ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్
వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో ఉన్న ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ గిరిజన శక్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు మంత్రి స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని మంద నరేష్ అన్నారు. విద్యార్థులు తమ చదువులు సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం సాధిస్తే రాష్ట్రం వచ్చాక విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. రాష్ట్రం కోసం పోరాడని తెలంగాణ ఉద్యమ ద్రోహి ఎర్రబెల్లి మాత్రం జిల్లాకు మంత్రి అయ్యాడని మండిపడ్డారు. ...