Warangalvoice

District News

జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల రమణ
District News, Hanamkonda

జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల రమణ

వరంగల్ వాయిస్ (హన్మకొండ) : ఐజెయు అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రకటించారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన రమణ మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు. జర్నలిస్టు సంఘంలో గతంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులుగా, సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా, నాలుగుసార్లు ప్రధాన కార్యదర్శిగా, రాష్ర్ట కార్యవర్గ సభ్యులుగా, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా పనిచేసారు. వివిధ పత్రికల్లో, మీడియాలో పనిచేసిన రమణ ప్రస్తుతం మన తెలంగాణ దినపత్రిక ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్నారు. తనను రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం పట్ల మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి ర...
సెప్టెంబర్‌‌17 ముమ్మాటికీ తెలంగాణ విలీన దినమే
District News, Telangana, Warangal

సెప్టెంబర్‌‌17 ముమ్మాటికీ తెలంగాణ విలీన దినమే

సీనియర్ జర్నలిస్టు, హనుమకొండ : తెలంగాణలో నైజాం విముక్తి కోసం జరిగిన పోరాటానికి గుర్తుగాసెప్టెంబర్ 17ను ముమ్మాటికీ విలీన దినోత్సవంగానే గుర్తించాలి. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఐక్యంగా పోరాటాలు చేశారు. కానీ బీజేపీ నేతలు హైదరాబాద్‌‌ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్‌‌17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షోయబుల్లాఖాన్‌‌ ముస్లిం అయినప్పటికీ రజాకార్లు ఆయన చేతులు నరికారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మతపరమైన కోణంలో ఎలా చూస్తాం. సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమయ్యే దశకు చేరుకున్నంక ‘‘చుట్టుముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ.. గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరీ కడుతం కొడుకో.. నైజాం సర్కరోడా’’ అని తెలంగాణ ప్రజలు పాటలు పాడుకునే వారు. నిజాంకు ప్రజలు ఘోరీ కట్టేందుకు సిద్ధమైన తర్...
నిమజ్జన వేళ ట్రాఫిక్ ఆంక్షలు
Crime, District News

నిమజ్జన వేళ ట్రాఫిక్ ఆంక్షలు

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటి పరిధిలో వినాయక నిమజ్జనం సందర్బంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించబడుతుంది. కాబట్టి నగరంలో పెద్ద స్థాయిలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రై సిటి పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా రేపు అనగా 16-09-2024 మధ్యాహ్నం 12.00 నుండి మరుసటి రోజు తేది 17-09-2024 ఉదయం 10.00 గంటల వరకు ట్రాఫిక్  ఆంక్షలు కోనసాగుతాయి. భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు.. 1.ములుగు,భూపాలపల్లి వైపు నుంచి వచ్చు భారీ వాహనాలు హైదరాబాద్ కు వెళ్ళవలసినవి ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్లాలి. భూపాలపల్లి పరకాల నుంచి ఖమ్మం వెళ్లవలసినవి ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కరుణాపురం, మడికొండ, కడిపి...
వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి
District News, Telangana

వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి

ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ వాయిస్, వరంగల్ : హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి" అని సీఐఐ తెలంగాణ ఇంటరాక్టివ్ సెషన్‌లో పార్లమెంటు సభ్యురాలు (లోక్‌సభ) డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్ నిట్ క్యాంపస్ లో శుక్రవారం సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌తో పాటుగా ఏఐ ఇన్ ఫార్మా: ది ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇన్ ఫార్మాలో సీఐఐ మెంబర్‌షిప్ రోడ్‌ షో, సీఓఈల సేవలను నిర్వహించారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. ఇందులో పరిశ్రమలోని ముఖ్య నాయకులు వరంగల్‌పై తమ విజన్‌ను పంచుకున్నారు. సీఐఐ తెలంగాణ చైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సాయి డి ప్రసాద్ 'Ai in Pharma Session'లో స్వాగత ప్రసంగంలో తెలంగాణ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ, 2047 బి 1 ట్రిలియన్ USDఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే లక్ష్యాన్ని...
గురువులకి వందనం
District News, Telangana

గురువులకి వందనం

ఉపాధ్యాయులకు మంత్రి సురేఖ శుభాకాంక్షలు (వరంగల్ వాయిస్, వరంగల్): విద్యార్థికి దశ, దిశను చూపించే గురువు పాత్ర సమాజంలో అత్యున్నతమైనదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. చదువు మాత్రమే అన్ని రకాల అణచివేతలు, నిర్బంధాల నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తుందని మంత్రి అన్నారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు. అలాంటి విద్యను అందించడంలో నిమగ్నమైన ఉపాధ్యాయులందరూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారని మంత్రి పేర్కొన్నారు. ఒక సమర్థుడైన గురువుకు మాత్రమే దేశగమనాన్ని మార్చగల శక్తి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు గాను విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ కమిషన్ ...
నవీన్ కుటుంబానికి అండగా ఉంటా
District News, Hanamkonda

