Warangalvoice

District News

అంగన్ వాడీలో బడిబాట
District News, Warangal

అంగన్ వాడీలో బడిబాట

వరంగల్ వాయిస్, కరీమాబాద్ : నగరంలోని 40వ డివిజన్ కరీమాబాద్ సెక్టార్ పరిధిలోని సుభాష్ నగర్ (ఉర్సు) అంగన్ వాడీ కేంద్రంలో శనివారం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ పిల్లలు..దేశానికి వెలుగు దివ్వెలు, ఒత్తిడి లేని విద్య..అంగన్ వాడీ విద్య, అంగన్ వాడీ ఒడి..అభివృద్ధిల బడి, తల్లీబిడ్డ క్షేమం..అంగన్ వాడీ ఆశయం అనే నినాదాలు ఆయా వాడల్లో మారుమ్రోగాయి. 30 నెలలు నిండిన పిల్లలను అంగన్ వాడీ కేంద్రానికి వచ్చేలా అలవాటు చేసి మంచి అలవాట్లు, ఆటపాట, సృజనాత్మకత, భాష పరిచయం, కథలు చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లులు, గర్భిణులు, ఏఎల్ ఎంఎస్సీ కమిటీ సభ్యులు, అంగన్ వాడీ టీచర్లు బి.సునీత, టీ.నాగమణి, కిశోర బాలిక సుహిత, మహేశ్వరి, స్వప్న తదితరులు పాల్గొన్నారు....
విత్తన కొనుగోళ్లపై రైతులకు అవగాహన
District News, Top Stories

విత్తన కొనుగోళ్లపై రైతులకు అవగాహన

వరంగల్ వాయిస్, మల్హర్ : మరి కొన్ని రోజుల్లో వర్షాకాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల రైతులకు మండల వ్యవసాయ అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో ఏఈవోలు విత్తన కొనుగోలు అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తన ప్యాకెట్, రశీదు పంట కాలం పూర్తి అయ్యే వరకు భద్రపరచుకోవాలని, లూజు గా ఉన్న విత్తన ప్యాకెట్లు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదని ఈ సందర్బంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు అనూష, శిరీష, మనీషా, రైతులు పాల్గొన్నారు.  ...
ప్రాణాపాయ స్థితిలో ఆక్సిజన్ ప్లాంట్
District News, Hanamkonda

ప్రాణాపాయ స్థితిలో ఆక్సిజన్ ప్లాంట్

ఐదు కోట్లు వెచ్చించినా అవసరాలు తీర్చని ప్లాంట్ ఓ ఏజెన్సీతో కుమ్మకై రూ. 70 లక్షలకు అప్పనంగా కట్ట పెట్టిన అధికారులు.! మామూళ్ల మత్తులో ఆక్సిజన్ ప్లాంట్ మూసివేసేందుకు కుట్ర కోవిడ్ సమయంలో దాతలు అందజేసిన ఆక్సిజన్ మిషన్స్ సైతం గోల్ మాల్ జాడలేని విజిలెన్స్ విచారణ, పట్టించుకుకొని ప్రభుత్వ పెద్దలు వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : కోవిడ్ క్లిష్ట పరిస్థితిలో ఎంతో ఉన్నత లక్ష్యాలతో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ రోగుల అవసరాలకు అక్కరకు రాకుండ పోతోంది. మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కల్పతరువులా ఊపిరి పోస్తుంది అనుకుంటే అధికారుల కనికరం లేక మరమ్మతులకు నోచుకోక ఏకరువు పెడుతుంది అధికారుల పర్యవేక్షణ లోపమో లేక ఓ ప్రయివేట్ ఏజెన్సీ పాలిట వరమో తెలియదు గానీ, చిన్న చిన్న మరమ్మత్తులు చేయించడం చేతకాక ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు పేరుతొ భారీ కుంభకోణం జరుగుతున్నట్లు జిల్లా కేంద్రంలో భారీగ...
నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని కావడం ఖాయం
District News, Political

నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని కావడం ఖాయం

కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్వరంగల్ వాయిస్, హనుమకొండ : నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని కావడం ఖాయమని 60 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ కి మద్దతుగా ఆదివారం 60వ డివిజన్ వడ్డేపల్లి లోని మిడిదొడ్డి వాడ, కటకంవాడ, కట్క వాడ లలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ ప్రచారం లో పాల్గొని నరేంద్రమోడీ  అభివృధి కార్యక్రమాలు వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీరంగం సాగర్, 60వ డివిజన్ అధ్యక్షులు సతీష్, ప్రధాన యాదగిరి, అడప రాము, సాగర్ గౌడ్, నరేష్, బాబీ, చందు, సంతోష్, కటకం రాజు, కందికొండ రాజు, రాజేష్, హరీష్, రాము, శ్యామ్, సతీష్, బూత్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....
శ్రీరాముడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలి..
Cultural, District News

శ్రీరాముడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలి..

