Warangalvoice

District News

రాజకీయ యుద్ధభేరి సభను సక్సెస్ చేయాలి
District News, Hanamkonda, Telangana, Warangal

రాజకీయ యుద్ధభేరి సభను సక్సెస్ చేయాలి

యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధ భేరి సభకు ముదిరాజులు మద్దతు తెలుపుతూ గురువారం హనుమకొండలోని హంటర్ రోడ్ లోని ముదిరాజ్ అర్బన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, భయ్యా స్వామి, పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజ్ కులస్తులతో బీసీ రాజకీయ యుద్ధభేరి సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే బోయిన అశోక్ ముదిరాజ్, బీసీ నేత, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజుయాదవ్ హజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి పల్లె బోయిన అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న కులం ముదిరాజు కులం అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నట...
బీజేపీ దామెర మండల నూతన అధ్యక్షుడిగా వేల్పుల రాజ్ కుమార్
District News, Hanamkonda, Telangana, Warangal

బీజేపీ దామెర మండల నూతన అధ్యక్షుడిగా వేల్పుల రాజ్ కుమార్

వరంగల్ వాయిస్, దామెర : భారతీయ జనతా పార్టీ దామెర మండలం నూతన అధ్యక్షుడిగా దామెర గ్రామానికి చెందిన వేల్పుల రాజ్ కుమార్ నియామకమయ్యారు. గత 15 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని వివిధ హోదాలలో ఉమ్మడి జిల్లా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా, గత స్థానిక ఎన్నికలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం దామెర వార్డు మెంబర్ గా, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన సేవలను గుర్తించి దామెర మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ నియామకానికి సహకరించిన జిల్లా ఎన్నికల అధికారి పెద్దోళ్ల గంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు మందు ఐలయ్య, కన్నబోయిన రాజయ్య యాదవ్, జిల్లా బీజేపీ నాయకులు గురుజాల శ్రీరామ్ ...
Konda Sureka | స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనిత.. సావిత్రీబాయి ఫూలే
Cultural, District News

Konda Sureka | స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనిత.. సావిత్రీబాయి ఫూలే

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వగృహంలో పుష్పాంజలి ఘటించిన మంత్రి వరంగల్ వాయిస్, వరంగల్ : మహిళా సాధికారతకు పర్యాయపదం సావిత్రీబాయి ఫూలే అని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సావిత్రీబాయి ఫూలే 194వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. మహిళలపై తీవ్ర అణచివేత, వివక్ష కొనసాగుతున్న ఆ కాలంలోనే మహిళల విద్య కోసం, స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనితగా ఫూలే అని కొనిడాయాడారు. అనాథ పిల్లలు, స్త్రీలకు శరణాలయాలు, ఆశ్రమాలు నెలకొల్పడంతో పాటు సాంఘిక దురాచారాల నిర్మూలనకు, సమాజ ఉద్ధరణకు తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలిగా ఈ ప్రపంచం సావిత్రీబాయి ఫూలేని గుండెల్లో పెట్టుకుంటుందన్నారు. మహిళలకు స్వేచ్ఛ లభిస్తే ఈ ప్రపంచానికి బానిసత్వం నుంచి విముక్తి లభించినట్టేనని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి వారికి స...
“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ
District News, Hanamkonda, Telangana

“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఆరోగ్యదర్శిని 10వ వార్షికోత్సవ సంచికను, నూతన సంవత్సర క్యాలెండర్ ను హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ , వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్యదర్శిని పక్షపత్రిక పదేళ్లుగా నిర్విరామంగా వెలువరించడం అభినందనీయమన్నారు. అలాగే ఉచిత హోమియో క్యాంపులు నిర్వర్తిస్తూ ప్రజలకు హోమియోపతిపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ ఒకవైపు వైద్యం చేస్తూనే మరొకవైపు ఆరోగ్య దర్షిని పక్షపత...
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
District News, Warangal

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మోహన్ సింగ్ ఎంజీఎం(పీపీయూనిట్) పరిశీలన వరంగల్ వాయిస్, వరంగల్ : ఎంజీఎం హాస్పిటల్ ఆర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీపీ యూనిట్)ను వర్ధన్నపేట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్.మోహన్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్.మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని డాక్టర్ కు, స్టాఫ్ ను కోరారు. ముఖ్యంగా ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ 100శాతం టార్గెట్ రీచ్ కావాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరాల పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉందని సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పిల్లలు, వృద్ధులు ఈ సమయంలో బయట తిరుగడం మంచిది కాదని తెలిపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్లాల్సి వస్తే స్వెటర్ కానీ, ఉలన్ దుస్తులు ధరించి బయటికి వెళ్లాలని తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో...
ఆర్థికంగా బలపడాలంటే రాజ్యాధికారం రావాలి
District News, Hanamkonda

