
31JulNo Comments
సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్
విద్యావేత్త నుంచి కుడా చైర్మన్ దాక సుందర్ రాజ్ యాదవ్ విజయ ప్రస్థానంఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్ అధిష్ఠాన విధేయుడిగా పేరుఅందరితో కలివిడిగా.. పార్టీకి ట్రబుల్ షూటర్‌గా..చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కు కుడిభుజంగా ప్రసిద్ధిఅఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఘన సన్మానం
తెలంగాణ ఉద్యమ కారుడు.. విద్యా సంస్థల అధిపతి.. టీఆర్ఎస్ క్రియాశీల నాయకుడు.. ఈ మూడు విభిన్న రంగాలకు వంద శాతం న్యాయం చేసిన సమర్థత సుందర్ రాజ్ యాదవ్ సొంతం. ఓపిక, సహనం ఆభరణాలుగా, నిబద్ధత, నిజాయితీ పెట్టుబడిగా ఎదిగిన వినయశీలి. దశాబ్దకాలం ఎదురుచూపులకు కుడా చైర్మన్ పదవి రావడం.. ఉద్యమకారుడికి లభించిన సముచిత గౌరవం. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద కమ్యూనిటీల్లో ఒకటైన యాదవ కులానికి దక్కిన గుర్తింపు.. ఏప్రిల్ 7న బాధ్యతలు స్వీకరించిన సుందర్ రాజ్ యాదవ్ ను అఖిల భారత యాదవ మహాసభ ఘనంగా సన్మానించనుంది. 31న (రేపు) హనుమకొండ చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ ...

14JulNo Comments
విధుల్లో ఆదర్శం.. సేవలో మాణిక్యం
వరంగల్ డీటీసీగా రాణిస్తున్నపెద్దింటి పురుషోత్తంపేద కుటుంబం నుంచి ఉన్నతాధికారిగాఎదిగిన స్ఫూర్తి ప్రదాతఅంకిత భావంతో ఉద్యోగ నిర్వహణ
పేదరికం ఒక విషవలయం అంటారు ఆర్థిక రంగ నిపుణులు.. ‘‘కృషితో నాస్తి దుర్భిక్షమ్.. కష్టేఫలి’’ అనే విజయ సూత్రాలు నమ్మి ఆచరించి, పేదరికం అడ్డుగోడను బద్దలుకొట్టి విజేతలుగా నిలుస్తారు కొందరు.. ఆ కోవకు చెందిన వారే వరంగల్ డీటీసీ పెద్దింటి పురుషోత్తం.. హైదరాబాద్ పాతబస్తీలో పేద కుటుంబంలో పుట్టిన ఈయన చదువుల్లో చురుగ్గా ఉండేవారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగంపై దృష్టి సారించారు. అహర్నిషలు కష్టపడి అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ కొలువు సాధించారు. నిబద్ధతతో పనిచేసి పదోన్నతులు పొంది వరంగల్ డీటీసీగా నియమితులయ్యారు. ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపకుండా యువకుల్లో చైతన్యం తీసుకొస్తున్నా...

22JunNo Comments
హనుమకొండ కోటలో.. ‘హనుమంతుడి’ పాలన
సంక్షేమ పాలనలో వినూత్నం, ఆదర్శంహనుమకొండ జిల్లా కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హన్మంతు తనదైన ముద్ర
ఆయన మంచి పరిపాలనా దక్షుడే కాదు.. గొప్ప మానవతావాది.. ప్రభుత్వ పరంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు చేయూత నిస్తారు. పాలనాధికారిగా వినూత్న ఆలోచనలతో హనుమకొండ జిల్లాలో సరికొత్తగా పథకాలు అమలు చేస్తూ తన మార్క్ ప్రదర్శిస్తున్న రాజీవ్ గాంధీ హన్మంతుపై వరంగల్ వాయిస్ ప్రత్యేక కథనం..
పాలనలో ఫర్ఫెక్ట్.. మంచి పనిమంతుడు.. పాలనా వ్యవహారాలు చక్కదిద్దడంలో ఆయనది ప్రత్యేకశైలి. ప్రతి పనిని ‘కూల్’గా పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఆదేశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తారు. ప్రచార ఆర్భాటాల జోలికి వెళ్లరు. జిల్లా సమగ్రాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ఆయనే.. హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూనే జిల్లాను ప్రగతి పథంలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ...

20JunNo Comments
అడవి జిల్లాలో అభివృద్ధి సాధకుడు
ములుగు జిల్లా కలెక్టర్ గా విశిష్ట సేవలు
ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తూ ములుగు జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారు కలెక్టర్ శ్రీరాంసెట్టి కృష్ణ ఆదిత్య. విధుల పరంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. నిరంతర శ్రమతో వాటిని సాధించడం ఆయనకు తెలిసిన విద్య. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన అభివృద్ధి సాధకుడు. ఆత్మీయ పలకరింపులతోనే సహచర ఉద్యోగుల పనుల్లో వేగం పుంజుకునేట్లు చేయడం ప్రత్యేకత. జిల్లా పాలనాధికారిననే దర్పం ఆయనలో కనిపించదు. జిల్లా ప్రగతికి పక్కా ప్రణాళికలు రూపొందిస్తూనే, అట్టడుగు వర్గాలకు సమన్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ‘ములుగు వెలుగు, మారైతే మారాజు, ప్లాస్టిక్ నియంత్రణ, అటెండెన్స్ యాప్’ కార్యక్రమాలను అమలు చేస్తూ జిల్లాసమగ్రాభివృద్ధికి కలెక్టర్ పాటుపడుతున్నారు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంచేస్తున్నారు కృష్ణ ఆదిత్య.
బ...