Warangalvoice

Hanamkonda

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
Cultural, District News, Hanamkonda

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

ఆలయాల్లో భక్తుల రద్దీపుట్టలో పాలు పోసి మొక్కులుచల్లంగా చూడాలని ‘నాగన్న’కు పూజలు వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తి శ్రద్ధలతో పుట్టల్లో పాలు పోయడానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయాలను సుందరంగా అలంకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లోని పుట్టలకు, నాగమయ్యను పూజించడానికి భక్తులు తరలివచ్చారు. అభిషేకాలు, పాలు, పండ్లు, పసుపు కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్, ఉర్సు నాగమయ్య గుడికి భక్తులు బారులు తీరారు. తమ కుటుంబాన్ని చల్లంగా చూడాలని నాగమయ్యను వేడుకున్నారు. దయానంద కాలనీలో..వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దయానంద కాలనీ శ్రీ కనకదుర్గ మాత దేవాలయం ఆవరణలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో నాగుల పంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ మాత ఆలయ కమిటీ చైర్మన్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ....
తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచుదాం
Crime, District News, Hanamkonda, Top Stories

తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచుదాం

వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి రెడ్ క్రాస్ లో పోలీసుల ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం వరంగల్ వాయిస్, క్రైం: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి యువతకు పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు కోసం హన్మకొండ రెడ్ క్రాస్ పిలుపునందుకోని హనుమకొండ డివిజినల్ పోలీసుల ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో పాటు పోలీస్ సిబ్బంది, అధికారులు సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేయడంలో వారిని ప్రోత్సహించే విధంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ శిబిరం ముందుగా రక్తదానం చేసి యువతకు అదర్శంగా నిలిచారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రక్తదాతలకు సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ ...
లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..
Bhupalapally, District News, Hanamkonda, Mahabubabad, Top Stories, Warangal

లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..

ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. నేతలు, లీడర్లు అంతా ఆటో కార్మికులను కలిసి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, వరంగల్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, బీజేపీ నేత రాకేష్‌ రెడ్డి తదితరులు ఆటో నడిపి ఆటో కార్మికులను ఉత్సాహపరిచారు. -వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి Gandra Venkataraman Reddy...
దంచికొట్టింది
District News, Hanamkonda

దంచికొట్టింది

గంటన్నర వర్షం.. ఆగమాగం చేసింది..మహా నగరం అతలాకుతలంఉప్పొంగిన డ్రైనేజీలు, నాలాలుఎటూ చూసినా నీళ్లేఎక్కడికక్కడా ట్రాఫిక్ జాంలు వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నగరం జలమయమైంది. సోమవారం మధ్యాహ్నం చడీచప్పుడు లేకుండా ఒక గంట పాటు జోరు వాన కురిసింది. దీంతో నగరంలోని కాలనీలు జలమయమైపోయాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి. హనుమకొండ బస్టాండ్ ప్రాంగణం అంతా నీళ్లు చేరాయి. అలాగే కేడీసీ మీదుగా పెద్ద ప్రవాహం వెళ్లడంతో బస్టాండ్ నుంచి అశోక జంక్షన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాకాజీ కాలనీలో అంతటా నీళ్లు నిలిచిపోవడంతో రోడ్డుపై ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే నిట్ సమీపంలోని త్రివేణి సూపర్ మార్కెట్ ఎదుట హైదరాబాద్ రోడ్డుపై వెళ్తున్న వరద పెద్ద వాగును తలపించింది. మోకాళ్ల లోతు నీళ్లు వెళ్లడంతో బైక్, ఆటో, కార్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ పక్కనే ఉన్న ఎస్బీహెచ్ కాలనీలోకి నీళ్లు...
వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
District News, Hanamkonda

వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్స్వనిధి మహోత్సవ్ ప్రారంభం వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: వీధి వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శనివారం హన్మకొండ లోని అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన ‘‘పట్టణ ప్రగతి స్ట్రీట్ వెండర్స్ డెవలప్మెంట్ స్వనిధి మహోత్సవ్’’ కార్యక్రమాన్ని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ .. స్వ నిధి మహోత్సవం పండగ వాతావరణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహా నగరవ్యాప్తంగా 47,800 మంది వీధి వ్యాపారులను గుర్తించి 27 వేల మందికి 10 వేల రుణాలు అందించి జీడబ్ల్యూఎంసీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. రుణాలే కాకుండా చిరు వ్యాపారులకు శాశ్వత చిరునామా కల్పించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన 3 కోట్ల రూపాయలతో ...
టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు
District News, Hanamkonda, Political

టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు

గులాబీకి కన్నెబోయిన రాజయ్య గుడ్ బైత్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వరంగల్ వాయిస్, హనుమకొండ: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నడిచిన సీనియర్‌ నేత, షిప్‌ అండ్‌ గోట్‌ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఆత్మగౌరవం లేని టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండలేకపోతున్నట్లు సీనియర్‌ నేత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్ల నుంచి సీఎం కేసీఆర్ తో కలిసి నడిచిన నేతగా రాజయ్య యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. నాటి ఉద్యమ నేత కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరుగురు సీనియర్‌ నేతలతో కలిసి దీక్ష చేసిన నాయకుల్లో రాజయ్య ఒకరుగా నిలిచారు. కరీంనగర్‌ అలుగునూర్‌ వద్ద అరెస్ట్‌ అయి ఖమ్మం జైలులో కేసీఆర్‌తో కలిసి ఉన్న నేతల్లో రాజయ్య యాదవ్‌ కూడా ఉన్నారు. రాజీమానామాపై విూడియాతో మాట్లాడిన రాజయ్య… టీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవం లేదన్నారు....
డాక్టర్ బైరి నిరంజన్ కు కేటీఆర్ పరామర్శ
District News, Hanamkonda

డాక్టర్ బైరి నిరంజన్ కు కేటీఆర్ పరామర్శ

వరంగల్ వాయిస్, కాజీపేట : దర్గా కాజీపేటలో ఉన్న తన ఇంటి సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు పక్కన బండ మీద మీద పడబోయిన ఒక వ్యక్తిని కాపాడి తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నమస్తే తెలంగాణ రచయిత, యూనివర్సిటీ అధ్యాపక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరి నిరంజన్ కు ఎడమ చేయి మణికట్టు కీలు విరిగిపోయి బలమైన దెబ్బలు తగలి చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారి పరిస్థితిని తెలుసుకొని ఫోన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దీనికి వారు స్పందిస్తూ తారక రామారావు గొప్ప మానవతావాది అని ప్రమాదవశాత్తు కాలు విరిగి తాను తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతూ కూడా నాకు జరిగిన ప్రమాదాన్ని వెంటనే తెలుసుకొని నన్ను పలకరించడం నాకు ఎంతో భరోసాను ఇచ్చిందని బైరి నిరంజన్ తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, యూనివర్సిటీ అధ్యాపక సంఘం చైర్మన్ డాక్టర్ పి.కరు...
ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు
District News, Hanamkonda

ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు

వరంగల్ వాయిస్, కేయూ : ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రముఖ ఫార్మసీ సంస్థ అలయన్స్ అండ్ ఎకో సిస్టం మేనేజ్ మెంట్ సంచాలకుడు డాక్టర్ కొండం రాజ్ బిరుదురాజు అన్నారు. విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో సెమినార్ హాల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాదె సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఉపన్యాస కార్యక్రమంలో నేడు “డ్రగ్ డెవలప్ మెంట్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ : పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్” అనే అంశంపై విస్తృత ఉపన్యాసం చేశారు. ఫార్మసీ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. మారుతున్న జీవన్ శైలికి అనుగుణంగా డ్రగ్ డెవలప్ మెంట్ లో మార్పులు వస్తున్నాయన్నారు. దీనికి అనుగుణంగా రోగ నిర్ధారణ ఉండాలన్నారు, ఫార్మసీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండం రాజ్ బిరుదురాజు మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్ధి అయ...
31న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్
District News, Hanamkonda

31న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్

వరంగల్ వాయిస్, కేయూ : ఈ నెల 31న తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్ కరపత్రాన్ని యూనివర్సిటీ లైబ్రరీ ఆవరణంలో శుక్రవారం టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరాపాక ప్రశాంత్, రూరల్ జిల్లా కోఆర్డినేటర్ లంక రాజ్ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల పైన ఉద్యోగాల ప్రకటన చేసి, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి అందులో భాగంగా 17,516 ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం ఈ మెగా మోడల్ టెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారుల చేత, ఉత్తమ అధ్యాపకుల చేత ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తున్నామని, ఈ మోడల్ టెస్ట్ ను నిరుద్యోగ అభ్యర్థులందరూ సద్వినియోగ...
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
District News, Hanamkonda

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన శీలం ప్రవీణ్ అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న విషయం స్థానిక నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సీఎం సహాయ నిధి నుంచి రూ. లక్ష మంజూరు చేయించి గురువారం స్వయంగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ చీకటి ఆనంద్ శారద, చెన్న ప్రకాష్, ఎర్రోజు భాస్కర్, దూల్ పేట రాజు, పానుగంటి శ్రీధర్, కేదారి మధు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు....