Warangalvoice

Hanamkonda

మెట్టుగుట్టపై ప్రత్యేక పూజలు
District News, Hanamkonda

మెట్టుగుట్టపై ప్రత్యేక పూజలు

వరంగల్ వాయిస్, కాజీపేట : మడికొండలోని చారిత్రక మెట్టుగుట్టపై దక్షిణ కాశీ, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రములలో పునర్వసు నక్షత్రం(శ్రీరాముని జన్మనక్షత్రం) సందర్భంగా గురువారం అర్చకులు పరాశరం విష్ణు వర్ధనాచార్యులు శ్రీ స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించి, విశేషంగా అలంకరించి తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. యాగశాలలో శ్రీ రామ మూలమంత్ర హోమం నిర్వహించారు. తదుపరి శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేకములు చేశారు. ముఖ్యంగా ఈనెల 29వ తేదీ నుంచి శ్రావణ ఆగష్టు 29 వరకు శ్రావణ మాసోత్సవములు నిర్వహించబడునని, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని, అభిషేకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కే. శేషు భారతి, కే. వెంకటయ...
బీసీల చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన చీఫ్ విప్
District News, Hanamkonda

బీసీల చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన చీఫ్ విప్

ఆగస్టు 7న బీసీ మహాసభను విజయవంతం చెయ్యండిచీఫ్ విప్ వినయ్ భాస్కర్వరంగల్ వాయిస్, హనుమకొండ :ఆగస్టు 7న ఢిల్లీలో జరగబోయే బీసీ మహాసభను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న ఢిల్లీలో జరిగే బీసీల మహాసభ పోస్టర్ ను బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ దగ్గర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ దేశంలోని బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన చర్చించడానికి ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో 10 వేల మంది బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ త్వరలో చేపట్టే జనాభా లెక్కలలో ...
ఘనంగా గుండు సుధారాణి పుట్టినరోజు వేడుకలు
District News, Hanamkonda

ఘనంగా గుండు సుధారాణి పుట్టినరోజు వేడుకలు

వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ తూర్పు కాశిబుగ్గ చౌరస్తాలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఆకెన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నాయకుడు యూత్ గుండు విజయరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆకెన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గుండు విజయరాజ్ తో కేకు కట్ చేసి, పండ్ల పంపిణీతో పాటు, గులాబీ మొక్కలను పంపిణి చేశారు. కాశిబుగ్గలోని మదర్ ధెరిస్సా అనాధ ఆశ్రమంలో అనాధలకు అన్నదానం చేశారు. మేయర్ ఛాంబర్ లో గుండు సుధారాణి కలుసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమములో టీఆర్ఎస్ నాయకులు పెరుమాండ్ల లక్ష్మణ్, మామిడాల సురేందర్, విరాటి ప్రకాష్ రెడ్డి, గంజి సాంబయ్య, సాంబారి సాయన్న, మార్...
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి
District News, Hanamkonda

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి

వరంగల్ వాయిస్, పరకాల : తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన దీక్షకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలి అన్నారు. అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. అలాగే మిగతా వారి న్యాయమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ పరకాల మండల అధ్యక్షుడు సూర రాజు, ఉపాధ్యక్షుడు ఓట్ల స్వాతి, కార్యదర్శి అశోక్, రాకేష్, రామకృష్ణ, రవీందర్, శైలజ, తిరుపతి, సాంబయ్య, దేవి, నరసయ్య, తదితరులు ...
స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?
District News, Hanamkonda, Top Stories, Warangal

స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?

న‌గ‌రంలో 121 ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లునేటికీ ముందుకు ప‌డ‌ని అడుగులుఇబ్బందులో ప్ర‌జ‌లుమొద్దునిద్ర‌లో బ‌ల్దియా అధికారులు రాష్ట్రంలో రెండో అతి పెద్ద న‌గ‌రంగా అభివృద్ధి చెందుతున్న వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌రాబాద్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు పాల‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు నీటి మూట‌లుగా మారుతున్నాయి. అధికారుల అల‌స‌త్వం, పాల‌కులు ప‌ట్టింపులేని త‌నంతో న‌గ‌రం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెన‌క్కి వెళ్తోంది. న‌గరంలో నూత‌నంగా చేప‌ట్టాల్సిన ఎన్నో ప‌థ‌కాలు కేవ‌లం కాగితాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. ఇదే బాట‌లో న‌గ‌రంలో స్మార్ట్ బ‌స్ షెల్ట‌ర్‌ల నిర్మాణ ప్ర‌క్రియ‌ను కూడా బుట్ట‌దాఖ‌లు చేశారు. దీంతో పాత‌కాల‌పు నాటి బ‌స్ షెల్ట‌ర్‌తోనే న‌గ‌ర ప్ర‌జ‌లు స‌ర్దుకోవాల్సి వస్తోంది. న‌గ‌రంలో మోడ్రన్ బ‌స్ షెల్ట‌ర్‌ల నిర్మాణం ఎప్పుడు చేస్తారో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి న...
కాంగ్రెస్ సత్యాగ్రహ..
District News, Hanamkonda, Political

కాంగ్రెస్ సత్యాగ్రహ..

సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణపై ఆగ్రహంఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల దీక్షలుఅక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్హనుమకొండలో ‘నాయిని’ ఆధ్వర్యంలో నిరసన వరంగల్ వాయిస్, హనుమకొండ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ అక్రమ నోటీసులు జారీ చేయడాన్ని, రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ భవన్ లో "సత్యాగ్రహ దీక్ష" నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యం, ప్రజల పక్షాన పోరాటాలు చేసే వారు లేకుండా చేయాలని బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై అక్రమ కేసులు పెట్టి ఈడీ విచారణ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీనిపై దేశప్రజలు ఆలోచించాలని, మో...
సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే
District News, Hanamkonda, Top Stories, Warangal

సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే

గ్రేటర్‌లో సగానికిపైగా మహిళా ప్రతినిధులేవీరిలో చాలా మంది వంటింటికే పరిమితంరాజకీయంగా చక్రం తిప్పుతున్న పతులుఅధికారిక కార్యక్రమాల్లోనూ వారేప్రకటనల్లోనూ భార్య పేరు పక్కనే భర్త పేరుఅయోమయానికి గురవుతున్న జనం మహిళా సాధికారత కేవలం కాగితాలకే పరిమితమైంది. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నప్పటికీ చక్రం తిప్పేది మాత్రం పురుషులే. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న రాజకీయ రిజర్వేషన్లు మహిళల జీవితాల్లో మార్పు తేవడం లేదు. చట్టసభల్లోనూ వారు భర్తల కనుసన్నల్లోనే నడుచుకుంటున్నారు. భర్త ఎస్‌ అంటే ఎస్‌ అని నో అంటే నో అంటూ వ్యవహరిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు సైతం పతులే హాజరవుతున్నారు. సతులు గడప దాటకుండా కేవలం అధికారిక పత్రాలపై ఆటోగ్రాఫ్‌లకే పరిమితమవుతుండగా పతులు మాత్రం పొద్దున లేచింది మొదలు పొద్దుపోయే వరకు రాజకీయంగా చక్రం తిప్పుతూ హడావిడి సృష్టిస్తున్నారు. కొంతమంది భర్తలు ఇంకొంచెం ముందడుగు ...
విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలి
District News, Hanamkonda

విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలి

వరంగల్‌ వాయిస్‌, హనుమకొండ: పాఠశాల విద్యార్థులకు సామాజిక నైతిక విలువలు, కౌమారవిద్యను నేర్పించాలని కోరుతూ అడిషనల్‌ కలెక్టర్‌ కు ఓరుగల్లు కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ , సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా మంగళవారం వినతిపత్రం సమర్పించారు. తమ వినతిపై అడిషనల్‌ కలెక్టర్‌ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహవిద్యాకార్యక్రమాలు గతంలో వలె జరుగడం లేదని, విద్యాలయాల్లో విద్యతో పాటు దేశభక్తి, సామాజిక, నైతిక విలువలు, జీవన నైపుణ్యాలను పెంపొందించేవిధంగా ఉండాలని, అందుకనుగుణమైన పాఠ్యప్రణాళిక, ఉపాధ్యాయుల కాలనిర్ణయపట్టిక ఉండాలని కోరామన్నారు. పాఠశాలల్లో కన్స్యూమర్స్‌ క్లబ్బుల ఏర్పాటు, పర్యావరణం, స్వచ్ఛ భారత్‌, తెలంగాణ హరితహారం, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించేవిధంగా సహవిద్యాకార్యక్రమాలు ఉండాలన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ ను కలిసినవారిలో కజాంపురం దామోద...
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కుశల్ సంజయ్ కు స్థానం
Cultural, District News, Hanamkonda

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కుశల్ సంజయ్ కు స్థానం

వరంగల్ వాయిస్, కాజీపేట : కుశల్ సంజయ్ బుక్ ఆఫ్ రికార్డ్ 197 యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ (యూఎన్ఓ) గుర్తించిన దేశాల పేర్లు, జాతీయ జెండాను చూసి వాటి రాజధాని కరెన్సీ భాషలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించాడు. కుశల్ సంజయ్ పోతుమారి (9), 3వ తరగతి, వరంగల్ జిల్లా, కాజీపేట మండలం మండికొండకు చెందిన ప్రమోద్, సంయుక్త ల కొడుకు. గిన్నిస్ వరల్డ్ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా అప్లై చేశాడు.197 దేశాల పేర్లు రాజధాని, కరెన్సీ, భాషలు అవలీలగా చెప్పగలడు. రికార్డు ఇంతవరకు ఎవరు సాధించలేదు. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా బింగి నరేందర్ గౌడ్, అడ్డగట్ట గంగాధర్, డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు....
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
District News, Hanamkonda

ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో ఉన్న ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ గిరిజన శక్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు మంత్రి స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని మంద నరేష్ అన్నారు. విద్యార్థులు తమ చదువులు సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం సాధిస్తే రాష్ట్రం వచ్చాక విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. రాష్ట్రం కోసం పోరాడని తెలంగాణ ఉద్యమ ద్రోహి ఎర్రబెల్లి మాత్రం జిల్లాకు మంత్రి అయ్యాడని మండిపడ్డారు. ...