Warangalvoice

Hanamkonda

విద్యార్థిని ని సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజు
Hanamkonda

విద్యార్థిని ని సత్కరించిన ఎమ్మెల్యే నాగరాజు

వరంగల్ వాయిస్,హనుమకొండ: గౌతమ్ జూనియర్  కాలేజీకి  చెందిన విద్యార్థిని నాగపురి హాసిని ఈ సంవత్సరం ఇంటర్ బైపీసీలో 440/438 మార్కులు రాష్ట్రం లో మొదటి ర్యాంకు సాధించిన సందర్భంగా శనివారం వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు హాసిని ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మన వర్థన్నపేట నియోజకవర్గం హాసన్ పర్తి మండల పరిధి నుంచి మొదటి స్థానం సంపాదించటం చాలా గర్వకారణమని అలాగే రాబోయే రోజుల్లో మరింత ఉన్నత విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలు గా సహకరిస్తామని అన్నారు.రాష్ట్ర స్థాయిలో సాధించడానికి కృషి చేసిన గౌతమి జూనియర్ కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి  ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, తంగళ్ళపల్లి తిరుపతి కళాశాల డైరెక్టర్...
అందుబాటులోకి డావిన్సీ XI రోబోటిక్ సర్జికల్ సిస్టమ్
Hanamkonda

అందుబాటులోకి డావిన్సీ XI రోబోటిక్ సర్జికల్ సిస్టమ్

- డాక్టర్ కోన లక్ష్మీ కుమారివరంగల్ వాయిస్,హనుమకొండ : యశోద హాస్పిటల్స్,సోమాజిగూడలో ఇప్పుడు అత్యాధునిక డావిన్సీ XI రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందని  (కన్సల్టెంట్ సర్టికల్గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మినిమల్ యాక్సెస్ జి ఐ సర్జన్, మెటబాలిక్ & బారియాట్రిక్ సర్జన్నిపుణులు)డాక్టర్ కోన లక్ష్మీ కుమారి అన్నారు.శనివారం అశోక హోటల్ లోని కాకతీయ బ్యాంకెట్ హల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ  “ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స ఫలితాలను మెరుగుపరచడానికిరూపొందించబడిన, డావిన్సీ XI రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ విశేషమైన పురోగతిని అందిస్తుందన్నారు.సాంప్రదాయ ఓపెన్ సర్జరీ లేదా లాపరోస్కోపిక్ విధానాలతో పోలిస్తే, ఈ వినూత్న వ్యవస్థ అనేకప్రయోజనాలను అందిచి, రోగులకు వేగంగా కోలుకునేలా చేస్తుందని తెలిపారు.వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పి...
వన్యప్రాణుల సంరక్షణకు ప్రధాన్యం
Hanamkonda, Telangana

వన్యప్రాణుల సంరక్షణకు ప్రధాన్యం

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ వాయిస్, వరంగల్ : అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యాతనివ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఛైర్మన్ శ్రీమతి కొండా సురేఖ అధ్యక్షతన ఏడవ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, పిసిసిఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎం సి పర్గెయిన్, ఫీల్డ్ డైరక్టర్ లు క్షితిజ, శాంతారాం, బోర్డు అధికారులు, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆర్ అండ్ బి, పంచాయతీ, పశుసంవర్ధక శాఖ అధికారులు, బిసిఎన్ఎల్, టి ఫైబర్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు చేశారు. మా...
వరంగల్ లో రూ. 200 కోట్లతో టెక్నికల్ సెంటర్
Hanamkonda, Telangana

వరంగల్ లో రూ. 200 కోట్లతో టెక్నికల్ సెంటర్

రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృషి వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే చాన్స్ ప్రజల్లో హర్షాతిరేకాలు..మంత్రికి అభినందనల వెల్లువ వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగర పురోభివృద్ధికి రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇదే కోవలో వరంగల్ జిల్లాలో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 20 టెక్నికల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా, అందులో ఒక టెక్నికల్ సెంటర్ (హబ్) వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని రంగశాయి పేటలో ఏర్పాటు కానుందనే వార్త వరంగల్ ప్రజలకు గొప్ప ఊరటను కలిగిస్తోంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మంత్రి సురేఖ పట్టుదలతో చేసిన ప్రయత్నాలతో వరంగల్ లో టెక్నికల్ సెంటర...
వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ
Cultural, District News, Hanamkonda

వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

వేదిక శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగిన దేవాలయం     వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని పెడపల్లి డబ్బాల క్రాస్ వద్దగల శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ కాసాంజనేయ స్వామి అయ్యప్ప సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో రెండో సామూహిక పడిపూజ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. గురు స్వామి జానకి రామయ్య ఆధ్వర్యంలో పడిపూజను వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు తరలివచ్చి భజనలు చేసి స్వామి వారి పడిపూజలో సందడి చేశారు. అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పడిపూజ అనంతరం స్వాములకు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పడిపూజలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులు, అయప్ప స్వాములకు, సేవ చేసిన వారికి కమిటీ గౌరవ అధ్యక్షుడు దండబోయిన శ్రీకాంత్, అధ్యక్షుడు చాగంటి రాజు, ఉపాధ్యక్షులు గుంటి ...
అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు
Crime, District News, Hanamkonda, Latest News

అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు

అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆదప్రసాద్ గురువారం హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ప్రాంతానికి చెందిన తన అత్త కోమలను సర్విస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు. స్థానికులకు కథనం ప్రకారం.. ప్రసాద్ కు ఇవ్వవలసిన రూ.4 లక్షల విషయంలో గత కొంత కాలంగా అత్తా, అల్లుడి మధ్య వివాదం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం డబ్బుల విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన ప్రసాద్ తన సర్విస్ రివాల్వర్ తో అత్తపై కాల్పులు జరుపగా అమె అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీస్ ఇన్ స్పెక్టర్ అబ్బయ్య నేతృత్వంలో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు....
ప్లాష్..ప్లాష్..  వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ
Crime, District News, Hanamkonda, Latest News, Warangal

ప్లాష్..ప్లాష్.. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను కూడా బదిలీ చేశారు....
అధికారంలోకి రాగానే.. కేసీఆర్ చర్లపల్లి జైలుకే
District News, Hanamkonda, Political

అధికారంలోకి రాగానే.. కేసీఆర్ చర్లపల్లి జైలుకే

పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ వాయిస్, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా చర్లపల్లి జైలుకే పంపిస్తామని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సమావేశం దేశ, రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారనుందన్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పురించబోతున్నామని ఆయన ప్రకటించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నట్టేటా ముంచుతున్నారన్నారని మండిపడ్డారు. ప్రజలకోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యం కోసం రాజాకీయాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రె...
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
Crime, District News, Hanamkonda

పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు

నూతన గణేష్ మండపాల సమాచారాన్ని ఇవ్వండి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ వరంగల్ వాయిస్, వరంగల్ : మన పండుగలు మతసామరస్యానికి ప్రతీకలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. రానున్న వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగలను పురస్కరించుకొని సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్యంలో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్ లో నిర్వహించారు. ట్రై సీటీ పరిధిలోని వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో పాటు, గణేష్ నవరాత్రి మండళ్ళ నిర్వహకులు పాల్గొన్న ఈ సామవేశానికి సీపీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గతంలో ఎన్నడు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని. ఇదే సంస్కృతిని కోనసాగిస్తూ ఈ సారి కూడా శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలన్నారు. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారుల...
కేయూని మూయించేందుకు కుట్ర
District News, Hanamkonda

కేయూని మూయించేందుకు కుట్ర

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ వాయిస్, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీని మూయించేందుకు కుట్ర జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో యూనివర్శిటీలు లేకుండా చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అని ఆయన మండి పడ్డారు. ఇటీవల పోలీసుల చేతిలో గాయపడిన కేయూ విద్యార్థి సంఘం నేతలను రేవంత్ రెడ్డి పరామర్శించారు. బుధవారం నగరానికి విచ్చేసిన ఆయన దీక్ష చేస్తున్న విద్యార్థులను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్శిటీలో పీహెచీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడులు చేశారని నిప్పులు చెరిగారు. వీధి రౌడీలా మాదిరిగా విద్యార్థులను కొట్టిస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. యూనివర్శిటీల్లో జరిగే అన్యాయాలపైనే విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే శత్రువుల మాదిరిగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాకతీయ వర్శిటీలో జరిగిన అన్యాయాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల...