Warangalvoice

Latest News

కార్పొరేట్ వర్గాలకు మోడీ ఊడిగం
Latest News, Warangal_TriCites

కార్పొరేట్ వర్గాలకు మోడీ ఊడిగం

కమ్యూనిజం ప్రపంచ వ్యాప్త సిద్దాంతం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి వరంగల్ లో ద్వితీయ జిల్లా మహాసభలు ప్రారంభం వరంగల్ వాయిస్, వరంగల్ : కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లా సీపీఐ ద్వితీయ మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక అబ్నూస్ ఫంక్షన్ హాల్ లో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి అధ్యక్షత జరిగిన సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మోడీ పాలనలో అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ప్రజాస్వామ్యం గొంతునొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. గత 11 ఏళ్లుగా ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కుతూ ...
వైద్యురాలు మృతి కేసులో నలుగురు అరెస్ట్
Crime, Latest News, Warangal_TriCites

వైద్యురాలు మృతి కేసులో నలుగురు అరెస్ట్

వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వరంగల్ వాయిస్, హసన్ పర్తి : యువ వైద్యురాలు అల్లాడి ప్రత్యూష ఆత్మ హత్యకు కారకులైన నలుగురిని హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వెంటేజ్ లోని స్వగృహంలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. డాక్టర్ ప్రత్యూష మృతికి కారకులైన భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అతని తల్లితండ్రులు అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతితోపాటు బానోతు శృతి కారులో హనుమకొండ-కరీంనగర్ ప్రధాన రహదారిలో వెళ్లుండగా కాకతీయ వెంటేజ్ క్రాస్ సమీపంలో హసన్ పర్తి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మాటలతో ప్రేరేపించి డాక్టర్ ప్రత్యూష...
అధిక జనాభాతో అనేక సమస్యలు
Latest News, Warangal_TriCites

అధిక జనాభాతో అనేక సమస్యలు

కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన వరంగల్ వాయిస్, వరంగల్ : అధిక జనాభాతో అనేక సమస్యలు ఉద్భవిస్తాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. జనాభా పెరుగుదలతో కలిగే సమస్యలు..సమాజంపై దాని ప్రభావాన్ని తెలియజేసే లక్ష్యంతో ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని జనాభా పెరుగుదలతో కలిగే సమస్యలపై అవగాహన కల్పించారు. పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా విస్పోటనం జరుగుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరి కొన్ని సంవత్సరాలు తర్వాత భూమి మీద నివసించేందుకు చోటు లభించదన్నారు. అందుకు కుటుంబ నియ...
తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Crime, Latest News

తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

వరంగల్ వాయిస్, సుబేదారి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడిచర్ల మండలానికి చెందిన ఉల్లిగంటి సంపత్ కుమార్తె, 9 సంవత్సరాల శ్రీ నిత్య, హనుమకొండ హంటర్‌రోడ్‌లోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిత్య హాస్టల్ నుంచి అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయింది. అదే హాస్టల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బైరి ఉమా బాలిక కనిపించడం లేదని గుర్తించి ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సుబేదారి ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ కు తెలియజేశారు. ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ తన సిబ్బందితో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించగా, బాలిక పద్మాక్షమ్మ గుట్ట దగ్గర ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు నిత్యను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా శ్రీ నిత్య తల్లిదండ్రులు సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్‌కు ప్రత్యేక ధన్...
ఎస్సారెస్పీ..  కాలువ కబ్జా
Latest News, Today_banner

ఎస్సారెస్పీ.. కాలువ కబ్జా

ప్లాట్లుగా చేసి విక్రయాలు రెచ్చిపోతున్న రియల్టర్లు అటకెక్కిన గ్రీవెన్స్ ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించినా చర్యలు శూన్యం నిద్ర మత్తు వీడని ఇరిగేషన్ అధికారులు ఆందోళనలో రైతులుపర్వతగిరిలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ప్రజా ప్రతినిధుల అండ మెండుగా ఉన్న వారి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేయడం పరిపాటి. ఇక్కడ మాత్రం ఏకంగా ఎస్సారెస్పీ కాలువనే మట్టితో నింపి ప్లాట్లు చేసి విక్రయిచడం సంచలనంగా మారింది. మండలంలోని పర్వతగిరి-చౌటపల్లి గ్రామ రెవెన్యూ శివారు నుంచి గొరుగుట తండా, జగ్గు తండా మీదుగా పర్వతగిరి రిజర్వాయర్ సమీపం మీదుగా కల్లెడ గ్రామం వరకు విస్తరించి ఉన్న ఎస్సారెస్పీ కాలువను కల్లెడలోని వడ్లకొండ మల్లయ్యకు చెందిన బావి నుంచి ఊర చెరువు వరకు మట్టితో నింపి ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తున్నారు. కాలువ పూడ్చి వేయడంతో తమ పంట చేలకు నీరు వచ్చే పరిస్థితి లేదన...
శక్తి స్వరూపిణి.. శాకంబరీ
Cultural, Latest News, Today_banner, Warangal_TriCites

