Warangalvoice

Latest News

భార‌త సైన్యానికి సెల్యూట్.. జైహింద్ : కేటీఆర్
Latest News

భార‌త సైన్యానికి సెల్యూట్.. జైహింద్ : కేటీఆర్

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై భార‌త సైన్యం మిస్సైళ్ల‌తో మెరుపు దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పాకిస్తాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై మెరుపు దాడులు చేసిన భార‌త సైన్యానికి సెల్యూల్ చేస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. తీవ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే ప్రక్రియలో వారికి మరింత బలం చేకూరాలి… ప్రతి ఒక్కరం భారత సైన్యానికి అండగా ఉందాం అని అన్నారు. చివ‌ర‌గా జైహింద్ అని కేటీఆర్ పేర్కొన్నారు....
KCR | భార‌త సైన్యం ప్ర‌ద‌ర్శించిన సైనిక పాట‌వానికి భార‌తీయుడిగా గ‌ర్వ‌ప‌డుతున్నా : కేసీఆర్
Latest News

KCR | భార‌త సైన్యం ప్ర‌ద‌ర్శించిన సైనిక పాట‌వానికి భార‌తీయుడిగా గ‌ర్వ‌ప‌డుతున్నా : కేసీఆర్

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గ‌ర్వ‌పడుతున్నాని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో ఉన్నా.. ఏ దేశంలో వున్నా.. ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదు. ఉగ్రవాదం అంతం కావాల్సిందే అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయి. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు....
Jagadish Reddy | రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి ఢిల్లీకి మూటలుగా మోస్తున్నారు.. సీఎంపై జగదీష్‌ రెడ్డి ఫైర్‌
Latest News

Jagadish Reddy | రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి ఢిల్లీకి మూటలుగా మోస్తున్నారు.. సీఎంపై జగదీష్‌ రెడ్డి ఫైర్‌

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాలన చేతగాని అసమర్థ సీఎం రేవంత్‌ అని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి (Jagadish Reddy) వ్యాఖ్యానించారు. ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత ఆయనకు లేదన్నారు. వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘మొదటి నుంచి బీఆర్‌ఎస్‌ చెప్తున్న మాటలు నేడు నిజమని తేలిపోయాయి. ఓనమాలు రాని వాడు పదో తరగతి చదివనట్లుంది రేవంత్ తీరు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా లేదు. రేవంత్‌కి పరిపాలన చేతకావట్లేదనేది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అప్పులతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ రెండున్నర లక్షల కోట్ల ఆదాయానికి తెచ్చారు. రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తోంది. మాఫియాలా ర...
KTR | దొంగ‌ను దొంగ‌లాగే చూస్తారు రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ధ్వ‌జం
Latest News

KTR | దొంగ‌ను దొంగ‌లాగే చూస్తారు రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ధ్వ‌జం

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : నోట్ల క‌ట్ట‌ల‌తో దొరికిపోయిన దొంగ‌ను దొంగే అంటారు.. దొంగ‌ను దొంగలాగే చూస్తారు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఎంతో మంది త్యాగాల ఫ‌లితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవ‌మాన‌ప‌రిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. వ్య‌క్తిగ‌తంగా ఎన్ని దూష‌ణాలు, తిట్లైనా తింటాం.. అవ‌మానాలు స‌హిస్తాం కానీ గ‌త ఏడాదిన్న‌ర కాలంగా మ‌మ్మ‌ల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా చివ‌రికి మా నాయ‌కుడి చావును కోరుకుంటూ నికృష్ట‌పు రోత మాట‌లు మాట్లాడినా మేం భ‌రించాం. స‌హించాం. కోపాన్ని పంటి బిగువును దాచుకున్నాం. మ‌మ్మ‌ల్ని ఎన్ని తిట్టినా ప‌డుతాం కానీ.. వేల మంది త్యాగాల‌తో, ద‌శాబ్దాల పోరాట‌ల ఫ‌లితంగా.. టీఎన్జీవోలు, బుద్దిజీవుల నేతృత్వంలో రాజ‌కీయ నాయ‌కులు మేల్కొక ముందే....
KTR | పీఆర్సీ, డీఏలు అడిగితే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను విల‌న్లుగా చిత్రీక‌రిస్తారా..? రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డ కేటీఆర్
Latest News

KTR | పీఆర్సీ, డీఏలు అడిగితే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను విల‌న్లుగా చిత్రీక‌రిస్తారా..? రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డ కేటీఆర్

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర‌కు పీఆర్సీ, డీఏలు అడిగితే.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ప్ర‌జ‌ల‌ను ముందు విలన్లుగా చిత్రీక‌రిస్తారా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని అడిగిన ఉద్యోగుల‌పై రేవంత్ రెడ్డి నోరుపారేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్క హామీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌లేదు. తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంతైనా తెలియ‌దు. ఫ్రీ జోన్ హైద‌రాబాద్ అని తీర్పు వ‌స్తే తెలంగాణ ఉద్యోగులు తిర‌స్క‌రించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఎన్జీవోలు ఎంతో గొప్ప ఉద్య‌మం చేశారు అని కేటీ...
Bandi Sanjay | కరీంనగర్‌ హైవేను జాతీయ రహదారిగా విస్తరిస్తాం.. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక ప్రకటన
Latest News

Bandi Sanjay | కరీంనగర్‌ హైవేను జాతీయ రహదారిగా విస్తరిస్తాం.. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక ప్రకటన

హైదరాబాద్-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి నాగుపాములా అధ్వాన్నంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని తెలిపారు. రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సదరు కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ చూపాలని సూచించారు. కొమరం భీం జిల్లాలో రూ.6100 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన పలు రహదారులకు కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర బొగ్గు,...
మార్కెట్‌ యార్డులో తడిసి ముద్దయిన ధాన్యం.. సివిల్‌ సప్లై అధికారులపై హరీశ్‌రావు సీరియస్‌..
Latest News

మార్కెట్‌ యార్డులో తడిసి ముద్దయిన ధాన్యం.. సివిల్‌ సప్లై అధికారులపై హరీశ్‌రావు సీరియస్‌..

అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రోజుల తరబడి మార్కెట్ యార్డుల వద్ద రైతులు వేచి చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో సిద్దిపేట మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని హరీశ్‌రావు పరిశీలించారు. ఇప్పటికే మార్కెట్‌లో 3,500 ధాన్యం బస్తాలు తరలించడానికి సిద్ధంగా ఉన్నా, లారీలు లేకపోవడంతో, ధాన్యం నీటిపాలైందని ఈ సందర్భంగా హరీశ్‌రావు ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న రైతులను ఓదార్చారు. అనంతరం ఆర్డీవో, సివిల్ సప్లై అధికారులపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సివిల్‌ సప్లై డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌కు ఆయన ఫోన్‌ చేసి మాట్లాడారు. లారీలు, హామీలను వెంటనే సమకూర్చి ధాన్యాన్ని సేకరించాలని ఆదేశించారు. లారీ అసోసియేషన్‌తో మాట్లాడి ధాన్య సేకరణకు లారీలను పంపించవలసిం...
ప్రై‘వేటు’కు సిద్ధంగా వైటీపీఎస్‌!
Latest News

ప్రై‘వేటు’కు సిద్ధంగా వైటీపీఎస్‌!

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఓ ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్లాంట్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌ (ఓఅండ్‌ఎం)ను సదరు సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశారా? అంటే.. టీజీ జెన్‌కో ఇంజినీర్లు అవుననే అంటున్నారు. ప్లాంట్‌ నిర్వహణ లోపం వెనక కుట్ర ఉద్దేశపూర్వకంగానే ఓఅండ్‌ఎం స్టాఫ్‌ ఇంజినీర్లను కేటాయించని జెన్‌కో ఆరు నెలలుగా వేధిస్తున్న సిబ్బంది కొరత సీఈ లేఖ రాసినా స్పందన శూన్యం ప్లాంట్‌ను ప్రైవేటుకు అప్పగించే ప్లాన్‌ జెన్‌కో ఇంజినీర్ల అనుమానం వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఓ ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్లాంట్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌ (ఓఅండ్‌ఎం)ను సదరు సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశారా? అంటే.. టీజీ జెన్‌కో ఇంజినీర్లు అవుననే అంటున్నారు. కుట్రలో భ...
Telangana DGP | కొత్త డీజీపీ ఎంపిక.. యూపీఎస్సీకి 8 మందితో జాబితా.. చాన్స్‌ ఎవరికి దక్కేనో?
Latest News

Telangana DGP | కొత్త డీజీపీ ఎంపిక.. యూపీఎస్సీకి 8 మందితో జాబితా.. చాన్స్‌ ఎవరికి దక్కేనో?

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్‌ రిటైర్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్‌ ఎనిమిది మంది సీనియర్‌ అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇక నూతన డీజీపీ (Telangana DGP) ఎంపికపై దృష్టి సారిచింది. బుధవారంతో సీఎస్‌ శాంతి కుమారి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆమె స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు ప్రభుత్వం ప్రమోషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్‌ రిటైర్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసి...
Peddapalli | పహల్గాం ఉగ్రదాడికి నిరసగా పెద్దపల్లి బంద్‌.. తెరచుకోని దుకాణాలు
Latest News

Peddapalli | పహల్గాం ఉగ్రదాడికి నిరసగా పెద్దపల్లి బంద్‌.. తెరచుకోని దుకాణాలు

వరంగల్ వాయిస్, పెద్దపల్లి : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి వ్యతిరేకంగా పెద్దపల్లిలో బంద్‌ నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని కోరూతూ పెద్దపల్లి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. ఒక్క షాపు కూడా తెరచుకోకపోవడంతో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. పెద్దపల్లి కూరగాయల మార్కెట్‌ జెండా చౌరస్తా కామన్‌ రోడ్‌లో బంద్‌ సంపూర్ణంగా జరుగుతున్నది....