ఆర్థికంగా బలపడాలంటే రాజ్యాధికారం రావాలి

రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీలు ఆర్థికంగా బలపడాలంటే రాజకీయంగా రాణించాలని అందుకు రాజ్యాధికారం అవసరమని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. బీసీ ఐక్యవేదిక మేధావుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండలోని మాస్టర్ జీ డిగ్రీ కళాశాలలో బీసీ ఉద్యమ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, సమస్యల పరిష్కారం అనే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా చిరంజీవులు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో బీసీ సంఘాలు ఉన్నప్పటికీ వారి మధ్య సఖ్యత లేక బీసీలు రాజకీయంగా రాణించలేకపోతున్నారని, భవిష్యత్తు రాజకీయాలు రాణించాలంటే బీసీల మధ్య సఖ్యత తప్పనిసరని తెలిపారు. కుల గణాలతో బీసీలకు మరింత లాభం జరిగే అవకాశం ఉందని, సమగ్ర సర్వేపై కొన్ని పార్టీలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జాక్, మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, ఓబీసీ కో కన్వీనర్ గడ్డం భాస్క...
సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్
Crime, District News

సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్

వరంగల్ వాయిస్, కేయూ : కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి పురం భగత్‌సింగ్‌నగర్ లో మంగళవారం సాయంత్రం సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ అక్రమ మద్యం, గంజాయి,గుట్కా, హెల్మెట్ ధరించడం , సీసీ కెమెరాల ప్రాముఖ్యత, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ వినియోగం పై కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో 20 ద్విచక్ర వాహనాలు, రెండు వేల రూపాయల గుట్కా స్వాధీనం చేసుకున్నారు.అనంతరం హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి కాలనీ పిల్లలకు బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో హనుమకొండ,కేయూసి ఇన్స్పెక్టర్ లు సతీష్,రవికుమార్, 7 మంది ఎస్‌ఐలు, 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.     under Central Zone DCP Sheikh Salima...
ఘనంగా గోకుల్ నగర్ సదర్ ఉత్సవాలు
Cultural, District News

ఘనంగా గోకుల్ నగర్ సదర్ ఉత్సవాలు

హాజరైన ఎంపీలు అనిల్ యాదవ్, కడియం కావ్య ,ఎమ్మెల్యే నాయిని... వరంగల్ వాయిస్ , హనుమకొండ : హనుమకొండ గోకుల్ నగర్ లో బంక సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళన్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు.. మొదటి సారిగా వరంగల్ లో నిర్వహించడం ప్రత్యేకంగా ఉంది. : నాయిని రాజేందర్ రెడ్డి సదర్ పండుగ అంటే హైదరాబాద్ గా పేరుగాంచిన వేడుక కానీ ఇప్పుడు వరంగల్ లో మొదటి సారిగా నిర్వహించడం ప్రత్యేకంగా ఉందని అభినందించారు.అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ సోదరా సోదరిమనులు పార్టీలకు అతీతంగా గెలిపించారాని సదర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా యాదవులకు సమూచితస్థానం కల్పించడం జరిగిందని అతి చిన్న వయసులో అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపిన ఘనత కాంగ్రెస్ ...
ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న కారు
Crime, District News

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న కారు

ఇద్దరు యువకుల దుర్మరణం వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : వేగంతో వస్తూ అదుపు తప్పిన కారు.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే దుర్మరణం చెందిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. గూడూరు మండలం పోనుగోడు గ్రామానికి చెందిన సంగెం మణికంఠ (17), నీల అరుణ్ కుమార్ (16) ప్రాణస్నేహితులు. మణికంఠ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతి బా ఫూలే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ దసరా సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు తన స్నేహితుడు నీల అరుణ్ కుమార్ తో కలసి ద్విచక్ర వాహనంపై వెలుతున్నాడు. దీంతో మార్గం మధ్యలో జమాండ్లపల్లి సమీపంలోకి చేరుకోగానే మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు వైపు అతివేగంతో వెళ్తూ అదుపు తప్పిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అరుణ్...మణికంఠలు 50 మీటర్ల దూరం ఎగి...
కేహెచ్ సీ – 172 హైబ్రీడ్ బీజీ 2  బంపర్ పత్తి విత్తనాల వాడకం ఎంతో మేలు
Agriculture, District News

కేహెచ్ సీ – 172 హైబ్రీడ్ బీజీ 2 బంపర్ పత్తి విత్తనాల వాడకం ఎంతో మేలు

వరంగల్ వాయిస్, వరికోలు : స్థానికి నడికుడ మండలం వరికోలులో కావేరీ సీడ్స్ కంపెనీ వారు బుధవారం రోజున కేహెచ్ సీ - 172  హైబ్రీడ్ బిజీ బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శలనలో స్థానిక వరికోలు రైతులే కాకుండా, నడికుడ మండల కేంద్రం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాంబశివ రెడ్డి పంట పొలంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాంబశివరెడ్డి మాట్లాడుతూ తాను చాలా కాలంగా కావేరీ కంపెనీ వారి బంపర్ ప్రత్తి రకం విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందినానని తెలియజేసారు. ఈ కార్యక్రమం సంబర్భంగా రైతులు అడిగిన పలు సందేహాలకు  కంపెనీ ప్రతినిధి జి. నితిన్ వివరణ ఇస్తూ.. ప్రస్తుత ప్రత్తి సీజన్ లో రైలుకు బంపర్ ప్రతి రకం విత్తనాలు వరదాయకమని, ఈ రకం విత్తనాలు మిగితా కంపెనీ విత్తనాలకంటే అధిక దిగిబడిని ఇవ్వడమేకాక, చీడపీడలు పంటకు ఆశించవని, రసం పీల్చే పురుగులు పట్టదని, అంతే కాకుండా...