నవీన్ కుటుంబానికి అండగా ఉంటా

 ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పది వేల తక్షణ ఆర్థిక సాయం ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని హామీ పద్మశాలి కులస్తుల ఆర్థిక సాయం చెక్కు అందజేత కుల కట్టుకుని దర్శనం ఈ చేయూత బాధిత కుటుంబానికి అభయ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు హాజరైన పద్మశాలి కుల పెద్దలు వరంగల్ వాయిస్, హన్మకొండ :  నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన నవీన్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలబడతామని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. హనుమకొండ కుమార్ పల్లి కి చెందిన నిరుపేద పద్మశాలి కులస్తుడైన నవీన్ భార్య నిఖిత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సొంత ఇల్లు లేకపోవడంతో కర్మకాండలు స్మశాన వాటిక లోనే ఉంటూ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అఖిల భారత పద్మశాలి హనుమకొండ జిల్లా కమిటీ వెంటనే స్పందించి ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని పద...
54వ డివిజన్ లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
District News

54వ డివిజన్ లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

వరంగల్ వాయిస్, హనుమకొండ: హనుమాన్ నగర్ లోని జై హనుమాన్ పరపతి సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కందికొండ సదానందం మాట్లాడుతూ మన దేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చిందని, మన దేశ ప్రజలు నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో మన దేశం ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆత్మకూరు దేవేంద్ర చారి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల కష్టాన్ని త్యాగాన్ని మన ప్రతి ఒక్క భారతీయుడు ఎల్లప్పుడూ మర్చిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల సూర్యనారాయణ, ఉప్పుల రాజు, సముద్రాల రాజేష్, కుంటి మురళీధర్, ధోనికల సుమన్, మట్టేవాడ చంద్రమౌళి, పోతుల ప్రవీణ్, మాటూరి ప్రసాద్, పి మండ నాగరాజు, నరసింహ చారి, మెరుగు రాజేష్, కాలనీవాసులు పాల్గొన్నారు....
రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
District News

రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వరంగల్ వాయిస్, కేయూ డబ్బాలు: హనుమకొండ జిల్లా పెగడపల్లి డబ్బాల ఎక్స్ రోడ్డు దగ్గర రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ ఘనంగా నిర్వహించారు. రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ, మిత్ర బృందం శ్యామ్, సతీష్, రాము, రాజకుమార్, పవన్, మనోహర్, వెంకన్న, విక్రం రాజు, వంశీ, అభిషేక్, కాలనీవాసులు రాజారాం, సుధాకర్ రావు, వెంకటేశ్వర్లు, అంజయ్య, శ్రీనివాస్, సతీష్, కుమార్ స్వామి, మోహన్, తదితరులు పాల్గొన్నారు. [15/08, 2:43 pm] Ravi NMR Eenaddu: 54వ డివిజన్ లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు వరంగల్ వాయిస్, హనుమకొండ: హనుమాన్ నగర్ లోని జై హనుమాన్ పరపతి సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కందికొండ సదానందం మాట్లాడుతూ మన దేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చిందని, మన దేశ ప్రజలు నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో మన దేశం ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. అనంతరం ఈ కార...
ఘనంగా ఏనుగు దినోత్సవం
District News, Latest News, Telangana

ఘనంగా ఏనుగు దినోత్సవం

పాల్గొన్న మంత్రి కొండా సురేఖ వరంగల్ వాయిస్, బెంగుళూరు : సకల జీవులకు ఈ భూమి పై జీవించే హక్కు వుందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని(ఆగస్టు 12) పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యుమన్-ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్’ సదస్సులో కొండా సురేఖ పాల్గొన్నారు. ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ, వాటి సంరక్షణ, నిర్వహణపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కర్నాటక ప్రభుత్వం ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును చేపట్టడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల నిర్వహణ రంగంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఆసియా ఏనుగులను అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో చేర్చడం మానవ వైఫల్యాన్ని నిరూపిస్తున్నద...
బీసీ రిజర్వేషన్ల సాధనకు అన్ని జెండాలు ఏకం కావాలి
District News, Latest News

బీసీ రిజర్వేషన్ల సాధనకు అన్ని జెండాలు ఏకం కావాలి

ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ బీసీలు రైతు తరహా ఉద్యమ చేయాలి ఇందిరాపార్క్ దీక్షలో నినదించిన నాయకులు వరంగల్ వాయిస్, హైదరాబాద్ : గడిచిన ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజ్వేషన్లను సాధించడం కోసం వివిధ పార్టీల్లోని బీసీలు జెండాలను పక్కకు పెట్టి ఐక్యంగా ఉద్యమించాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం అధ్యక్షతన జరిగిన సమగ్ర కుల జనగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధన కోసం బీసీ సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. గడిచిన 75 ఏండ్లుగా దోపిడీకి గురైన బీసీలు సామాజిక, ఆర్థిక, రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజకీయ అవకాశాలు త...