Warangalvoice

Latest News

Alampur | కళ్ళ ముందే కాలిన మొక్కజొన్న పంట.. క‌న్నీరు పెట్టుకున్న రైత‌న్న‌
Latest News

Alampur | కళ్ళ ముందే కాలిన మొక్కజొన్న పంట.. క‌న్నీరు పెట్టుకున్న రైత‌న్న‌

వరంగల్ వాయిస్,  అలంపూర్  : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కాలి పోతున్న దృశ్యాన్ని చూసి రైతు కంట కన్నీళ్లు ఆగలేదు. వివరాల్లోకి వెళితే ఉండవెల్లి మండలం కంచిపాడు గ్రామానికి చెందిన అచ్చన్న అనే రైతు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట చేతికి అంద‌డంతో మొక్కజొన్న కంకులను కోసి, వాటిని పొలంలోనే కుప్పగా పోసి నూర్పిడి చేసేందుకు నిలువ ఉంచాడు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పొలంలోని నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట సుమారు 40 క్వింటాళ్ల ధాన్యం కాలి బూడిదైపోయింది. ఉదయాన్నే పొలం వైపు వెళ్లి చూడగా పంట పూర్తిగా మట్టిలో కలిసిపోయింది.. అప్ప‌టికే మొక్క‌జొన్న కంకులు కాలుతూనే ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి రైతు లబోదిబో అంటూ గుండె బాదుకున్నాడు. బాధిత రైతును ఆదుకోవాలని తోటి రైతులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు....
MLA Jagadish Reddy | వరంగల్ సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది : ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి
Latest News

MLA Jagadish Reddy | వరంగల్ సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది : ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి

వరంగల్ వాయిస్,  యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ స‌భ త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయ ముఖ‌చిత్రం పూర్తిగా మారిపోతుంద‌ని సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. రజతోత్సవ సభ విజయవంతం కోసం యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదాద్రి ఆలయం వరకు బీఆర్ఎస్‌వీ విద్యార్థులు పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ పాదయాత్రను ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది. సబ్బండ వర్గాలు కదిలివస్తున్నాయ్. వ‌రంగ‌ల్ స‌భ ఓ రేంజ్‌లో ఉంటుంది. బీఆర్ఎస్ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. వ‌రంగ‌ల్ స‌భ కూడా అలానే ఉంటుంది. ఇవ్వాళ అందరిలో చైత్యనాన్ని స్పూర్తిని నింపేలా బీఆర్ఎస్‌వీ విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. ఇవ్వాళ ప్రజలకు కష్టం వస్తే మా కేసీఆర్ ఉంటే బాగుండు అని అంటున్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ప్రతి రైతు మనసులో...
Revanth Reddy | వీకెండ్‌ రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం రేవంత్‌ రెడ్డి
Latest News

Revanth Reddy | వీకెండ్‌ రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం రేవంత్‌ రెడ్డి

 ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకారు. మంత్రి పదవులను అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనకు మంత్రి పదవి రాకుండా జానా రెడ్డి అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రచ్చ చేస్తే.. పదేళ్లు పార్టీని కాపాడుకున్న మమ్మల్ని కాదని.. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు ఇస్తారా అని ప్రేమ్‌సాగర్‌ రావు పరోక్షంగా ప్రభుత్వానికే వార్నింగ్‌ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకారు. మంత్రి ప...
KTR | హెచ్‌సీయూ భూముల వెనక 10 వేల కోట్ల భారీ స్కామ్.. రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్‌‌: కేటీఆర్‌
Latest News

KTR | హెచ్‌సీయూ భూముల వెనక 10 వేల కోట్ల భారీ స్కామ్.. రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్‌‌: కేటీఆర్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 3డీ మంత్రంతో (మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం) పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  విమర్శించారు. రేవంత్‌ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 3డీ మంత్రంతో (మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం) పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందన్నారు. ఆ 400 ఎకరాలు అటవీ భూమేనని, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నాని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ భూముల వెనుక 10 వేల కోట్ల...
Anugula Rakesh Reddy | కాంగ్రెస్‌ అంటేనే కరప్షన్‌ అని మరోసారి రుజువైంది.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అవినీతిపై మండిపడ్డ రాకేశ్‌ రెడ్డి
Latest News

Anugula Rakesh Reddy | కాంగ్రెస్‌ అంటేనే కరప్షన్‌ అని మరోసారి రుజువైంది.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అవినీతిపై మండిపడ్డ రాకేశ్‌ రెడ్డి

Anugula Rakesh Reddy | డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని ఆధారాలను సైతం సేకరించి అభ్యర్థులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్ క్యాటగిరీల్లో మొదట 33 మందిని భర్తీ చేసినప్పుడు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన అనేక మంది అభ్యర్థులను కాదని ఎటువంటి ప్రతిభ చూపకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు చేసినా మూడు సార్లు సర్టిఫికెట్లు పరిశీలించి కూడా ఇప్పటికీ ఆ నివేదికను ప్రభుత్వం బయట పెట్టడం లేదని విమర్శించారు. ఓపెన్ క్యాటగిరీలో ఉన్న 63 మందిని ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రతి రోజు అభ్యర్థులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా ప్రదక్షిణాలు చేస్తున్నా కనీసం సమాధానం చెప్పేటోడే లేడని ఏనుగుల రాకేశ...
EX MLA Anjaiah yadav | వరంగల్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు
Latest News

