బాపూజీకి భారత రత్న ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్యే వన్నాల
వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్దంతి వేడుకలు ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. హనుమకొండ హంటర్ రోడ్ లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్ ప్రాంగణంలోని బాపూజీ నిలువెత్తు విగ్రహానికి ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చేర్మన్,వర్దన్నపేట మాజీ శాసన సభ్యుడు వన్నాల శ్రీరాములు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వన్నాల మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి భారత రత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాపూజీ స్పూర్తిదాయకంగా, నిస్వార్థ సేవలు అందించారని వన్నాల కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాట కాలంలో కీలక భూమిక పోషించారని వన్నాల స్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ జయంతిని మాత్రమే అధికారికంగా నిర్...