Warangalvoice

Latest News

Turmeric farmers | మెట్‌పల్లిలో పసుపు రైతుల ఆందోళన.. జాతీయ రహదారిపై బైఠాయింపు
Latest News

Turmeric farmers | మెట్‌పల్లిలో పసుపు రైతుల ఆందోళన.. జాతీయ రహదారిపై బైఠాయింపు

Turmeric farmers | మద్దతు ధర కోసం(Support price) రైతు ఐక్యవేది ఆధ్వర్యంలో పసుపు రైతులు మంగళవారం రోడ్డెక్కారు. వరంగల్ వాయిస్, మెట్‌పల్లి : మద్దతు ధర కోసం(Support price) రైతు ఐక్యవేది ఆధ్వర్యంలో పసుపు రైతులు మంగళవారం రోడ్డెక్కారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ చేరుకున్నారు. 63వ జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. పసుపునకు క్వింటాలకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎంఐఎస్ పథకం కింద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా పసుపును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్నారు. సంబంధిత అధికారులు వచ్చేవరకు రాస్తారోకోను విరమించేది లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. ఆర్డీవో శ...
KCR | బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ప్రారంభం
Latest News

KCR | బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ప్రారంభం

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభ‌మైంది. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్‌ ప...
Radhakishan Bail Hearing: రాధాకిషన్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే..
Latest News

Radhakishan Bail Hearing: రాధాకిషన్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే..

Radhakishan Bail Hearing: తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి విచారణ జరిగింది. ఫోన్‌ ట్యాపింగ్‌పై పంజాగుట్టలో నమోదైన రెండో ఎఫ్‌ఐఆర్‌పై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్ రావు వేసిన పిటిషన్‌పైన సుదీర్ఘ వాదనల తర్వాత నేడు వాదనలు ముగిశాయి. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. ముందస్తు బెయిల్‌ కోరుతూ రాధాకిషన్ రావు (Radhakishan Rao) దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు వాయిదా వేసింది. గతంలో చక్రధర్‌గౌడ్ ఫిర్యాదుతో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌పై పంజాగుట్టలో నమోదైన రెండో ఎఫ్‌ఐఆర్‌పై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్ రావు వేసిన పిటిషన్‌పైన సుదీర్ఘ వాదనల తర్వాత ఈరోజు వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. చక్ర...
Harish Rao | మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు కాదు.. అప్పుల‌పాల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది.. కాంగ్రెస్ స‌ర్కార్‌పై హ‌రీశ్‌రావు ఫైర్
Latest News

Harish Rao | మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు కాదు.. అప్పుల‌పాల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది.. కాంగ్రెస్ స‌ర్కార్‌పై హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao | అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు కాదు.. అప్పుల‌పాల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మండిప‌డ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మిగిలింది ఎడతెగని వేదనే. మ‌హిళలను కోటీశ్వరులను కాదు, కనీసం లక్షాదికారులుగా చెయ్యని చేతగాని సర్కారు మీది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. ఏడ...
Niranjan Reddy | వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు : నిరంజ‌న్ రెడ్డి
Latest News

Niranjan Reddy | వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు : నిరంజ‌న్ రెడ్డి

వ్య‌వ‌సాయ రంగం, రైతుల ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బాధ్య‌త లేదు, బాధ లేదు అని మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : వ్య‌వ‌సాయ రంగం, రైతుల ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బాధ్య‌త లేదు, బాధ లేదు అని మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నిరంజ‌న్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల పరిహారం అందించే పథకం రైతు బీమా.. రైతు చనిపోయిన ఏడు పని దినాలలో రైతు కుటుంబానికి పరిహారం అందేది. ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలలో ఒకటి రైతు బీమా, రైతుబంధు అని యూఎన్ఓకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ప్రకటించింది. రైతు బీమా పథకం ప్రవేశపెట్టిన తరువాత డిసెంబర్ 4, 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు రాష్ట్రంలో 1,18,197 మం...
ఘనంగా ఏనుగు దినోత్సవం
District News, Latest News, Telangana

ఘనంగా ఏనుగు దినోత్సవం

పాల్గొన్న మంత్రి కొండా సురేఖ వరంగల్ వాయిస్, బెంగుళూరు : సకల జీవులకు ఈ భూమి పై జీవించే హక్కు వుందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని(ఆగస్టు 12) పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యుమన్-ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్’ సదస్సులో కొండా సురేఖ పాల్గొన్నారు. ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ, వాటి సంరక్షణ, నిర్వహణపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కర్నాటక ప్రభుత్వం ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును చేపట్టడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల నిర్వహణ రంగంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఆసియా ఏనుగులను అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో చేర్చడం మానవ వైఫల్యాన్ని నిరూపిస్తున్నద...
బీసీ రిజర్వేషన్ల సాధనకు అన్ని జెండాలు ఏకం కావాలి
District News, Latest News

బీసీ రిజర్వేషన్ల సాధనకు అన్ని జెండాలు ఏకం కావాలి

ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ బీసీలు రైతు తరహా ఉద్యమ చేయాలి ఇందిరాపార్క్ దీక్షలో నినదించిన నాయకులు వరంగల్ వాయిస్, హైదరాబాద్ : గడిచిన ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజ్వేషన్లను సాధించడం కోసం వివిధ పార్టీల్లోని బీసీలు జెండాలను పక్కకు పెట్టి ఐక్యంగా ఉద్యమించాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం అధ్యక్షతన జరిగిన సమగ్ర కుల జనగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధన కోసం బీసీ సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. గడిచిన 75 ఏండ్లుగా దోపిడీకి గురైన బీసీలు సామాజిక, ఆర్థిక, రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజకీయ అవకాశాలు త...
అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు
Crime, District News, Hanamkonda, Latest News

అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు

అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆదప్రసాద్ గురువారం హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ప్రాంతానికి చెందిన తన అత్త కోమలను సర్విస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు. స్థానికులకు కథనం ప్రకారం.. ప్రసాద్ కు ఇవ్వవలసిన రూ.4 లక్షల విషయంలో గత కొంత కాలంగా అత్తా, అల్లుడి మధ్య వివాదం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం డబ్బుల విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన ప్రసాద్ తన సర్విస్ రివాల్వర్ తో అత్తపై కాల్పులు జరుపగా అమె అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీస్ ఇన్ స్పెక్టర్ అబ్బయ్య నేతృత్వంలో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు....
ప్లాష్..ప్లాష్..  వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ
Crime, District News, Hanamkonda, Latest News, Warangal

ప్లాష్..ప్లాష్.. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను కూడా బదిలీ చేశారు....
విమోచనోద్యమం స్ఫూర్తితో మొదలైన.. మరో సమరం
Latest News, Political, Warangal

విమోచనోద్యమం స్ఫూర్తితో మొదలైన.. మరో సమరం

మంత్రి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వరంగల్ వాయిస్, పరకాల : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ఆనాటి త్యాగధనుల సేవలను ప్రజలకు తెలియజేస్తామని కేంద్ర కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి బైక్ ర్యాలీగా పరకాలకు విచ్చేసిన ఆయన అమరధామంలో నివాళులర్పించారు. పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విమోచనోద్యమం స్ఫూర్తితో మరో సమరం మొదలైందన్నారు. తెలంగాణ ద్రోహి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ఇక్కడి ప్రజలను అవమానపరిస్తున్నాడని మండిపడ్డారు. నిజాం పాలకులు తెలంగాణలో కర్కషత్వంగా వ్యవహరించి లక్షలాదిమంది ప్రజలను ...