అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్
వరంగల్ వాయిస్, హనుమకొండ : షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా లేబర్ అధికారి కార్యాలయం ముందు వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాల గడుస్తున్న నేటికీ 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను అమలు చేయడం లేదని, ఈ కారణంగా కోట్లాది రూపాయలు కార్మికులు నష్టపోతున్నారని, రాష్ట్ర కార్మిక శాఖ కనీస వేతనాలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి ఫైలు పంపినప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి కనీస వేతనాల అమలును నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతనాలు చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మూడుసార్లు సవరణ జరగాల్సి ఉండగా ...