EX MLA Anjaiah yadav | వరంగల్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు

తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం కేసీఆర్‌ది అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ గుర్తు చేశారు. ఇవాళ షాద్ నగర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ వాల్ రైటింగ్ వేశారు. వరంగల్ వాయిస్, షాద్ నగర్  : తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడంతోపాటు రాష్ట్ర అభివృద్ధిని కనులారా చూపించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందని, స్వరాష్ట్రాన్ని సాధించి దేశంలోనే నెంబర్ 1 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ పాలన అని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. ఇవాళ షాద్ నగర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ వాల్ రైటింగ్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం కేసీఆర్‌ది అని గుర్తు చేశారు. రైత...
JNTU | జీవో 21 రద్దు చేయాలని జేఎన్టీయూ అధ్యాపకుల విధుల బహిష్కరణ
Latest News

JNTU | జీవో 21 రద్దు చేయాలని జేఎన్టీయూ అధ్యాపకుల విధుల బహిష్కరణ

వరంగల్ వాయిస్, రామగిరి : మంథని జేఎన్టీయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు బహిష్కరించి గురువారం ఆందోళన చేపట్టారు. స్టేట్ అసోసిఅషన్ ఫర్ కాంట్రాక్టు టీచర్స్ పిలుపు మేరకు హైయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ వద్ద సమస్యలు విన్నవించడానికి జీవో 21కు వ్యతిరకంగా శాంతియుత నిరసన చేపట్టడానికి వెళ్లిన రాష్ట్రం లోని 12 విశ్వవిద్యాలయాలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అక్రమ అరెస్ట్, ప్రత్యేకంగా మహిళా కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల పోలీసుల ప్రవర్తించిన తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసోసియేషన్ విద్యా సంస్థలు బందుకు పిలుపునిచ్చారు. కాగా ఈ పిలుపులో భాగంగా జేఎన్టీయూహెచ్ అనుబంధ కాలేజీ అయిన మంథని కాలేజీకి చెందిన సహాయ ఆచార్యులు బంద్ లో పాల్గొన్నట్లు కాంట్రాక్ట్ అధ్యాపకులు తెలిపారు....
Kethaki Temple | కేతకి ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ హైకోర్టు జ‌డ్జిలు
Latest News

Kethaki Temple | కేతకి ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ హైకోర్టు జ‌డ్జిలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ పి. శ్రీసుధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ వాయిస్, ఝరాసంగం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ పి. శ్రీసుధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా జడ్జిల‌కు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలు మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని అమృత గుండంలో పాదాచారణ చేసి గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి అభిషేకం, మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జడ్జీలకు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప పూలమాల శాలువాతో సన్...
RS Praveen Kumar | శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడ‌టంలో రేవంత్ స‌ర్కార్ ఘోర వైఫ‌ల్యం : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్
Latest News

RS Praveen Kumar | శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడ‌టంలో రేవంత్ స‌ర్కార్ ఘోర వైఫ‌ల్యం : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందింద‌ని బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందింద‌ని బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత వారం రోజుల్లోనే నలుగురు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయ‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ గుర్తు చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ మహిళా బోగిలో ఉన్నప్పటికీ మహిళపై అత్యాచారం జరిగింది. సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ గుడి దగ్గర మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మార్చి 31న జర్మనీ మహిళపై పహాడీ షరీఫ్‌లో అత్యాచారం జరిగింద...
MGU : హెచ్‌సీయూ భూముల‌పై సుప్రీం స్టే.. ఎంజీయూలో విద్యార్థుల హ‌ర్షాతిరేకం
Latest News

MGU : హెచ్‌సీయూ భూముల‌పై సుప్రీం స్టే.. ఎంజీయూలో విద్యార్థుల హ‌ర్షాతిరేకం

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి చెందిన 400 ఎక‌రాల‌ భూముల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సుప్రీం ఉత్త‌ర్వుల‌పై న‌ల్ల‌గొండ‌ మ‌హాత్మాగాంధీ విశ్వ‌విద్యాల‌య విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వరంగల్ వాయిస్, నల్ల‌గొండ విద్యా విభాగం (రామగిరి) : హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి చెందిన 400 ఎక‌రాల‌ భూముల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సుప్రీం ఉత్త‌ర్వుల‌పై న‌ల్ల‌గొండ‌ మ‌హాత్మాగాంధీ విశ్వ‌విద్యాల‌య విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వ‌ర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదిక వద్ద విద్యార్థులు స్వీట్లు పంపిణీ చేసుకుని ఆనందోత్సవం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. వ...