Warangalvoice

Mahabubabad

మాడిన అన్నం.. గొడ్డు కారం..
Mahabubabad, Today_banner

మాడిన అన్నం.. గొడ్డు కారం..

ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో ఆహారం తినలేక పస్తులుంటున్న విద్యార్థులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీతో వెలుగులోకి మన బిడ్డలకు ఇలాగే పెడతామా అంటూ నిలదీత సాక్షాత్తు కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం నిత్యం సంచరించే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలోని విద్యార్థినులకు మాడిన అన్నం..గొడ్డు కారమే దిక్కైంది. తింటే తిను లేకుంటే పస్తులుండు అన్నట్లుగా అక్కడి వార్డెన్లు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఒకవైపు విద్యార్థులకు మెరుగైన భోజనం వడ్డిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అది అమలుకు నోచుకోవడం లేదు. కలెక్టర్లు గురుకులాలను నెలకోసారి విజిట్ చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. కలెక్టర్లు, ఇతర అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వస్తున్నారని ముందే తెలుసుకుంటున్న గురుకులం నిర్వాహకులు ఆ ఒక్క పూట మాత్రం విద్...
ఆశ్రమ పాఠశాలలో వసతులు కరువు
Mahabubabad

ఆశ్రమ పాఠశాలలో వసతులు కరువు

సోదాలు చేసిన ఏసీబీ పాల్గొన్న వివిధ శాఖల అధికారులు వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : కార్పొరేట్ విద్యారంగానికి దీటుగా ప్రతి నిరుపేద విద్యార్ధినికి నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంగా ప్రభుత్వం మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కనీస వసతులు కరువయ్యాయని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు, విజిలెన్స్, ఐటీడీఏ,స్టేట్ ఆడిట్ అధికారులు పాల్గొన్నారు. పాఠశాలలో అధికారులు కలియతిరుగుతూ విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. నాణ్యమైన భోజన సౌకర్యాలు, నిల్వ సరుకులు, వసతితోపాటు మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ.. పలు ఆరోపణల నేపథ్యంలో ఈ పాఠశాలలో తనిఖీలు చేపట్టామన్నారు. పాఠశాల పరిసర ప్...
కృష్ణ ఎక్స్ ప్రెస్ లో పొగలు
District News, Mahabubabad

కృష్ణ ఎక్స్ ప్రెస్ లో పొగలు

డోర్నకల్ లో నిలిపివేత వరంగల్ వాయిస్, డోర్నకల్ : తిరుపతి నుంచి అదిలాబాద్ వెళ్తున్న కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో శనివారం సాయంత్రం పొగలు రావడంతో దానికి డోర్నకల్ రైల్వేస్టేషన్ లో నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. రైలు నుంచి ప్రయాణికులు హుటాహుటిన దిగిపోయారు. రైలులోని ఎస్-1 భోగి చక్రాల నుంచి పొగలు రావడాన్ని గమనించిన రైలు గాడ్ డ్రైవర్ ని అప్రమత్తం చేశారు. దీంతో రైలును డోర్నకల్ రైల్వే స్టేషన్ లోని ఒకటో నెంబర్ ఫ్లట్ ఫాంపై నిలిపివేశారు. టీఎక్స్ఆర్ డిపార్ట్ మెంట్ వాళ్ళు రైల్వే చక్రాలను పరిశీలించి బ్రేకులు పట్టేయడంద్వారా పొగలు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. చక్రాలను పట్టేసిన బ్రేక్ ప్లేట్స్ తిరిగి వెనక్కి రాకపోవడంతో రాపిడి జరిగి వాసనతో కూడిన పొగ వచ్చిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి రైలును పంపించి వేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు....
Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతన్నతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు.. కాంగ్రెస్‌ పాలనపై హరీశ్‌రావు విమర్శలు
Mahabubabad

Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతన్నతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు.. కాంగ్రెస్‌ పాలనపై హరీశ్‌రావు విమర్శలు

Harish Rao | కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందని తెలిపారు. Harish Rao | కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను కాంగ్రెస్‌ సర్కార్‌ పునరావృతం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేట ముంచి, నడి రోడ్డ...
మెడలోని పుస్తెల తాడు అపహరణ
Crime, Mahabubabad

మెడలోని పుస్తెల తాడు అపహరణ

జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : ఓ మహిళ తన ఇంటి ముందు మనువడిని అడిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి పుస్తెల తాడు, ఇతర బంగారు గొలుసును అపహరించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. కృష్ణ కాలనీ చెందిన మంగళంపల్లి సోమలక్ష్మి తన మనువడిని ఇంటి ముందు ఆడిగిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి నాలుగున్నర తులాల బంగారు పుస్తేల తాడు, బంగారు గొలుసు అపహరించుక పోయాడు. మహిళ, దుండగుడి మధ్య జరిగిన పెనుగులాటలో అర తులం వరకు గొలుసు ఆమె చేతిలోకి రాగా మిగిళిన 4.5 తులాలు బంగారు ఆభరణాలు అపహరించుకు పోయాడు. పెనుగులాటలో మెడపై స్వల్ప గాయాలయ్యాయి. నిత్యం జన సంచారం అధికంగా ఉండే కృష్ణ కాలనీలో దుండగుడు మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలు అపహరించకపోవడం సంచలనం సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరు...
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
Mahabubabad, Top Stories

