Warangalvoice

Latest News

SLBC Tunnel | ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
Latest News

SLBC Tunnel | ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి. వరంగల్ వాయిస్, నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన ఆరుగురి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం సైతం ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ, కేరళ పోలీస్ క్యాడవార్ డాగ్స్ వంటి రిస్క్యూ టీంలు సహాయ ...
Kaleshwaram Canal : భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల‌ని ధ‌ర్నా
Latest News

Kaleshwaram Canal : భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల‌ని ధ‌ర్నా

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాజాపేట‌ మండలంలోని బేగంపేట గ్రామ‌ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంట‌నే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం తాసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. వరంగల్ వాయిస్, రాజాపేట : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రాజాపేట‌ మండలంలోని బేగంపేట గ్రామ‌ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంట‌నే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం తాసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం మాట్లాడుతూ.. సేకరించిన రైతుల భూములు ధరణి నుంచి తొలగిపోయి రైతు భరోసా కూడా రాక రైతులు తీవ్రంగా నష్ట పోతున్న‌ట్లు తెలిపారు. పరిహారం చెల్లించకుండానే ధరణి ఆన్‌లైన్‌లో నుంచి రైతుల పేర్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ...
Bhadrachalam | మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ధర్నా.. భద్రాచలం ప్రభుత్వ దవాఖాన వద్ద ఉద్రిక్తత
Latest News

Bhadrachalam | మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ధర్నా.. భద్రాచలం ప్రభుత్వ దవాఖాన వద్ద ఉద్రిక్తత

భద్రాచలం  ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపేందర్‌ బంధువులు ఆందోళనకు దిగారు. వరంగల్ వాయిస్, భద్రాచలం : భద్రాచలం  ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపేందర్‌ బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతే మృతదేహాలకు పోస్టుమార్టం చేయాలని ప్రభుత్వ దవాఖాన మార్చురీ ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకున్నారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రా...
Surya Tilak | ఏప్రిల్‌ 6న అయ్యోధ రామయ్యకు సూర్య తిలకం..!
Latest News

Surya Tilak | ఏప్రిల్‌ 6న అయ్యోధ రామయ్యకు సూర్య తిలకం..!

శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్‌ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్‌ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటిపై పడనున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు ట్రస్ట్‌ ఏర్పాటు చేసింది. నవమి వేడుకల రోజున ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిషేకం, ఉదయం 10.40 గంటల నుంచి 11.45గంటల మధ్య ఆరాధన కార్యక్రమాల జరుగనున...
SLBC tunnel | కొనసాగుతున్న సహాయక చర్యలు.. టన్నెల్‌లోకి మరోసారి క్యాడవర్ డాగ్స్
Latest News

SLBC tunnel | కొనసాగుతున్న సహాయక చర్యలు.. టన్నెల్‌లోకి మరోసారి క్యాడవర్ డాగ్స్

దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. వరంగల్ వాయిస్, అచ్చంపేట : దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. క్యాడవర్ డాగ్స్ మృతదేహాల ఆచూకిని గుర్తించడానికి మరోసారి లోపలికి వెళ్లాయి. రెస్క్యూ ఆపరేషన్ 34 వ రోజుకు చేరుకున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటిని నియమించింది. ఆయన ఇక్కడనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయన సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34 రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయక బృందాలు నిరంతరాయంగా కృషి చేస్తున్నాయని, రోజుకు మూడు షిఫ్టులుగా 600...
SLBC Tunnel | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్‌లో మ‌రో మృత‌దేహం వెలికితీత‌.. ఇంజినీర్ మ‌నోజ్‌కుమార్‌గా గుర్తింపు
Latest News

SLBC Tunnel | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్‌లో మ‌రో మృత‌దేహం వెలికితీత‌.. ఇంజినీర్ మ‌నోజ్‌కుమార్‌గా గుర్తింపు

దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. వరంగల్ వాయిస్, అచ్చంపేట : దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. టన్నెల్ నందు మినీ జెసిపి ద్వారా శిథిలాలు తొలగించడం, మట్టి బురదను బయటకు పంపడం సహాయక చర్యలు కొనసాగుతుండగా శిథిలాల కింద మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. అట్టి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడం, ఆ ప్రదేశం భరించలేని దుర్వాసన వస్తుండడంతో మిగిలిన ఆరుగురి మృతదేహాలు కూడా అదే ప్ర‌దేశంలో ఉండే అవకాశం ఉంటుందని అనుమానిస్త...
MLA Palla Rajeshwar Reddy | ‘అభివృద్ధి, సంక్షేమంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి’
Latest News

