Warangalvoice

District News

వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన
Agriculture, District News

వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన

వరంగల్ వాయిస్, నడికుడ : కావేరీ సీడ్స్ కంపెనీ వారు మంగళవారం రోజున నడికుడ మండలం వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శలనలో స్థానిక వరికోలు రైతులే కాకుండా, నడికుడ మండల కేంద్రం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాంబశివ రెడ్డి వ్యవసాయ క్షత్రంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాంబశివరెడ్డి మాట్లాడుతూ తాను చాలా కాలంగా కావేరీ కంపెనీ వారి బంపర్ ప్రత్తి రకం విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందినానని తెలియజేసారు. ఈ కార్యక్రమం సంబర్భంగా రైతులు అడిగిన పలు సందేహాలకు  కంపెనీ ప్రతినిధి దుర్గారెడ్డి వివరణ ఇస్తూ.. ప్రస్తుత ప్రత్తి సీజన్ లో రైలుకు బంపర్ ప్రతి రకం విత్తనాలు వరదాయకమని, ఈ రకం విత్తనాలు మిగితా కంపెనీ విత్తనాలకంటే అధిక దిగిబడిని ఇవ్వడమేకాక, చీడపీడలు పంటకు ఆశించవని, రసం పీల్చే పురుగులు పట్టదని, అంతే కాకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ...
కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు
Cultural, District News

కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు

వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అత్యంత ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళా ఉద్యోగినులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల వేడుకల్లో పాల్గొని అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగినులు వారి పిల్లలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగ వేడుకలు మహిళల ఆటపాటల మధ్య అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి.మహిళలు బతకమ్మ పాటలకు చేసిన నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల్లో మహిళల్ని శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనదన్నారు. పువ్వులను దేవతలుగా పూజించే గొప్ప పండుగ ప్రపంచంలో ఒక్క ...
బల్దియాలో బతుకమ్మ వేడుకలు
Cultural, District News

బల్దియాలో బతుకమ్మ వేడుకలు

వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జీడబ్ల్యూఎంసీ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, గుండు చందన పూర్ణచందర్, ఈదురు అరుణ విక్టర్, జన్ను షిబారాణి, బస్వరాజు శిరీష, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, విజయశ్రీ రాజాఅలీ, పోశాల పద్మ, తూర్పాటి సులోచన, ఆడెపు స్వప్న, బైరాబోయిన ఉమా దామోదర్, బల్దియా సెక్రెటరీ విజయలక్ష్మి, ఉప కమిషనర్ మహిళ ఉద్యోగులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని తంగేడు పూలు, గునుగు పూలు, బంతిపూలు, చామంతులతో అందంగా పేర్చి మహిళలందరితో ఒక చోట చేరి చప్పట్లతో నృత్యాలు చేస్తూ సందడి చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ...
కావేరీ కంపెనీ పత్తి విత్తనాల క్షేత్ర పదర్శన
District News, Warangal

కావేరీ కంపెనీ పత్తి విత్తనాల క్షేత్ర పదర్శన

వరంగల్ వాయిస్, దామెర : శనివారం రోజున దామెర మండలం పెంచికలపేటలో రైతు రవీందర్ వ్యవసాయ క్షేత్రంలో కావేరీ కంపెనీ వారి ప్రత్తి విత్తనాల క్షేత్ర పదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు రవీందర్ మాట్టాడుతూ తాను కావేరీ కంపెనీ వారి పత్తి విత్తనాలు వాడి అధిక దిగుబడులు సాధించానని, అంతే కాకుండా ఈ విత్తనాలు అధిక మన్నికతో ఉండడమే కాకుండా, చీడపీడలకు తావులేకుండా మంచి దిగుబడిని ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కావేరీ కంపెనీ టీసీఎం జి.నితిన్ రైతులు అడిగిన పలు సందేహాలకు సమాధానగా ఈ రకం పత్తి విత్తనాలు రసం పిల్చుకునే పురుగులను నివారించడమే కాకుండా  బెట్ట వాతావరణాన్ని తట్టుకొని నిలబడుతాయని, అంతే కాకుండా అధిక దిగుబడులను ఇస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు క...
వరంగల్ వాయిస్ కథనానికి స్పందన
District News, Warangal

వరంగల్ వాయిస్ కథనానికి స్పందన

ప్రమాదం అంచున ప్రయాణం పేరిట వరంగల్ వాయిస్ లో ఈ నెల 3న ప్రచురితమైన కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. ప్రమాదాలు జరుగకుండా శనివారం పాక్షికంగా ఏర్పాట్లు చేశారు. దారి పొడువునా కర్రలు పాతి వాటికి రిబ్బన్ లను అమర్చారు. దూరంనుంచి వచ్చే వాహనదారులకు సైతం కనిపించేలా వీటిని ఏర్పాటు చేశారు. అయితే పనులు త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేయించాలని కోరుతున్నారు. -వరంగల్ వాయిస్, వరంగల్...
మెడికల్ కాలేజీకి పార్థివ దేహం అప్పగింత
District News, Warangal

మెడికల్ కాలేజీకి పార్థివ దేహం అప్పగింత

వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కోన్ రెడ్డి ఆయిల్ రెడ్డి (85) బుధవారం అనారోగ్యంతో మరణించగా వారి కుమారుడు రామ్మోహన్ రెడ్డి, భార్య ఉపేంద్ర, కుటుంబ సభ్యులు సమాజ హితం కోరి పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ లో పార్థివ దేహాన్ని, పాకాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, అనాటమీ విభాగం ప్రొఫెసర్, సిబ్బంది ప్రేమ్ కుమార్ కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, డి.రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కే.శంకర్రావు యాదవ్, సలహాదారు డాక్టర్ రాజేంద్రప్రసాద్, కార్యనిర్వాక సభ్యులు అనంతుల కేదారి, రామచందర్, మనోహర్, చల్ల వెంకట్రెడ్డి, వీరస్వామి తదితర సామాజిక వాదులు పాల్...
ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు
District News, Warangal

ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు

వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ వరంగల్, హనుమకొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం’ వేడుకలను వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ లలితా దేవి, డాక్టర్ కె.వెంకటరమణ, డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జన్ను కిరణ్ హాజరై ఫార్మసిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో ఫార్మసిస్టులు అతి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ఫార్మసీ చట్టం 1948 సెక్షన్ 42 ఇంప్లిమెంట్ చేయాలని, డాక్టర్ ప్రెస్క్రిప్షన్ లేకుండా ఫార్మసిస్టులు పేషంట్స్ కు మందులు డిస్పెన్స్ చేయరాదని, వైద్యులు రాసిన ప్రెస్క్రిప్షన్ లో తప్పులు ఉంటే ధైర్యంగా ఎత్తి చూపాలని, కరోనా సమయంలో ఫార్మసి...
బాపూజీకి భారత రత్న ఇవ్వాలి
District News, Hanamkonda

బాపూజీకి భారత రత్న ఇవ్వాలి

మాజీ ఎమ్మెల్యే వన్నాల వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్దంతి వేడుకలు ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. హనుమకొండ హంటర్ రోడ్ లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్ ప్రాంగణంలోని బాపూజీ నిలువెత్తు విగ్రహానికి ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చేర్మన్,వర్దన్నపేట మాజీ శాసన సభ్యుడు వన్నాల శ్రీరాములు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వన్నాల మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి భారత రత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాపూజీ స్పూర్తిదాయకంగా, నిస్వార్థ సేవలు అందించారని వన్నాల కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాట కాలంలో కీలక భూమిక పోషించారని వన్నాల స్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ జయంతిని మాత్రమే అధికారికంగా నిర్...
సహకార సంఘానికి రైతులే వెన్నెముకలు… 
District News, Warangal

సహకార సంఘానికి రైతులే వెన్నెముకలు… 

-సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 67వ వార్షిక మహాసభ సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. అనంతరం సీఈఓ రవి నివేదిక చదివి వినిపించాడు. కొందరు రైతులు నివేదికలో ఉన్నవి అన్ని తప్పులే అని వాపోయారు. అనంతరం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ త్వరలో రైతులకు కొత్త రుణాలు అందజేస్తామని తెలిపారు. ఈ వార్షిక మహాసభలో సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు చిన్నారెడ్డి మాట్లాడుతూ జల్లి గ్రామంలో గోదాం నిర్మించాలని దానికి రోడ్డు కోసం ఆరు గుంటల భూమిని ఇస్తున్నట్లు మహాసభ తెల్ల కాగితంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు....
వారెవ్వ.. తగ్గేదే లే పుష్ప.. పుష్పరాజ్
Crime, District News

వారెవ్వ.. తగ్గేదే లే పుష్ప.. పుష్పరాజ్

సినిమా లెవెలెల్లో గంజాయి స్మగ్లింగ్ గంజాయి స్మగ్లర్ అరెస్ట్ భారీగా పట్టుబడిన గంజాయి యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసుల చొరవ రూ.85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయి, ట్రాక్టర్  పోలీసులు స్వాధీనం పోలీస్ సిబ్బందిని ప్రశంసించిన సిపి అంబర్ కిషోర్ షా వరంగల్ వాయిస్, క్రైం : అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా దేశవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో మనందరికి తెలిసిందే.. అందులో  ఎర్ర చెందనం చెక్కల అక్రమ రవాణా ఎలా చేయవచ్చో.. అటవీ అధికారుల కళ్లు గప్పి స్మగ్లింగ్ ఎలా చేయాలో తెలివిగా పోలీసులను ఎలా బురిడీ కొట్టించవచ్చో చాల చక్కగా చూపించారు. బహుషా ఆ సీనిమాను స్పూర్తగా తీసుకున్నట్టున్నారు ఈ గంజా అక్రమ రవాణా దారులు. మొత్తం సినిమాలో చూపించి నట్టుగా ట్రాక్టర్ లో స్మగ్లింగ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాకు పాలు పాడుతున్న ఓ ముఠా తాజా పోలీసులకు పట్టు పడ్డారు.. పోలీసులు తెలిపిని వివరాల ...