Warangalvoice

Hanamkonda

ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరూరి….
District News, Hanamkonda

ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరూరి….

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ నెల 13నుండి ఉగాది వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆలయ ఈవో, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....
అట్టహాసంగా వేముల నామినేషన్
District News, Hanamkonda

అట్టహాసంగా వేముల నామినేషన్

మద్దతుగా టీఏజేఎఫ్, టీడబ్లూజేఎఫ్ నేతలు నాగరాజు గెలుపు ఖాయం: ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ వరంగల్ వాయిస్, హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రధాన యూనియన్ అయినా టీయూడబ్ల్యూజే ఐజేయూ నుంచి వేముల నాగరాజు అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం సాయంత్రం 4.50గంటలకు ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీతోపాటు జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, వివిధ యూనియన్ల ప్రతినిధుల ఆధ్వర్యంలో తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి సామంతుల శ్రీనివాస్ కు అందజేశారు. వేముల నాగరాజు గెలుపు కోసం తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ నాయకులతో పాటు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ సభ్యులు తరలివచ్చి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ హాలీ మాట్లాడుతూ రాష్ట్రంలో టీయూడబ్ల్యూజే 143 ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవన్న...
టీయూడబ్ల్యూజే హనుమకొండ జిల్లా అధ్యకుడిగా సుధాకర్
District News, Hanamkonda

టీయూడబ్ల్యూజే హనుమకొండ జిల్లా అధ్యకుడిగా సుధాకర్

వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (హెచ్-143) హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మహా న్యూస్ సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ మస్కపురి సుధాకర్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని యునియన్ సభ్యులందరితో సంప్రదించి ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలిపారు. గతంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగిన సుధాకర్ ఇకపై హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలిపారు. జిల్లాలో మెంబర్ షిప్ ప్రక్రియను పూర్తి చేసి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు. యూనియన్ బలోపేతానికి కృషి: మస్కపురి సుధాకర్ తనపై నమ్మకంతో టీయూడబ్ల్యూ జే హెచ్ -143 హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్...
క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో స్వయం పాలన దినోత్సవం
District News, Hanamkonda

క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో స్వయం పాలన దినోత్సవం

వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానికి డీజిల్ కాలనీలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం రోజున స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఉ త్తమంగా బోధించిన పలువురు విద్యార్థులకు ప్రిన్సిపాల్ శీరీష బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ షరీఫ్, ప్రిన్సిపాల్ శీరిష, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు....
నాకు మీరు రక్ష – మీకు నేను రక్ష
District News, Hanamkonda

నాకు మీరు రక్ష – మీకు నేను రక్ష

మనమంతా ఈ దేశానికి, ధర్మానికి రక్ష బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: ‘తోబుట్టువులు లేని నాకు మీ ప్రేమానురాగాలు ఆప్యాయతలు నన్ను కట్టిపడేశాయి..’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి 11వ డివిజన్ పోతననగర్ కాలనీ మహిళలను కొనియాడారు. గురువారం ఆయనకు పలువురు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. మనసా వాచా అందరికీ అన్నలా అండగా ఉంటానన్నారు. రక్షా బంధన్ బంధానికి కులమతాలు అడ్డుకాదన్నారు. రక్షా బంధన్ అంటే ఒకరికి ఒకరు రక్షణగా ఉండాలని, నాకు నువ్వు రక్షా నీకు నేను రక్షా.. మనమంతా ఈ దేశానికి ధర్మానికి రక్ష అన్నది మాకు చిన్నప్పటి నుంచి సంఘ్ శాఖలో నేర్పిందన్నారు. ప్రధాని మోడీకి పాకిస్తాన్ నుంచి ఒక ఆడపడుచు ప్రతీ ఏడూ రాఖీ కడుతుందన్నారు....
ధరలు తగ్గించాల్సిందే..
District News, Hanamkonda, Political

ధరలు తగ్గించాల్సిందే..

పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలి బీజేపీ, టీఆర్ ఎస్ దొందుదొందే కాంగ్రెస్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నిత్యావసర, పెట్రో, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ , హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను, గ్యాస్ ధరలను తగ్గించాలని ఉప్పులు, పప్పులపై, పాలపై విధించిన జీఎస్టీని వేసి పేదల నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాలు వెంటనే అధిక ధరలను, తగ్గించి జీఎస్టీని ఎత్తివేయాలని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిరాశ్రయులైన వరద బ...
వరలక్ష్మీ నమోస్తుతే..
Cultural, District News, Hanamkonda, Warangal

వరలక్ష్మీ నమోస్తుతే..

భక్తిశ్రద్ధలతో వ్రతాలు మహిళలతో కిటకిటలాడిన ఆలయాలు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ: నగరంలోని 19వ డివిజన్ లో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. ఓ సిటీలోని కోయిల్ కార్ కావ్య ఇంట్లో వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో జరిపారు. అలాగే పలు ఆలయాల్లో సంతోషిమాత వ్రతాల కోసం మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారిని కొలిచారు. శాయంపేటలో.. శాయంపేట మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని దేవాలయ అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచారి ఘనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి పూజా కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి, రాజమణి దంపతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్హర్.. మండలంలో వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. తాడిచెర్ల పెద్దమ్మ తల్లి ఆలయంలో సంతోష్ అయ్యగారి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సం...
ప్రజల ఆహ్లాదానికే పార్క్ ల ఏర్పాటు
District News, Hanamkonda

ప్రజల ఆహ్లాదానికే పార్క్ ల ఏర్పాటు

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ న్యూ మిలినియం బ్యాంక్ కాలనీలో పార్క్ ప్రారంభం వరంగల వాయిస్, హనుమకొండ టౌన్: ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడానికి పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శుక్రవారం బల్దియా పరిధి 49 వ డివిజన్ పరిధి న్యూ మిలినియం బ్యాంక్ కాలనీలో నూతనంగా అమృత్, సాధారణ నిధులు రూ.112.80 లక్షల అంచనా వ్యయం తో నిర్మించిన పార్క్ ను కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు పశ్చిమ నియోజక వర్గంలో ఖాళీ ప్రాంతాలు,లే ఔట్ లను పరిరక్షించడంతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పడ్డ పార్కులో ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్...
‘పీవీ’ ఆడియో విజువల్ ఆవిష్కరణ
District News, Hanamkonda

‘పీవీ’ ఆడియో విజువల్ ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, హనుమకొండ: ఆబోప , వరంగల్ దర్శన్ చానల్ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు పై రూపొందించిన పి.వి.సంక్షిప్త జీవిత చరిత్ర -2022" పి.వి.స్మారక అవార్డు ప్రదానోత్సవ సభ ఆడియో విజువల్ ను వరంగల్ దర్శన్ స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పి.వి.తనయుడు పి.వి.గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పి.వి.ప్రభాకర్ రావు విచ్చేసి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో అతిథులుగా పి.వి.ప్రభాకర్ రావు, సుడా చైర్మన్ జి.వి.రామకృష్టారావు, మాజీ శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణరావు, ఎల్లరెడ్డి పేట ఎమ్మెల్యే సురేందర్, ఆబోప అధ్యక్షుడు మోత్కూరు మనోహర్ రావు, వరంగల్ దర్శన్ చైర్మన్ పెండెంరమేశ్ బాబు, డా. పాలకుర్తి దినకర్ సభలో ఆసీనులై పి.వి.దేశానికి చేసిన సేవలను కొనియాడారు . చక్కని ఆడియో విజువల్ రూపొందించిన వరంగల్ దర్శన్ ఎం.డి ప్రసాదరెడ్డిని అతిథులు అభినందించారు. సభలో పింగళి వెంకటెశ్వర్ రావ...
చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు
Crime, District News, Hanamkonda

చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు

భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ వరంగల్ వాయిస్, హనుమకొండ: క్యాసినో చికోటి ప్రవీణ్ తో తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నామని అతడికి తమకు ఎలాంటి సంబంధం లేదని భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం హన్మకొండ అమృత థియేటర్ పరిధిలోని భవితశ్రీ చిట్ ఫండ్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాసినో చికోటి ప్రవీణ్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని తమ సంస్థతో ఎలాంటి ఆర్థిక సంబంధం లేదన్నారు. వైశ్య సామాజిక వర్గం సమావేశంలో చికోటి ప్రవీణ్ పాల్గొన్నాడని, చిన జీయర్ స్వామితో చికోటి ప్రవీణ్ కు భక్తిపరమైన పరిచయం ఉందని అలా పేద వైశ్య కుటుంబాలకు చేయూతనందించడానికి ఆయనను సంప్రదించడం జరిగిందన్నారు. తమ సామాజిక వర్గం వాళ్ళని ఆధ్యాత్మిక సేవలో భాగంగా యాగంలో పాల్గొన్నప్పుడే ఆయన గురించి తెలిసిందన్నారు. తమ వాసవి బిజినెస్ గ్రూప్ ఆర్గనైజేషన్ సేవ సంస్థకు...