ్చరికలు పంపారా అన్న చర్చకూడా సాగుతోంది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆకస్మికంగా మార్చి.. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను నియమించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో లాగా ఎపిలోనూ దూకుడుగా వ్యవహరించే గవర్నర్‌ ఉండాలని బిజెపి అధిష్లానం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.జగన్‌ ప్రభుత్వ అనాలోచిత విధానాలు, పోకడలను అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను కేంద్రం గుర్తించిందా అన్న సందేహం తాజా నియామకం ద్వారా వ్యక్తమవుతోంది....
తెలంగాణలో అద్భుత ప్రగతి
Political, Telangana, Top Stories

తెలంగాణలో అద్భుత ప్రగతి

అన్నిరంగాల్లోనూ గణనీయమైన ప్రగతి విద్యుత్‌, తాగు,సాగునీటి రంగాల్లో విప్లవం దేశానికి ఆదర్శంగా నిరంతర విద్యుత్‌ పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణ గ్రామాలు అంబేద్కర్‌ స్ఫూర్తితో దళితుల స్వాలంబన అభివృద్ధికి కృషి కెసిఆర్‌ దక్షతకు తెలంగాణ సర్వతోముఖాభివృద్ది అసెంబ్లీ భయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళసై ప్రసంగం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ ఆవిర్భవిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పరిపాలన దక్షత, ప్రజా ప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిరదని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి ఉచిత తాగునీటి సరఫరా జరుగుతోందని అన్నారు. ఒకప్పుడు పాడుబడిన తెలంగాణ...
తెలంగాణలో వేగవంతమైన ప్రగతి
Political, Telangana, Top Stories

తెలంగాణలో వేగవంతమైన ప్రగతి

కెసిఆర్‌ జాతీయ రాజకీయాలపై సానుకూలత ప్రత్యామ్నాయ రాజకీయాలపై ప్రజల్లో ఆసక్తి వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత విధానంలో ముందుకు సాగితే మరో వందేళ్లయినా అభివృద్ధి సాధించమన్న ప్రకటన ఆలోచింపచేసేదిగా ఉంది. తాజా బడ్జెట్‌ చూస్తుంటే కెసిఆర్‌ ప్రకటన అక్షరాల నూటికి నూరుపాళ్లు నిజం. నిజానికి దేశాన్ని..ఇతర రాష్టాల్రను పోల్చిచూస్తే తెలంగాణలో తెలంగాణలో వేగవంతమైన ప్రగతి కనిపిస్తుంది. సాగునీటి రంగంతో పాటు విద్యుత్‌ రంగంలో గణనీయమైన మార్పలు చూస్తున్నాం. పాఠశాలల గతిని మారుస్తున్నారు. దేశానికి కొత్త తరహా రాజకీయం అవసరమని.. ఇటీవల కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతోంది. నిజానికి 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత కూడా మన రాజ్యాంగం ద్వారా పేదలు, అతిపేదలు, ప్రజలకు మేలు కలగడం లేదు. కేవలం రాజకీయ వ్యవస్థమాత్రమే బలోప...