Warangalvoice

Political

స్థానిక ఎన్నికలకు బ్రేక్ | Local Elections Stay
Political, Warangal_TriCites

స్థానిక ఎన్నికలకు బ్రేక్ | Local Elections Stay

ఉదయం నోటిఫికేషన్.. మధ్యాహ్నం స్టే బీసీ రిజర్వేషన్ల జీవో 9పై వాదోపవాదనలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు నాలుగు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశంవరంగల్ వాయిస్ ప్రతినిధి : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు లోకల్‌ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.ఉదయం నోటిఫికేషన్..రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వ...
పేద, మధ్యతరగతికి జీఎస్టీ పండుగ
Political, Warangal_TriCites

పేద, మధ్యతరగతికి జీఎస్టీ పండుగ

మోదీ ప్రభుత్వం  పండుగ గిఫ్ట్ భారీగా  జీఎస్టీ తగ్గింపు రైతులకు, విద్యార్థులకు ఊరట మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ వరంగల్ వాయిస్, (వరంగల్, సెప్టెంబర్ 22): నూతనంగా సవరించిన జీఎస్టీ శ్లాబులు ఈరోజు నుంచి అమలులోకి వస్తున్నాయని, ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బోనంజా లాంటిదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ, స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో దేశం మరింత శక్తివంతం అవుతుందని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వరంగల్ జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు, నెక్స్ట్ జెన్ జీఎస్టీ అభియాన్ జిల్లా కన్వీనర్ రత్నం సతీష్ షా ఆధ్వర్యంలో ఎల్.బి. నగర్‌లోని రాయన్ ప్యాలెస్ హాల్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ స...
దామెరలో ఫ్లెక్సీల రగడ
Political

దామెరలో ఫ్లెక్సీల రగడ

వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామర మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించి వేయడం ఉద్రిక్తలకు దారితీసింది. రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న సందర్భంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పుట్టగతులు ఉండవన్న భయంతోనే బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ మేరకు దామెర పోలీసులను పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
బీహార్ లో రానున్నది ఇండియా కూటమే… వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
Political, Warangal

బీహార్ లో రానున్నది ఇండియా కూటమే… వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ వాయిస్, వరంగల్ : బీహార్ లో రానున్నది ఇండియా కూటమేనని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.మంగళవారం బీహార్ సుపాల్ లోని నిర్వహించిన ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ...20 ఏళ్ల ప్రజా కంటక నితిష్ బీజేపీ పాలన నుంచి బీహారిలకు విముక్తి లభించ బోతున్నదని ఎంపీ కడియం కావ్య అభిప్రాయ పడ్డారు. ఓట్ చోరి సార్ ఊతంగా దొడ్డి దారిన గద్దెను ఎక్కాలని కలలు కంటున్న ఎన్ డిఏ బ్యాచ్ కు శంకర గిరి మాన్యాలు తప్పవని ఎంపీ అన్నారు. బీహార్ మిథిలాంచల్ ప్రాంతంలో సుపాల్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ అధికార యాత్ర కు వస్తున్న విశేష స్పందనపై విషయాలను ప్రస్పుటం చేస్తోందని ఎంపీ పేర్కొన్నారు. ప్రజల్లో ఆగ్రహం, యువత ఆక్రోశం, మహిళల ఆవేదన తమకు యాత్ర లోస్ప...
వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలు మెరుగుపర్చాలి…ఎంపీ డాక్టర్ కడియం కావ్య
Political, Warangal

వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలు మెరుగుపర్చాలి…ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలంటూ శుక్రవారం పార్లమెంట్ లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ప్రధానంగా గ్రామీణ మెడికల్ కళాశాలల్లో డాక్టర్లు, సిబ్బంది, అధ్యాపకుల నియామకాలు, ల్యాబ్స్, లైబ్రరీలు, హాస్టళ్లు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ టూల్స్ గ్రామీణ సేవలకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై వరంగల్ ఎంపీ వివరణ కోరారు. గ్రామీణ మెడికల్ కళాశాలల్లో సదుపాయాలను కల్పించడంతోపాటు సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఎంపీ కోరారు. మెడికల్ కళాశాలలకు మరిన్ని ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. కొత్త మెడికల్ కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు 2023 నిబంధనల ప్ర...
కొండా సురేఖపై క్రిమినల్ కేసు ఫైల్ చేయండి
Crime, Political

కొండా సురేఖపై క్రిమినల్ కేసు ఫైల్ చేయండి

పోలీసులకు సూచించిన నాంపల్లి కోర్టు ఈ నెల 21 వరకు టైం.. మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం కేసులో సంచలన తీర్పు వరంగల్ వాయిస్, వరంగల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు శనివారం పోలీసులను ఆదేశించింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో కొండా సురేఖపై ఈ నెల 21 లోగా నోటీసు జారీ చేయాలని కోర్టు సూచించింది. కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారణమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఫిర్యాదుతోపాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత, నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్టు కోర్టు గుర్తించింది. ఇక కొండా సరేఖ తరుపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచార...
బీజేపీదే అధికారం
Political

బీజేపీదే అధికారం

రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీలో చేరిన యువ నాయకుడు నరేష్ నాయక్ వరంగల్ వాయిస్, డోర్నకల్ : డోర్నకల్ మండల యువ నాయకుడు ధరావత్ నరేష్ నాయక్ బీజేపీలో చేరారు. డోర్నకల్ మండల కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి మహబుబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగన పార్టీ సమావేశంలో ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు కషాయం కండువ కప్పి ఆవ్వానించారు. ఆయనతో పాటు మాజీ డీఆర్యూసీసీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు మైను పాషా కూడ బీజేపీలో చేరారు. మోడి నాయకత్వంలో తెలంగాణలో అధికారం చేప్పటబోతున్నామని రాంచందర్ రావు ఉద్ఘాటించారు. ముఖ్యంగా యువతకు సముచిత స్థానం కల్పిస్తామని హామి ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మానుకోట ప్రాంత ప్రజలు బీజేపీని ఆదరించి అత్యధిక సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు మున్సిపల్ చైర్మన్ స్థానాలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ...
డీసీసీ అధ్యక్షుడిగా దొమ్మాటి?
Political, Warangal_TriCites

డీసీసీ అధ్యక్షుడిగా దొమ్మాటి?

రేవంత్, వేం సూచనలతో ఫైనల్ ఏఐసీసీకి చేరిన దస్త్రం ఒకటి, రెండు రోజుల్లో నియామకపు ఉత్తర్వులు పలువురు ఆశావహులకు నిరాశ కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా దొమ్మాటి సాంబయ్య నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీకి ప్రతిపాదనలు అందినట్లు ప్రచారం సాగుతోంది. డీసీసీ అధ్యక్ష పీఠం తమ వర్గ నాయకుడికి కట్టబెట్టాలని చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్ఠానం దొమ్మాటి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీకి దొమ్మాటి సాంబయ్య గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు. అయితే కడియం శ్రీహరి కూతుకు డాక్టర్ కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవిని సాంబయ్యకు కట్టబెడితే తగిన న్యాయం జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన ప్రధాన అనుచరుడికి అ...
23న ‘లోకల్’ కోడ్!
Political, Today_banner

23న ‘లోకల్’ కోడ్!

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోండి కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్ పోలింగ్ సిబ్బంది వివరాలు మరోసారి పరిశీలించాలంటూ ఆదేశం గ్రామాల్లో మొదలైన సందడి పెరిగిన ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ సూచించింది. పోలింగ్ సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో ఈనెల 23న స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రానున్నట్లు ప్రచారం సాగుతోంది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులకు అవసరమైన సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు ని...
భాజాపాలోకి నవనాయకుడు
Political

భాజాపాలోకి నవనాయకుడు

సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఉవ్వీళ్లు గ్రామాల్లో పర్యటిస్తూ యువకుల్లో చైతన్యం నింపుతున్న నేత త్వరలో పార్టీలో చేరేందుకు రంగం సిద్దం వరంగల్ వాయిస్, డోర్నకల్ : డోర్నకల్ బీజేపీలో మరో ముఖచిత్రం ఆవిషృతం కాబోతోంది. డోర్నకల్ మండలం చాంప్లతండా గ్రామ పంచాయతీలోని ధరావత్ తండాకు చెందిన విద్యావంతుడు, వ్యాపార వేత, నవ యువ నాయకుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దేశ ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలు, హిందుత్వ భావజాలంతో భాజపాలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జూలై నెల చివరిలో కాని వచ్చే నెల మొదటి వారంలోకాని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మేల్యే స్థానాన్ని భాజాపా అభ్యర్దితో భర్తీ చేయడమే లక్ష్యంగా పార్టీని సంస్దగతంగా బలోపేతం చేసేందుకు సదరు యువకుడు కాషాయం పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప...