Warangalvoice

Hanamkonda

పదవ తరగతి ఫలితాలలో ఆర్బిట్ ప్రభంజనం
Hanamkonda

పదవ తరగతి ఫలితాలలో ఆర్బిట్ ప్రభంజనం

వరంగల్ వాయిస్, ఎల్కతుర్తి: నిన్న విడుదల చేసిన 10 వ తరగతి ఫలితాలలో ఎల్లాపూర్ శివారులోని ఆర్బిట్ ఇ- టెక్నో స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపల్ & కరస్పాండెంట్ శ్రీ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు.పదో తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులలో ఎం. వినీల్ రెడ్డి 581, టి. సంజనా రెడ్డి 580, ఏ. విశాల్ రెడ్డి 573 మార్కులు సాధించారు. అలాగే 120 మంది విద్యార్థులలో 90 మార్కులు కి పైగా సాధించిన విద్యార్థుల వివరాలు ఇంగ్లీషులో 69 మంది, సైన్స్ లో 64 మంది, మ్యాథమెటిక్స్ లో 48 మంది, సోషల్ లో 41మంది, తెలుగులో 30 మంది,హిందీలో 14 మంది విద్యార్థినీ, విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ & కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి , డైరెక్టర్ హారిక -భగవాన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు....
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం
District News, Hanamkonda

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం

మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్కొవ్వొత్తులతో శాంతి ర్యాలీవరంగల్ వాయిస్, హనుమకొండ:జమ్మూ కశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణనష్టం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని భారతమాత బిడ్డలైన 28 మంది పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.ఈ దారుణ ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, హనుమకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో  గురువారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుండి సుబేదారి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్  హాజరై అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ&nbs...
కోతి ఎల్లయ్య సేవలు విశిష్టమైనవి
District News, Hanamkonda

కోతి ఎల్లయ్య సేవలు విశిష్టమైనవి

అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చిన వ్యక్తి ఆయన జీవన విధానం ఆదర్శప్రాయం వరంగల్ వాయిస్, హసన్ పర్తి : మూడు దశాబ్దాలు ఉత్తమ సేవలు అందించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు కోతి ఎల్లయ అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చాడని హసన్ పర్తి బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇన్నంశెట్టి సుమాదేవి అన్నారు. ఆయన జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో 30 ఏళ్లు పనిచేసి హసన్ పర్తి బాలికల హైస్కూల్లో ఉద్యోగ విరమణ పొందిన కోతి ఎల్లయ్యకు సోమవారం అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమాదేవి మాట్లాడుతూ సమయపాలన పాటించడంతో పాటు విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడంలో ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ జి.శివకుమార్, చిన్ననాటి మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ స్వయంకృషితో పైకి ఎదిగిన ఎల్లయ్య సేవలను కొనియాడారు. అన్నారం...
Centenary Baptist Church | సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రవీణ్‌ సంతాప సభ
Hanamkonda

Centenary Baptist Church | సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రవీణ్‌ సంతాప సభ

వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు. వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఫ్రీ డౌన్ ప్రార్థన వరంగల్ సిటీ హోప్, ఫెలోషిప్స్ ఆర్గనైజేషన్స్ దైవజనులు ఉదయకాల ప్రార్థనలు చేసి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ప్రవీణ్ పగడాల అకాల మరణం తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్. రెవరెండ్ డాక్టర్ కె.మార్టిన్ లూథర్, బిషప్ రెవ.ప్రసన్న మార్టిన్, రెవ, జోసెఫ్ ప్రభాకర్, ఎన్.జాన్సన్ , రెవ జి ప్రతాప్ రెవ జి మార్క్ పీటర్, రెవ ఎన్ మత్తయి, రెవ సీ...
SundarRaj | బీసీ నాయకులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి
District News, Hanamkonda

SundarRaj | బీసీ నాయకులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి

బీసీల రాజకీయ పోస్టర్ ఆవిష్కరణ మాజీ కూడా చైర్మన్, బీసీ నేత సుందర్ రాజు యాదవ్ వరంగల్ వాయిస్, భీమదేవరపల్లి : బీసీ నాయకులు ఐక్యంగా ఉండి మన హక్కులు సాదించుకోవాలని బీసీ నేత, మాజీ కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని గ్రంథాలయంలో జాతీయ బీసీ నాయకులు మాజీ జడ్పీటీసీ వంగ రవి అధ్యక్షతన బీసీల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ నేత మాజీ కూడా చైర్మన్, సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ హజరై మాట్లాడుతూ హనుమకొండ ఆర్ట్స్ అండ్ కాలేజీలో ఫిబ్రవరి 2 యుద్దభేరి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీసీల జెండాలు ఏగిరే సమయం అసన్నమైందన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల నుండే బీసీలు రాజకీయ యుద్దం మొదలవుతుందన్నారు. ఫిబ్రవరి 2న జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరి ప్రతి ఒక్...
బీసీల ప్రత్యేక రాజకీయ పార్టీ రావాలి
District News, Hanamkonda

బీసీల ప్రత్యేక రాజకీయ పార్టీ రావాలి

రాజకీయ చైతన్యంకై గ్రామాలకు తరలాలి స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్ల గెలుపుకై బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కృషి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సమాజ విముక్తి కోసం రాజ్యాధికారం అవసరమని, రాజకీయ చైతన్యం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని బీసీ ఇంటలెక్టువల్ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి టి.చిరంజీవులు అన్నారు. భారత రత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ 102వ జయంతి సందర్భంగా "స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల పాత్ర" అనే అంశంపై హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కోసం ఉద్యమిస్తున్న బీసీలు దోపిడీ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలను వీడాలని పిలుపునిచ్చారు. బీసీల ఓట్లు...
రాజకీయ యుద్ధభేరి సభను సక్సెస్ చేయాలి
District News, Hanamkonda, Telangana, Warangal

రాజకీయ యుద్ధభేరి సభను సక్సెస్ చేయాలి

యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధ భేరి సభకు ముదిరాజులు మద్దతు తెలుపుతూ గురువారం హనుమకొండలోని హంటర్ రోడ్ లోని ముదిరాజ్ అర్బన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, భయ్యా స్వామి, పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజ్ కులస్తులతో బీసీ రాజకీయ యుద్ధభేరి సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే బోయిన అశోక్ ముదిరాజ్, బీసీ నేత, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజుయాదవ్ హజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి పల్లె బోయిన అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న కులం ముదిరాజు కులం అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నట...
బీజేపీ దామెర మండల నూతన అధ్యక్షుడిగా వేల్పుల రాజ్ కుమార్
District News, Hanamkonda, Telangana, Warangal

బీజేపీ దామెర మండల నూతన అధ్యక్షుడిగా వేల్పుల రాజ్ కుమార్

వరంగల్ వాయిస్, దామెర : భారతీయ జనతా పార్టీ దామెర మండలం నూతన అధ్యక్షుడిగా దామెర గ్రామానికి చెందిన వేల్పుల రాజ్ కుమార్ నియామకమయ్యారు. గత 15 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని వివిధ హోదాలలో ఉమ్మడి జిల్లా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా, గత స్థానిక ఎన్నికలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం దామెర వార్డు మెంబర్ గా, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన సేవలను గుర్తించి దామెర మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ నియామకానికి సహకరించిన జిల్లా ఎన్నికల అధికారి పెద్దోళ్ల గంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు మందు ఐలయ్య, కన్నబోయిన రాజయ్య యాదవ్, జిల్లా బీజేపీ నాయకులు గురుజాల శ్రీరామ్ ...
“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ
District News, Hanamkonda, Telangana

“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఆరోగ్యదర్శిని 10వ వార్షికోత్సవ సంచికను, నూతన సంవత్సర క్యాలెండర్ ను హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ , వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్యదర్శిని పక్షపత్రిక పదేళ్లుగా నిర్విరామంగా వెలువరించడం అభినందనీయమన్నారు. అలాగే ఉచిత హోమియో క్యాంపులు నిర్వర్తిస్తూ ప్రజలకు హోమియోపతిపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ ఒకవైపు వైద్యం చేస్తూనే మరొకవైపు ఆరోగ్య దర్షిని పక్షపత...
ఆర్థికంగా బలపడాలంటే రాజ్యాధికారం రావాలి
District News, Hanamkonda

ఆర్థికంగా బలపడాలంటే రాజ్యాధికారం రావాలి

రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీలు ఆర్థికంగా బలపడాలంటే రాజకీయంగా రాణించాలని అందుకు రాజ్యాధికారం అవసరమని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. బీసీ ఐక్యవేదిక మేధావుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండలోని మాస్టర్ జీ డిగ్రీ కళాశాలలో బీసీ ఉద్యమ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, సమస్యల పరిష్కారం అనే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా చిరంజీవులు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో బీసీ సంఘాలు ఉన్నప్పటికీ వారి మధ్య సఖ్యత లేక బీసీలు రాజకీయంగా రాణించలేకపోతున్నారని, భవిష్యత్తు రాజకీయాలు రాణించాలంటే బీసీల మధ్య సఖ్యత తప్పనిసరని తెలిపారు. కుల గణాలతో బీసీలకు మరింత లాభం జరిగే అవకాశం ఉందని, సమగ్ర సర్వేపై కొన్ని పార్టీలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జాక్, మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, ఓబీసీ కో కన్వీనర్ గడ్డం భాస్క...