కెసిఆర్ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
అభివృద్దికి నమూనా తెలంగాణ
బిజెపి విమర్శలను తిప్పికొట్టాల్సిందే: వేముల
వరంగల్ వాయిస్,నిజామాబాద్: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కడతారని, మరోమారు తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానేనని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. తెలంగాణతో పాటు, దేశంలోనూ బిజెపికి ప్రజలు వాతలు పెటట్డం ఖాయమని అన్నారు. తెలంగాణ అభివృద్ది ముందు మోడీ నిలవలేరని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, బిజెపి నాటకాలను కూడా ఎండగట్టాలని మంత్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, ఎగిరేది గులాబీ జెండేనని చెప్పారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో తెలంగాణ రైస్ బౌల్‌గా మారిందన్నారు. నీటి సరఫరాతో ధాన్యాగారంగా మారిందన్నారు. వడ్లను కొనే దమ్ముకూడా బిజెపి ప్రభుత్వానికి ల...