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

వరంగల్ వాయిస్, మహబాబాబాద్ : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి కె. అభిమన్యుడుతో కలిసి మహబూబాద్ పట్టణంలోని విత్తన దుకాణం, కిసాన్ అగ్రిమాల్ ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా విత్తన దుకాణాల్లో ఉన్న పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న విత్తనాల స్టాక్ వివరాలు స్వయంగా పరిశీలించడం జరిగింది. ధరల పట్టిక ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్, రోజు వారీగా జరిగిన అమ్మకం, రైతుల వివరాలు, రైతుల వారీగా అమ్మిన విత్తన రిజస్టర్లను పరిశీలించారు. దుకాణంలో అనుమతిలేని విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారిని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అమ్మే విధంగా చూడాలని తెలిపారు. ప్రతిరోజు వచ్చిన సరుకు వివరాలు, రైతులకు అమ్మిన విత్తనాల వివరాలు, ముగింపు స్టాక్ -వివరాలు రికార్డులో రాయాలని, లూస్ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరి...
మానుకోటలో దొంగల బీభత్సం
Mahabubabad, Top Stories

మానుకోటలో దొంగల బీభత్సం

తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ భారీగా నగదు, బంగారం అపహరణ వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : దొంగలు తాళం వేసి ఉన్న రెండు ఇళ్ల తాళాలు పగల గొట్టి నగదు, ఆభరణాలు చోరీకి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురం కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న బానోత్ వెంకటేశ్వర్లు-అనిత దంపతులు తమ స్వగ్రామం రెడ్డిగూడెంలో రైస్ మిల్లు నిర్మాణం చేపట్టేందుకు రూ.4 లక్షల 70 వేలు అప్పుగా తెచ్చి ఇంట్లోని డ్రెస్సింగ్ టేబుల్ లో దాచి పెట్టారు. రాత్రి హాస్పిటల్ లో విధులు నిర్వహించేందుకు దంపతులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. విధులు ముగించుకొని మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటికి వేసిన తాళం పగలగొట్టి కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా డ్రెస్సింగ్ టేబుల్ లో దాచి ఉంచిన రూ.4లక్షల 70 వేలు చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ...
శుక్రవారం డ్రై డే విధానం పాటించాలి
Mahabubabad

శుక్రవారం డ్రై డే విధానం పాటించాలి

డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతి బాయి వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, స్టానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రజలకు ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించేలా అవగాహన కలిగించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి బాయి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, గ్రామాన్ని డీఎంహెచ్ఓ కళావతి బాయి సందర్శించారు. ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని, స్టానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి మురుగు గుంతలను పూడ్చివేయాలని, నీరు ఎక్కువగా నిల్వవున్న కుంటలలో ఆయిల్ బాల్స్ కానీ, కిరసనాయిల్ వేయాలన్నారు. కొబ్బరి బొండాలు, పాడై పోయిన టైర్లు, మొదలగువాటిని ఇంటి చుట్టూ ప్రక్కల ఉంచకుండా చూడాలఅన్నా...
కానిస్టేబుల్ ఇంట్లో దొంగల బీభత్సం
Mahabubabad

కానిస్టేబుల్ ఇంట్లో దొంగల బీభత్సం

వరంగల్ వాయిస్, మహబూబాద్ : జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంటిని టార్గెట్ గా చేసుకొని చోరికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో ఓ ఇంట్లో కిరాయికుంటున్న సుందర్ అనే కానిస్టేబుల్ ఇంట్లో చోరీ చేశారు. తులం బంగారం, రూ.46,000 నగదు దొంగలు అపహరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో నమూనాలు సేకరించడంతో పాటు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు....
బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష
Crime, District News, Mahabubabad, Viral News

బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష

మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు మూడేళ్ల క్రితం ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ లో మూడేళ్ల క్రితం తొమ్మిది సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జిల్లా కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ పట్టణంలోని కృష్ణ కాలనీలో నివాసముంటున్న జర్నలిస్ట్ కుసుమ రంజిత్ రెడ్డి-వసంత దంపతులు కుమారుడైన దీక్షిత్ రెడ్డి 18 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ స్థానికంగా ఉంటూ ఆటో మొబైల్ షాప్ నడుపుకుంటున్నాడు. ఆర్థికంగా ఉన్న దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని కుట్ర పన్నిన మంద సాగర్ ఆయ...