Harish Rao | పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిన ప్రభుత్వ తీరు: హరీశ్‌రావు
స్కాలర్‌షిప్‌ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్ షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: స్కాలర్‌షిప్‌ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్ షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమన్నారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండడం.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారుతున్నదని ఆగ్రహం వ్యక్తం చ...