MLA Palla Rajeshwar Reddy | ‘అభివృద్ధి, సంక్షేమంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి’

చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంజూరు చేయించిన రూ.5 లక్షల వ్యయంతో చేపట్టే నిర్మాణ పనులను ఇవాళ ఏఎంసీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పాల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. వరంగల్ వాయిస్, చేర్యాల : పల్లెల అభివృద్ధి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సాధ్యమవుతుందని చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సుంకరి మల్లేశంగౌడ్‌ అన్నారు. మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంజూరు చేయించిన రూ.5 లక్షల వ్యయంతో చేపట్టే నిర్మాణ పనులను ఇవాళ ఏఎంసీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పాల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్‌ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు నిర్మించేందుకు ఎమ్మెల్యే రూ.కోటి 60లక్షలు మంజూరు ...
Mukra Villagers | ముక్రా(కె) మరోసారి ఆదర్శం.. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు గ్రామస్థుల విరాళం
Latest News

Mukra Villagers | ముక్రా(కె) మరోసారి ఆదర్శం.. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు గ్రామస్థుల విరాళం

బీఆర్‌ఎస్‌ హయాంలో ఆ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే నేడు బీఆర్‌ఎస్‌ వేడుకల నిర్వహణకు గాను స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచింది. వరంగల్ వాయిస్, ఆదిలాబాద్ : బీఆర్‌ఎస్‌ హయాంలో ఆ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే నేడు బీఆర్‌ఎస్‌ వేడుకల నిర్వహణకు గాను స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా ( కే )  గ్రామస్థులు ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రూ.1,02,003 విరాళాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  కు అందజేయాలని నిర్ణయించారు. సోమవారం మాజీ సర్పంచ్ మీనాక్షి ఆధ్వర్యంలో గ్రామస్థులు ఇంటింటికి విరాళాలు సేకరించారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో గ్రామంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని గ్రామస్తులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఫలితంగా తమకు ఉపాధి ఎంతో మెర...
KTR | జ‌నాభా ఆధారంగా సీట్ల పెరుగుద‌ల జ‌రిగితే.. దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం : కేటీఆర్
Latest News

KTR | జ‌నాభా ఆధారంగా సీట్ల పెరుగుద‌ల జ‌రిగితే.. దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం : కేటీఆర్

డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతంగా తెలియచెప్పారు. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు.. ఆర్థిక నియంతృత్వానికి దారి తీస్తుందని… దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. వరంగల్ వాయిస్, చెన్నై : డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతంగా తెలియచెప్పారు. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు.. ఆర్థిక నియంతృత్వానికి దారి తీస్తుందని… దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా… భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాల‌న్నారు. కేవలం జనాభా ఆధారంగా ...
KTR | ప్ర‌జాస్వామ్యం మంద‌బ‌లం ఆధారంగా న‌డ‌వ‌రాదు : కేటీఆర్
Latest News

KTR | ప్ర‌జాస్వామ్యం మంద‌బ‌లం ఆధారంగా న‌డ‌వ‌రాదు : కేటీఆర్

KTR | డీ లిమిటేష‌న్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యం మంద‌బ‌లం ఆధారంగా న‌డ‌వ‌రాదు అని పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, చెన్నై : డీ లిమిటేష‌న్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యం మంద‌బ‌లం ఆధారంగా న‌డ‌వ‌రాదు అని పేర్కొన్నారు. చెన్నైలో జ‌రిగిన‌ దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్ హాజ‌రై మాట్లాడారు. కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్య‌మం న‌డిపించారు. 14 సంవ‌త్స‌రాల అనంత‌రం తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చుకున్నాం. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాం. అస్తిత్వం, హ‌క్కుల కోసం కొట్లాడ‌డంలో త‌మిళ‌నాడు స్ఫూర్తినిచ్చింది. ద్ర‌విడ ఉద్య‌మం స‌మైక్య దేశంలో త‌మ హ‌క్కులు సాధించ‌డానికి రాష్ట్రాల‌కు ఒక దిక్సూచీ లెక్క ప‌ని చేస్తుంద‌న్నారు కేటీఆర్. డీ లిమిటేష‌న్ వ‌ల్ల అనేక న‌ష్టాలు...