Warangalvoice

Jangaon

John Wesley | బీఆర్‌ఎస్ పంటలకు ప్రాణం పోస్తే.. కాంగ్రెస్‌ ఎండబెడుతున్నది : జాన్ వెస్లీ
Jangaon

John Wesley | బీఆర్‌ఎస్ పంటలకు ప్రాణం పోస్తే.. కాంగ్రెస్‌ ఎండబెడుతున్నది : జాన్ వెస్లీ

John Wesley | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షంతో వరి పంటలు ఎండుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. వరంగల్ వాయిస్,  జనగాను : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షంతో వరి పంటలు ఎండుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley )అన్నారు. సోమవారం జనగామ జిల్లాలోని చిన్న రాంచర్ల, గానుగు పహాడ్, వడ్లకొండ గ్రామాల్లో సాగు నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను జాన్ వెస్లీ స్వయంగా పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వానికి, అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్ల దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని 8 రిజర్వాయర్లు ,769 చెరువులు, కుంటలకు అవసరమైన సాగునీటిని నింపలేకపోయారని విమర్శించాడు. పంటలకు ప్రాణం పోసిన బీఆర్‌ఎస్‌.. ఈ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో రైతులకు అవసరమైన సాగునీటిని ప్రతి సంవత్సరం దేవాదుల ద్వారా రైతులకు అందించి పంటలు ఎండిపోకుండ...
స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు
District News, Jangaon, Top Stories

స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు

వరంగల్‌ వాయిస్‌, జనగాం : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ మరియు హెల్పర్స్‌ యూనియన్‌ టీఎన్‌ జీవో (తెలంగాణ నాన్‌ గెజిటడ్‌ ఆఫీసర్స్‌) అనుబంధం జనగాం జిల్లా అధ్యక్షురాలు కాసగోని స్వరూపరాణి, కార్యదర్శి గుమ్మడవెల్లి రమాదేవి ఆధ్వర్యంలో స్టేషన్‌ ఘనపూర్‌ ప్రాజెక్ట్‌, రఘునాథపల్లి మండల కేంద్రంలోని కోమళ్ళలో అంగన్వాడీ టీచర్స్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షురాలు స్వరూపారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల జీవితాలు బాగున్నాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతను వివరించారు. రఘునాథపల్లి మండలం అధ్యక్షురాలు గొట్టం మంజుల, కార్యదర్శి ఎండీ ఫాతిమా, కోశాధికారి ఐలమ్మ, కోమళ్ల సర్కిల్‌ అధ్యక్షురాలు ఇల్లందుల రాజమణి, కార్యదర్శి నల్ల నర్సమ్మ, కోశాధికారి తమ్మడపల్లి శారద, కార్యవర్గ సభ్యుల బొల్లాపల్లి ప్రేమలత, చేపురి మమత, కింద విజయ, మార...
చెట్టు కింద పాలన.. ప్ర‌జ‌ల‌తో మంత్రి ఎర్రబెల్లి మాటా మంతీ!
District News, Jangaon

చెట్టు కింద పాలన.. ప్ర‌జ‌ల‌తో మంత్రి ఎర్రబెల్లి మాటా మంతీ!

సింగ‌రాజుప‌ల్లిని మండ‌ల కేంద్రం చేయాలని వినతిపరిశీలిస్తామని హామీ వరంగల్ వాయిస్, జనగామ: నిత్యం జ‌నంలోనే, జ‌నంతోనే ఉండే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, త‌న స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడ‌రు. జ‌నంతో ఉండ‌ట‌మే ముఖ్య‌మ‌నుకుంటారు. అలా… అనేక సంద‌ర్భాల్లో ప్ర‌వ‌ర్తించిన మంత్రి మ‌రోసారి త‌న రూటే సెప‌రేట‌ని నిరూపించారు. బుధవారం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర ప‌తి అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళ్తూ జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం కుందారం (ప‌టేల్ గూడెం) క్రాస్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలోని సింగ‌రాజుప‌ల్లి, ఆ చుట్టు పక్కల గ్రామాల‌కు చెందిన ప‌లువురు మంత్రిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆ ప‌క్క‌నే ఉన్న చిన్న గుడిసె హోట‌ల్ ముందు ఆగారు. అక్క‌డే ప్ర‌యాణికుల కోసం వేసి ఉన్న ఓ చైర్ మీద కూర్చున్నారు. వాళ్లతో కాసేపు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వారు సింగ‌రాజుప‌...
ప‌ట్టుద‌ల‌తోనే ఏదైనా సాధ్యం
District News, Jangaon

ప‌ట్టుద‌ల‌తోనే ఏదైనా సాధ్యం

అబ్దుల్ క‌లామే అందుకు నిద‌ర్శ‌నంమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుపాల‌కుర్తి జడ్పీ పాఠ‌శాల‌లో అబ్దుల్ క‌లామ్ విగ్రహావిష్క‌ర‌ణ వరంగల్ వాయిస్, పాలకుర్తి: పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని, అందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ క‌లామ్ జీవితమే నిదర్శమని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కొనియాడారు. బుధవారం జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో ఏపీజే అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హాన్ని ఆయన ఆవిష్క‌రించారు. పదో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో అత్యంత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర‌చిన విద్యార్థుల‌కు స‌న్మానం చేశారు. ఉత్త‌మ సేవ‌లు అందించిన స్కూల్ అటెండ‌ర్ భిక్ష‌ప‌తిని మంత్రి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవిత‌మంతా శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, సమాజం కోసం పాటుపడిన మహనీయుడు డా. ఏపీజే అబ్దుల్ కలాం అని, నీతికి, నిజాయితీకి నిలువె...
గిరిజన రిజర్వేషన్ పెంపు సాధ్యం కాదన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధం
District News, Jangaon

గిరిజన రిజర్వేషన్ పెంపు సాధ్యం కాదన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధం

తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ వరంగల్ వాయిస్, జనగామ : తెలంగాణలో బీసీ-ఈ రిజర్వేషన్ల సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అది పరిష్కారం అయ్యేవరకు గిరిజన రిజర్వేషన్ పెంచడం ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాయడమేనని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందునాయక్ కేంద్రప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని బీసీ-ఈ తో ముడి పెట్టడం అన్యాయమన్నారు. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6 శాతం నుంచి 9.08 శాతానికి పెంచుకోవడానికి కేంద్ర హోం శాఖ అందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర గిరిజన వ్యవరాలశాఖ కోరింది. గత నాలుగు సంవత్సరాలుగా జాప్యం చేసిన కేంద్ర హోం శాఖ ఇప్పుడు బీసీ- ఈ సమస్యను గిరిజన రిజర్వేషన్ పెంపు సమస్యతో ముడిపెట్టడం బీజేపీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అని అన్నార...