వరంగల్ వాయిస్, స్టేషన్ ఘనపూర్ : మండలం తాటికొండ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చిల్పూరు మండలం నష్కల్ లో శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలోని శ్రీ సీత రామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులు, చిన్నారులతో మమేకమై వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య వారిని ఆప్యాయంగా పలకరించారు. కనకదుర్గ మాత దేవాలయంలో.. వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : సీతారాముల కళ్యాణం సందర్భంగా నర్సంప...
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
Cultural, District News

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

వరంగల్ వాయిస్, రేగొండ : ఉమ్మడి రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని రావుల పల్లి, రూపిరెడ్డి పల్లి, తిరుమలగిరి, గోరి కొత్తపల్లి గ్రామాల్లో రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. రామాలయ నిర్వాహణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయుకుడైన శ్రీరాముడు, సీతమ్మల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది..మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయ ధ్వనాల మధ్య బుధవారం నవమి తిథి, పునర్వసు నక్షత్రం , మిధున లగ్నంలో జానకీ మాత శిరస్సున శ్రీరామచంద్రమూర్తి జీలకర్ర బెల్లం ఉంచారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు అమ్మవారి మెడలో స్వామివారు మాంగల్య ధారణ చేశారు. రామయ్య పెళ్లిని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తుల తరలివచ్చారు.భక్తులు సీతారాముల పాదాలపై తలంబ్రాలు వేసి ఆశీర్వాదాలు పొందారు. స్వామి వారి కల్యాణ మహోత్సవం...
హనుమకొండ పద్మాక్షి కాలనీలో.. సీతారామ కల్యాణ మహోత్సవం
Cultural, District News

హనుమకొండ పద్మాక్షి కాలనీలో.. సీతారామ కల్యాణ మహోత్సవం

హనుమకొండ పద్మాక్షి కాలనీలో.. వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ పద్మాక్షి కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయంలో బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ మారుతీ పరపతి సంఘం ఆధ్వర్యంలో సీతారామ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గంధతి సుధాకర్-కల్పన, అడపా కిరణ్-స్వాతి, గందే సాయిరాం-మాధురిలు కల్యాణంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ గందె కృష్ణ-భాగ్యలక్ష్మి, కనుకుంట్ల రవికుమార్-ఉమాదేవి, కరు దశరథ్ కుమార్-లలిత, మాదాసు మొగులయ్య-సరళ, అంబటి నరేందర్-అరుణ, గంట సత్యం-సీత, మారుతి పరపతి సంఘ కమిటీ మేఘా సింగ్, కాటి ఎల్లయ్య, దేవులపల్లి సంపత్, నట్వర్లాల్ పటేల్, హర్షం కృష్ణమూర్తి, ఆరుట్ల రామాచార్యులు, ఆలయ అర్చకులు, హనుమాన్ మూలాధారణ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించినారు. భక్తులు తలంబ్రాలు వేసి తదనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు. 29వ డివిజన్ లో.. వరంగల్ వాయిస్, ...
పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరాలయంలో..
Cultural, District News

పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరాలయంలో..

పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరాలయంలో.. వరంగల్ వాయిస్, పరకాల : శ్రీరామ నవమి సందర్భంగా పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ మహోత్సవంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని, సుఖ సంతోషాలతో అందరూ జీవించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బసవేశ్వరాలయంలో.. శ్రీరామనవమి సందర్భంగా గీసుగొండలోని బసవేశ్వరాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ...
కల్యాణ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి
Cultural, District News

కల్యాణ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి

కల్యాణ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ జిల్లా ప్రజలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం వేలాది మంది భక్తులు రాములవారి కళ్యాణానికి చూడటానికి పోటెత్తారని, అయోధ్యలోని రామాలయంలో 500 సంవత్సరాల తరువాత ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయనన్నారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక అన్నారు. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం..అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుక...
అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి
Cultural, District News

అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ వాయిస్, కాటారం : రాములోరి పెండ్లి వేడుకలు ఊరూరా ఘనంగా జరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు-తలంబ్రాలు సమర్పించారు. అలాగే కాటారం మండల కేంద్రమైన గారి పెళ్లి కాటారం చింతకాని తదితర గ్రామాల్లో ఆయా దేవతామూర్తుల ఆలయాలలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని పెళ్లి వేడుకలను తిలకించారు. వేద మూర్తి వేద పండితులు మంత్రోచ్ఛారణలతో సీతారాముల కల్యాణాన్ని పూర్తి గావించారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల వద్ద అన్నదానం నిర్వహించారు. భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన వేడుకల్లో పుస్తే, మట్టే తలంబ్రాలను మద్ది నవీన్, పులి అశోక్ దంపతులు సమర్పించగా చీరల రమేష్ దంపతులు అన్నదానం నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని దత...