శక్తి స్వరూపిణి.. శాకంబరీ

కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారి దర్శనం పది టన్నుల కూరగాయలు, ఆకు కూరలతో అలంకరణ పులకించిన భక్తజనం ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సురేఖ పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు 300మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి ఆషాడ మాస శాకంబరీ ఉత్సవాలను గురువారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగే శాకంబరీ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. పదిహేను రోజులపాటు ఉదయం, సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులను వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేశారు. చివరి రోజైన ఆషాఢ శుద్ధపౌర్ణమి అయిన గురుపౌర్ణమి పర్వదినాన అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో శాకంబరీగా అలంకరించారు. భద్రకాళి ఆలయానికి ఉదయం 10 గంటలకు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వ...
బాబా గుడిలో భక్తజనం
Cultural, Latest News

బాబా గుడిలో భక్తజనం

గురు పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు శేజ హారతితో ముగిసిన పూజా కార్యక్రమాలు వరంగల్ వాయిస్, హనుమకొండ : మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి మనకు తోడు, నీడై నిలిచి మనల్ని సన్మార్గంలో నడిపించే గురువులను పూజించి వారిని గౌరవించుకునే రోజే ‘గురు పౌర్ణమి’ అని హనుమకొండలోని సాయిబాబా మందిర చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ అన్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పూజారులు కిషోర్ శర్మ, మణిశర్మ, చందులు మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని తల్లిదండ్రులతో కలిసి బాబా దర్శనం చేసుకున్నారు. ఆమెకు మందిర చైర్మన్ శేష వస్త్రాలలు అందజేసి ఘనంగా సత్కరించారు. నగర ట్రాఫిక్ ఏసీపీ తీర్థాల సత్యనారాయణ, సుబేదారి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ తదితరులు పూజా కార్యక...
విూతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టం
Cinema, Latest News

విూతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టం

వార్‌-2 మూవీపై కియారా ఆసక్తికర పోస్ట్‌వరంగల్ వాయిస్, (సినిమా): ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో ’వార్‌ 2’ఒకటి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ (కి) ప్రధాన పాత్రల్లో నటించారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా కనిపించనున్నారు. తాజాగా ఆమె ఈ సినిమాపై పోస్ట్‌ పెట్టారు. ప్రపంచం దీన్ని ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు- తెలుపుతూ తారక్‌, హృతిక్‌లు పోస్ట్‌లు పెట్టారు. అందులో హృతిక్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిన కియారా..ఈ సినిమా విషయంలో విూరెంత ఆసక్తిగా ఉన్నారో నేనూ అలానే ఉన్నాను. విూతో కలిసి స్కీన్ర్‌ షేర్‌ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఎన్టీఆర్‌తో కలిసి అయాన్‌ ముఖర్జీ సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని ఎదురుచూస్తున్నాను. మన టీ-మ్‌ మొత్తం ఈ సినిమాకు ప్రాణం పోసి...
IAS Officer Srilakshmi: సుప్రీంలో శ్రీలక్ష్మికి చుక్కెదురు
Latest News

IAS Officer Srilakshmi: సుప్రీంలో శ్రీలక్ష్మికి చుక్కెదురు

వరంగల్ వాయిస్,  న్యూఢిల్లీ : ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి  సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం అక్రమమైనింగ్ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్స్‌లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఐఏఎస్‌ అధికారిణిని శ్రీలక్ష్మి అరెస్ట్ అయి కొంత కాలం జైలు జీవితం కూడా అనుభవించారు. అయితే ఈకేసులో శ్రీలక్ష్మిపై నమోదు అయిన కేసును తెలం...
CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
Latest News

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

వరంగల్ వాయిస్,  హైదరాబాద్: దేశ సైన్యంతో మనమంతా అండగా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  తెలిపారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావులేదని స్పష్టం చేశారు. అత్యవసర సర్వీస్‌లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఉద్యోగులు అంతా ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని చెప్పారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇవాళ(బుధవారం) ఉదయం 11 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆపరేషన్ సిందూర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీలతో పాటు అందుబాటులో ఉన్న మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల రక్షణకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స...