Warangalvoice

District News

మెట్టుగుట్టపై శ్రీ సీతారామల కల్యానోత్సవం
Cultural, District News

మెట్టుగుట్టపై శ్రీ సీతారామల కల్యానోత్సవం

వరంగల్ వాయిస్, మడికొండ : దక్షిణ కాశీగా ప్రసిద్ది గాంచిన శ్రీ మెట్టుగుట్టపై నున్న శ్రీ సీతా రామచంద్ర స్వామి, శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రామనవమి బ్రమ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10:30గంటల నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట శాసన సభ్యులు కెఆర్ నాగరాజు, జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుహాసిని హాజరై శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని కల్యాణాన్ని తిలకించారు. 18వ తేదీ గురువారం ఉదయం హోమం, బలిహరణ వసంతోత్సవం, సాయంత్రం 6 గంటలకు నిత్యా హోమం, బలిహరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శేషు భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పరాశరం విష్ణువర్ధనాచార్యులు, రాగిచేడు అభిలాష్ శర్మ, పారుపల్లి సత్యనారాయణ...
ఊరూ..వాడా.. సీతారాముల కల్యాణ శోభ
Cultural, District News

ఊరూ..వాడా.. సీతారాముల కల్యాణ శోభ

కన్నుల పండువగా వేడుకలు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు వరంగల్ వాయిస్, వరంగల్ : సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను బుధవారం ఎస్ ఆర్ ఆర్ తోటలోని శ్రీ వీరాంజనేయ దేవాలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ తంతు నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ కల్యాణోత్సవంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు వీలుగా ఎల్ ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వివాహనంతరం భక్తులకు ఆశీర్వచనం నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. భక్తులకు బెల్లం పానకం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా 32వ డివిజన్ పరిధిలో ఆటో స్టాండ్ ఏరియాలోని శ్రీ వీరాంజనేయ దేవాలయం, వినాయక కాలనీలో జరిగిన కల్యాణ మహోత్సవంలో స్థానిక కార్పొరేటర్ పల్లం పద్మ రవి వాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహి...
వాహనం నడిపిన మైనర్లపై కేసు
Crime, District News

వాహనం నడిపిన మైనర్లపై కేసు

జువైనల్ హోమ్ కు తరలింపు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు నడిపిన 8 మంది మైనర్లను గుర్తించి శుక్రవారం జువైనల్ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయగా, వీరికి రెండు రోజులు బాలల అబ్జర్వేషన్ హోం కు పంపినట్లు మట్టేవాడ సీఐ కె.శ్రీధర్ తెలిపారు. పోచమ్మ మైదాన్, ఎంజీఎం సెంటర్, పోతన రోడ్డు, బట్టల బజార్, హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లలో వాహనాలు నడుపుతున్న మైనర్ లను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో తమ వాహనాలను మైనర్లు ఇవ్వొద్దన్నారు. మైనర్లు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే శిక్ష తప్పదని హెచ్చరించారు....
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అరూరి రమేష్
District News, Political

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అరూరి రమేష్

వరంగల్  వాయిస్, వరంగల్ : గత మూడు రోజులుగా ఉత్కంట రేపిన అరూరి రమేష్ పార్టీ మారుడం ఎట్టకేలకు తెరవీడింది.  బీఆర్ఎస్ పార్టీకి , వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవకీ రాజీనామ చేస్తున్నట్లు లేఖ విడిదలజేసారు. అదే విధంగా ఇంతకాలం పార్టీలో అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గార్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాల్లూ తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు....
వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ
Cultural, District News, Hanamkonda

వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

వేదిక శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగిన దేవాలయం     వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని పెడపల్లి డబ్బాల క్రాస్ వద్దగల శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ కాసాంజనేయ స్వామి అయ్యప్ప సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో రెండో సామూహిక పడిపూజ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. గురు స్వామి జానకి రామయ్య ఆధ్వర్యంలో పడిపూజను వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు తరలివచ్చి భజనలు చేసి స్వామి వారి పడిపూజలో సందడి చేశారు. అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పడిపూజ అనంతరం స్వాములకు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పడిపూజలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులు, అయప్ప స్వాములకు, సేవ చేసిన వారికి కమిటీ గౌరవ అధ్యక్షుడు దండబోయిన శ్రీకాంత్, అధ్యక్షుడు చాగంటి రాజు, ఉపాధ్యక్షులు గుంటి ...
అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు
Crime, District News, Hanamkonda, Latest News

అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు

అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆదప్రసాద్ గురువారం హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ప్రాంతానికి చెందిన తన అత్త కోమలను సర్విస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు. స్థానికులకు కథనం ప్రకారం.. ప్రసాద్ కు ఇవ్వవలసిన రూ.4 లక్షల విషయంలో గత కొంత కాలంగా అత్తా, అల్లుడి మధ్య వివాదం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం డబ్బుల విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన ప్రసాద్ తన సర్విస్ రివాల్వర్ తో అత్తపై కాల్పులు జరుపగా అమె అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీస్ ఇన్ స్పెక్టర్ అబ్బయ్య నేతృత్వంలో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు....
ప్లాష్..ప్లాష్..  వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ
Crime, District News, Hanamkonda, Latest News, Warangal

ప్లాష్..ప్లాష్.. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను కూడా బదిలీ చేశారు....
బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష
Crime, District News, Mahabubabad, Viral News

బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష

మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు మూడేళ్ల క్రితం ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ లో మూడేళ్ల క్రితం తొమ్మిది సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జిల్లా కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ పట్టణంలోని కృష్ణ కాలనీలో నివాసముంటున్న జర్నలిస్ట్ కుసుమ రంజిత్ రెడ్డి-వసంత దంపతులు కుమారుడైన దీక్షిత్ రెడ్డి 18 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ స్థానికంగా ఉంటూ ఆటో మొబైల్ షాప్ నడుపుకుంటున్నాడు. ఆర్థికంగా ఉన్న దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని కుట్ర పన్నిన మంద సాగర్ ఆయ...
అధికారంలోకి రాగానే.. కేసీఆర్ చర్లపల్లి జైలుకే
District News, Hanamkonda, Political

అధికారంలోకి రాగానే.. కేసీఆర్ చర్లపల్లి జైలుకే

పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ వాయిస్, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా చర్లపల్లి జైలుకే పంపిస్తామని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సమావేశం దేశ, రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారనుందన్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పురించబోతున్నామని ఆయన ప్రకటించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నట్టేటా ముంచుతున్నారన్నారని మండిపడ్డారు. ప్రజలకోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యం కోసం రాజాకీయాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రె...
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
Crime, District News, Hanamkonda

పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు

నూతన గణేష్ మండపాల సమాచారాన్ని ఇవ్వండి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ వరంగల్ వాయిస్, వరంగల్ : మన పండుగలు మతసామరస్యానికి ప్రతీకలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. రానున్న వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగలను పురస్కరించుకొని సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్యంలో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్ లో నిర్వహించారు. ట్రై సీటీ పరిధిలోని వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో పాటు, గణేష్ నవరాత్రి మండళ్ళ నిర్వహకులు పాల్గొన్న ఈ సామవేశానికి సీపీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గతంలో ఎన్నడు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని. ఇదే సంస్కృతిని కోనసాగిస్తూ ఈ సారి కూడా శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలన్నారు. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారుల...