Harish Rao | మూగ జీవాలు కూడా రేవంత్ రెడ్డిని క్షమించవు.. మండిపడ్డ హరీశ్‌రావు
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఫెయిల్ అయ్యారని, ఆయనను మూగజీవాలు కూడా క్షమించవు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.
వరంగల్ వాయిస్, సిద్దిపేట : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఫెయిల్ అయ్యారని, ఆయనను మూగజీవాలు కూడా క్షమించవు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఏప్రిల్ 27 న వరంగల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో హరీశ్‌రావు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది.. పార్టీ పెట్టి లక్ష్యం సాధించి.. ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ జెండా అని హరీశ్‌రావు పేర్కొన్నారు. నాడు 2001లో సిద్దిపేట కొనాయపల్లి వెంకటేశ్వ...