Warangalvoice

Mahabubabad

బావిలోకి దూసుకెళ్లిన కారు
Crime, District News, Mahabubabad

బావిలోకి దూసుకెళ్లిన కారు

ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి వ‌రంగ‌ల్ వాయిస్‌, కేస‌ముద్రం : దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తున్న కారు శుక్ర‌వారం రాత్రి ఆరున్న‌ర గంట‌ల ప్రాంతంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కేస‌ముద్రం బైపాస్ రోడ్డు వెంట ఉన్న బావిలోకి దూసుకెళ్ల‌డంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ముగ్గురు కారులోనే చిక్కుకున్నారు. ఇందులో చిన్నారి పాప కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. టేకుల గూడెంనుంచి అన్నారం ష‌రీఫ్‌కు కారులో ఐదుగురు బ‌య‌లు దేరారు. తిరిగి వ‌చ్చే క్ర‌మంలో హ‌హ‌బూబాబాద్‌కు చెందిన మ‌రో ఇద్ద‌రు వీరితో క‌లిశారు. మొత్తం ఏడుగురితో అన్నారం ష‌రీఫ్‌లో బ‌య‌లు దేరిక కారు కేస‌ముద్రం బైపాస్ రోడ్డులో ప్ర‌మాదానికి గుర‌యింది. అయితే కారులో భ‌ద్రుతోపాటు చిన్నారి, మ‌రోక‌రు ఉండ‌గా, అచాలితోపాటు మ‌రో మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ప్ర‌మాదానికి సంబందించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.  ...
డోర్నకల్ యాదవుల్లో ముసలం
District News, Mahabubabad

డోర్నకల్ యాదవుల్లో ముసలం

సోషల్ మీడియా వేదికగా పోస్టుల యుద్ధం వరంగల్ వాయిస్, డోర్నకల్: డోర్నకల్ యాదవ కులంలో ముసలం పుట్టింది. గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ ఇందుకు వేదికైంది. ఆ సంఘానికి మండల చైర్మన్ గా పనిచేసిన కేశబోయిన మల్లేశం పదవీ కాలం ముగిసిందని, ప్రస్తుతం కమిటీ బాధ్యతలు పశు వైద్యధికారి సురేష్ కు ఇవ్వడంతో తదుపరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇన్ చార్జి చూస్తారని మాజీ ఎంపీటీసీ కొత్త రాంబాబు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపై గొర్రెల పెంపకదారులు కొందరితో కలిసి కలిసి బుధవారం పశు వైద్యుడు సురేష్ కు వినతి పత్రం అందించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో సందేహాలను డాక్టర్ ను కలిసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ విషయంపై రికార్డైన వీడియోను కొందరూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై కేశబోయిన మల్లేశం ఘాటుగా స్పందించారు. డోర్నకల్ మండల గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ పదవీ కాలం ముగిసిందని, య...
లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..
Bhupalapally, District News, Hanamkonda, Mahabubabad, Top Stories, Warangal

లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..

ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. నేతలు, లీడర్లు అంతా ఆటో కార్మికులను కలిసి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, వరంగల్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, బీజేపీ నేత రాకేష్‌ రెడ్డి తదితరులు ఆటో నడిపి ఆటో కార్మికులను ఉత్సాహపరిచారు. -వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి Gandra Venkataraman Reddy...
పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలి
District News, Mahabubabad

పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలి

వరంగల్ వాయిస్, తొర్రూరు : పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని, ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని స్థానిక జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తొర్రూరు మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పి.రఘునారాయణ అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి వీరయ్య హాజరై మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో సంఘం పనిచేస్తుందని, పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందని తెలిపారు. పెన్షనర్స్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ప్రతి నెల 1న జీతాలు ఇవ్వాలని, మెడికల్ బిల్స్ ను వెంటనే మంజూరు చేసి, సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. 398 వేతనంపై పనిచేసిన టీచర్స్ కు నోషల్ ఇంక్రిమెంట్ ఇచ్చి, లైఫ్ సర్టిఫికెట్స్ ఆన...
రామకృష్ణకు మా అసోసియేషన్ శుభాకాంక్షలు
Mahabubabad

రామకృష్ణకు మా అసోసియేషన్ శుభాకాంక్షలు

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దర్శనం రామకృష్ణకు మా అసోసియేషన్ తరపున అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ 1996 సంవత్సరం నుంచి తన కుటుంబ సభ్యులలో ఒకడిగా ఉండి ఎదిగిన దర్శనం రామకృష్ణ భవిష్యత్తులో మంచి న్యాయవాదిగా మహబూబాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ముందుకు సాగాలని అన్నారు. మండలంలోని సింగారం గ్రామానికి చెందిన దర్శనం రామకృష్ణ నిరుపేద కుటుంబంలో జన్మించి అణగారిన వర్గాల ప్రజలకు సహాయపడాలనే తపనతో లా విద్యను పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించారు....
పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి
District News, Mahabubabad

పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో మంద కృష్ణ మాదిగపిలుపు మేరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా 8వ రోజు రిలే నిరాహారదీక్షలో ఎంఎస్పీ మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ గుగ్గిళ్ల పీరయ్య మాదిగ పాల్గొన్నారు. దీక్ష లో ఎంఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి పాషా, మండల ఇంఛార్జి కందిపాటి భిక్షపతి, వీహెచ్ పీఎస్ జిల్లా నాయకులు చలగొల వెంకన్న, మోలుగురి కుమార్, ఎంఎస్పీ మండల నాయకులు, మంద సంపత్, మట్టె మహేష్, బిర్రు మంజుల, బొడ సక్రియా, సాంబ లక్ష్మీ, భిక్ష నాయక్, మాలోతు అమ్మి, చెవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు....
బైక్ కవర్లో పైసలు మాయం
Crime, District News, Mahabubabad

బైక్ కవర్లో పైసలు మాయం

షాపులోకి వెళ్లొచ్చేసరికి అపహరించిన దుండగులురూ.4లక్షలు చోరీ చేశారంటున్న బాధితుడుస్టేషన్ లో ఫిర్యాదు.. పోలీసుల విచారణమహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్: ఓ రైతు బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసుకొని నగదును తన ద్విచక్ర వాహనంలోని ట్యాoకు కవర్ లో పెట్టుకొని బయలుదేరి మార్గ మధ్యలో ఓ షోరూమ్ ఎదుట పార్కింగ్ చేసి లోపలికి వెళ్లి బయటకు వచ్చే సరికే దుండగులు 4 లక్షల రూపాయలు చోరీ చేసిన సంఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్స్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి..జిల్లాలోని మల్యాల గ్రామశివారు రామోజీ తండాకు చెందిన బానోతు శ్రీను అనే రైతు జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు ఎస్బీఐలోని తన ఖాతా నుంచి రూ.4లక్షలు డ్రా చేసుకుని తన ద్విచక్ర వాహనంలోని ట్యాంక్ కవర్ లో పెట్టుకొని బయలు దేరాడు. మార్గమధ్యలో ట్రాక్టర్ షోరూమ్ ఎదుట వాహనాన్ని పార్కింగ్ చేసి షోరూమ్ లోకి వెళ్లి బయటకు వచ్చి ...
అనుమానంతో .. అంతమొందించాడు
Crime, District News, Mahabubabad

అనుమానంతో .. అంతమొందించాడు

భార్యను హత్య చేసిన భర్తనిందితుడి ఇంటికి నిప్పుపెట్టిన బంధువులుమరిపెడ మండలం అనకట్ట తండాలో విషాదం వరంగల్‌, వాయిస్‌, డోర్నకల్‌: ‘‘అమ్మ… లే అమ్మ… నాన్న వెళ్లిపోయా డు… లేవమ్మా’’ అంటూ చనిపోయిన వాళ్ల అమ్మను లేపే ప్రయత్నం చేస్తున్న చిన్నారులను వారించ టం.. సముదాయిం చటం ఎవ్వరి వల్ల కాలేదు. తండ్రి అవేశం వల్ల తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని చిన్నారుల పరిస్థితి చూసి తండావాసులు కన్నీరుపె ట్టారు. మానుకోట జిల్లాలో ఉదయం ఓ మహిళ హత్య సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. మరిపెడ మండలం తానంచర్ల పరిధిలోని ఆనకట్ట తండాకు చెందిన బానోత్‌ రవీందర్‌కు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని నారియ తండాకు చెందిన బానోత్‌ మమత(29) కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది పాటు సజావుగా సాగిన వీరి కాపురానికి గుర్తుగా నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె జన్మించారు. ఆ తర్వాత భార్యపై అనుమాన...
రాష్ట్రపతి ముర్ము చిత్రపటాల బహూకరణ
District News, Mahabubabad

రాష్ట్రపతి ముర్ము చిత్రపటాల బహూకరణ

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లలో భారత రాష్ట్రపతి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము చిత్ర పటాన్ని మహబూబాబాద్ జిల్లా బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సమక్షంలో బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్ర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య, సీనియర్ నాయకులు శశి వర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభు వెంకటేశ్వర్లు, చీకటి మహేష్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంబాబు నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందు భారతి, జిల్లా ఉపాధ్యక్షులు మేరెడ్డి సురేందర్, గూడూరు మండల అధ్యక్షుడు మోతీలాల్, కేసముద్రం మండల అధ్యక్షుడు పొదిలి నర్సింహా రెడ్డి, సింగారపు సతీష్, రేష్మ, పద్మ తదితర జిల్లా నాయకులు, మండల ...
పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
District News, Mahabubabad, Political

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంఎమ్మెల్యే శంకర్ నాయక్వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 47 మంది బాధితులకు మంజూరైన రూ.15,99,500 విలువ గల చెక్కులను అందించారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ప్రజాకర్షణ పథకా...