Warangalvoice

Mulugu

మీ ఆశీర్వాదం కావాలి | CM Revanth Reddy
Cultural, Mulugu, Warangal_TriCites

మీ ఆశీర్వాదం కావాలి | CM Revanth Reddy

నేనేమి మనులు, మాణిక్యాలు అడగడం లేదు మేడారానికి జాతీయ హోదా కల్పించాలి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందుకు కృషి చేయాలి జాతర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుదాం.. వెయ్యేళ్లు శాశ్వతంగా ఉండేలా గ్రానైట్ తో నిర్మిద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కోట్లాదిమంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కుంభమేళా తరహాలో జాతీయ హోదా కల్పించి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అందుకు రాష్ట్రం నుంచి ప్రాముఖ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలన్నారు. పునర్నిర్మాణంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,...
Seetakka-మహిళా సాధికారతే లక్ష్యం
Mulugu, Telangana

Seetakka-మహిళా సాధికారతే లక్ష్యం

పలు వ్యాపారుల్లో వారి భాగస్వామ్యం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వరంగల్ వాయిస్, ములుగు : మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సెర్ఫ్ అదనపు సీఈఓ పి.కట్యాయని దేవి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్., ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలిసి మంత్రి సీతక్క ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ కళలను నెరవేర్చడానికి కాంగ్రెస్ సర్కార్ పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మహిళల జీవితాల్లో వ...
ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇళ్లు
District News, Mulugu

ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇళ్లు

అదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వరంగల్ వాయిస్, ములుగు : పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ, నిర్మాణం పనులను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా.. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలను ప్రభుత్వమే సమకూర్చుతోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వ...
చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుదాం
Mulugu, Top Stories

చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుదాం

డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య వరంగల్ వాయిస్, ములుగు : చిన్న పిల్లలకు టీకాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా బుధవారం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ములుగు మండలం రాయిని గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జంగాలపల్లి, కొత్తూరు, సర్వాపూర్ సబ్ సెంటర్ లతో పాటు రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా చేశారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలలో దాదాపుగా 15 మంది పిల్లలకు టీకాలు ఇవ్వడం తనిఖీ చేశారు. దీంతో పాటు ప్రతి ఆశలకు, ఏఎన్ఎంలకు ముందుగా ప్రతి గర్భిణీ స్త్రీని నమోదు చేసి డెలివరీ అయ్యి నెలన్నర రోజులు వరకు తల్లి పిల్లలను చూసుకోవలసిన బాధ్యత మన ఆరోగ్య శాఖ సిబ్బందికి ఉందని తెలిపారు. అలాగే, మున్ముందు వర్షాకాలం ప్రారంభం కాబోతున్నందున కాలానుగుణంగా వచ్చే వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆశలకు, ఏఎన్ఎంలకు తగు సూచనలు చేయడం జరిగింది. మార్గమధ్యలో బావి తీస్తున్న కూలీలు కనపడగా అది ఒంటిగంట ...
ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి
Mulugu

ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి

ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి వరంగల్ వాయిస్, ములుగు : ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై పీఓలు, ఏపీఓలకు, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలు పీవోలు , ఏపీవోలు, ఓపీఓల పాత్ర కీలకంగా ఉంటుందని ఎన్నికల సంఘం విధివిధానాలపై అందరికీ అవగాహన ఉండాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఓటర్లు బ్యాలెట్ బాక్స్ లలో బ్యాలెట్ పేపర్ తో ఓటు వేస్త...
టీఎస్’ స్థానంలో ‘టీజీ’ తక్షణమే అమలు
Mulugu

టీఎస్’ స్థానంలో ‘టీజీ’ తక్షణమే అమలు

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వరంగల్ వాయిస్, ములుగు : టీఎస్ స్థానంలో టీజీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసినందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే 'టీఎస్' స్థానంలో టీజీని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలుబడ్డాయన్నారు. జిల్లాలో ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఏదైనా ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ ను టీఎస్ బదులుగా టీజీని వాడాలని కలెక్టర్ కోరారు.  ...
యువత కళలలో రాణించాలిములుగు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య
Cultural, District News, Mulugu

యువత కళలలో రాణించాలిములుగు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య

వరంగల్ వాయిస్, ములుగు: జిల్లా యువత కళలలో రాణించాలని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ గార్డెన్స్ లో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి జానపద నృత్యాలు, జానపద గీతాలు, కబట్టి ,వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ను స్ఫూర్తిగా తీసుకొని యువత చదువుతో పాటు సాంస్కృతిక రంగంలో రాణించాలన్నారు. ములుగు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇవి మొట్టమొదటిసారి యువజన ఉత్సవాలు అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి పి. వెంకటరమణ చారి, న్యాయ నిర్ణయితలుగా నరసింహ, తాడిచెర్ల రవి, సంధ్యా రాణి,...
‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్
Crime, District News, Mulugu

‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్

వరంగల్ వాయిస్, ములుగు: న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో నిందితులకు ఈనెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మల్లారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను ములుగు పోలీసులు శనివారం ఇన్ చార్జి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో 11 మంది నిందితులు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టు ముందు ఏ1 గోనెల రవీందర్, ఏ2 పిండి రవి యాదవ్, ఏ3 వంచ రామ్మోహన్ రెడ్డి, ఏ4 తడక రమేష్ లను ప్రవేశపెట్టారు. హత్య నేరం అభియోగంపై రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి, నిందితులకు ఈనెల 18 వరకు రిమాండ్ విధించి ఖమ్మం జైలుకు తరలించారు....
లాయ‌ర్ దారుణ హ‌త్య‌
Crime, District News, Mulugu

లాయ‌ర్ దారుణ హ‌త్య‌

వ‌రంగ‌ల్ వాయిస్‌, ములుగు : ములుగు జిల్లాలో సోమ‌వారం రాత్రి ఏడు గంట‌ల ప్రాంతంలో లాయ‌ర్‌ను దారుణంగా హ‌త్య చేశారు. ములుగు జిల్లా కేంద్రానికి 11 కిలోమీట‌ర్ల దూరంలోని పందికుంట బస్టాఫ్ వద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలిసింది. హ‌త్య‌కు గురైన వ్య‌క్తి న్యాయవాది మల్లారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఎర్ర మట్టి క్వారీ.…భూ త‌గాదాలు.. పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది....
రీజనల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు
Mulugu

రీజనల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు

వరంగల్ వాయిస్, మంగపేట : మంగపేట మండల కేద్రంలోని శ్రీ దుర్గా మోడరన్ రైస్ మిల్లులో అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. శుక్రవారం వరంగల్ రీజనల్ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అడిషన్ ఎస్పీ రామారావు ఆదేశాల మేరకు ములుగు జిల్లా మంగపేట మండలంలో శ్రీదుర్గా మోడరన్ రైస్ మిల్లు పై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 420 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని, 55 క్వింటాళ్ల బ్రోకెన్ రైస్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని, మిల్లు ఓనరుపై తగు చర్యల తీసుకునేందుకు సివిల్ సప్లై అధికారులకు రిపోర్ట్ పంపటం జరిగిందని వారు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ రాకేష్ , పీసీ సుమన్ రెడ్డి, రమేష్ సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ రాంచందర్, మంగపేట రెవిన్యూ ఇస్పెక్టర్ నేత కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు....