SLBC Tonnel | ఎస్‌ఎల్‌బీసీలో పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్.. కొనసాగుతున్న స్టీల్, వ్యర్థ పదార్థాల తొలగింపు
జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు.
వరంగల్ వాయిస్, నాగర్ కర్నూల్ : జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ వద్ద సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు గురువారంతో పూర్తవడంతో శుక్రవారం నుంచి మట్టి తొలగింపు పనులను ముమ్మరం చేశారు. సొరంగం నుంచి ఉబికి వస్తున్న ఊట నీటిని తోడిపోస్తూ స్టీల్ వ్యర్ధాలను బయటకు తరలిస్తున్నారు.
శుక్రవారం టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. సహాయక బృందాలు తమకు కేటాయించిన పనిని పూర్తి స్థాయిలో చేపడుతూ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ లోపల అత్యధికంగా పేరుకుపోయిన స్టీలును లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించ...