Warangalvoice

District News

Madhira : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : పాగి బాలస్వామి
District News

Madhira : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : పాగి బాలస్వామి

వరంగల్ వాయిస్,  మధిర : అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్ర‌భుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖ‌మ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, రామోజీ యోగేశ్ అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో, రాజీవ్ యువ వికాసంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలన్నారు. అనంతరం తొలి సభ్యత్వాన్ని సీనియర్ జర్నలిస్టులు అట్లూరి సాంబిరెడ్డి, కొంగర మురళి చేతుల మీదగా జర్నలిస్టులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రావిరాల శశి కుమార్, మువ్వా మురళి, మక్కెన నాగేశ్వరరావు, కిలారి కిశోర్, నాళ్ల శ్రీనివాసరావు, కాకరపర్తి శ్రీనివాసరావ...
Harish Rao | న‌మ్మినందుకు రైతుల గొంతు కోస్తారా..? రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించిన హ‌రీశ్ రావు
District News

Harish Rao | న‌మ్మినందుకు రైతుల గొంతు కోస్తారా..? రేవంత్‌ను సూటిగా ప్ర‌శ్నించిన హ‌రీశ్ రావు

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట‌ హ‌రీశ్‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోస్తున్న.. కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా రైతన్న గోస ఇకనైనా పట్టించుకోండి. వారి కన్నీటి కష్టాలు తీర్చండి. అకాల వర్షాలు, సాగు నీటి గోస, కరెంట్ కష్టాలను ఎదుర్కొని కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను నట్టేట ముంచింది. కొండంత సంబురంతో పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడిచినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదు. దీంతో అకాల వర్షం ఆ రైతన్నను నిండా ముంచింది. కష్టపడి పండించిన ధాన్యమంతా...
Warangal | జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు యువతులకు గాయాలు
District News

Warangal | జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు యువతులకు గాయాలు

వరంగల్ వాయిస్, వరంగల్ చౌరస్తా : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. శనివారం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఎం.కె.నాయుడు హోటల్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మంత్రి రాక కోసం కార్యక్రమాన్ని కొంత సమయం వేచి ఉంటారు. అలాగే ప్రారంభ కార్యక్రమం, మంత్రులు ప్రసంగించి వెళ్లే వరకు నిలిపివేయడంతో ఈ క్రమంలో భారీగా చేరుకున్న నిరుద్యోగ యువతముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ అద్దాలు పగిలిపోవడంతో ముగ్గురు యువతులకు గాయాల్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. కాగా, ఇరుకుగా ఉన్న హోటల్లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించడంపై పలువురు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
కోతి ఎల్లయ్య సేవలు విశిష్టమైనవి
District News, Hanamkonda

కోతి ఎల్లయ్య సేవలు విశిష్టమైనవి

అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చిన వ్యక్తి ఆయన జీవన విధానం ఆదర్శప్రాయం వరంగల్ వాయిస్, హసన్ పర్తి : మూడు దశాబ్దాలు ఉత్తమ సేవలు అందించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు కోతి ఎల్లయ అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చాడని హసన్ పర్తి బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇన్నంశెట్టి సుమాదేవి అన్నారు. ఆయన జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో 30 ఏళ్లు పనిచేసి హసన్ పర్తి బాలికల హైస్కూల్లో ఉద్యోగ విరమణ పొందిన కోతి ఎల్లయ్యకు సోమవారం అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమాదేవి మాట్లాడుతూ సమయపాలన పాటించడంతో పాటు విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడంలో ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ జి.శివకుమార్, చిన్ననాటి మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ స్వయంకృషితో పైకి ఎదిగిన ఎల్లయ్య సేవలను కొనియాడారు. అన్నారం...
Grain Purchasing Centers : కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం
District News

Grain Purchasing Centers : కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం

వరంగల్ వాయిస్, కట్టంగూర్ : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్ర‌భుత్వ మద్దతు ధర పొందాలని న‌కిరేక‌ల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే ప‌లుచోట్ల‌ సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు తన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, తాసీల్దార్ గుగులోతు ప్రసాద్, ఎంపీడీఓ పెరుమళ్ల‌ జ్ఞానప్రకాశ్‌రావు, వ్యవసాయ శాఖ అధికారి గిరిప్రసాద్, పీఏసీఎస్ సీఈఓ బండ మల్లారెడ్డి, ఏపీఎం సైదులు, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మ సాగర...
MEO | ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య : ఎంఈఓ సత్యనారాయణ శెట్టి
District News

MEO | ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య : ఎంఈఓ సత్యనారాయణ శెట్టి

వరంగల్ వాయిస్, తిమ్మాజిపేట : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంఈఓ సత్యనారాయణ శెట్టి అన్నారు. సోమవారం మండల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులకు ట్వినింగ్ కార్యక్రమంలో ద్వారా ఉన్నత పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య ప్రమాణాలు, సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి నైపుణ్యం కల అత్యున్నతమైన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన ఉంటుందన్నారు. విద్యార్థుల్లో జీవన ప్రమాణాలు పెంపొందించుట, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దామని ఎంఈఓ తెలిపారు. సామాజిక స్పృహ కేవలం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, రఘు, రాంబాబు, మనోహర్, లక్ష్మయ...
Kodad | మద్యం మత్తులో సిగరెట్‌ తాగుతూ నిద్రలోకి జారుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. నిప్పంటుకొని మృతి
District News

Kodad | మద్యం మత్తులో సిగరెట్‌ తాగుతూ నిద్రలోకి జారుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. నిప్పంటుకొని మృతి

వరంగల్ వాయిస్, కోదాడ : మద్యం మత్తులో సిగరెట్‌ వెలిగించుకుని.. దానిని ఆర్పివేయకుండా నిద్రలోకి జారుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంటలు చెలరేగడంతో మరణించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) మండలంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మంగలి తండాకు చెందిన ధరావత్‌ బాలాజీ (52) నడిగూడెం మండలం చెన్నకేశవాపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు....
MLA Nayini Rajender Reddy | ఆత్మరక్షణ శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరం : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
District News

MLA Nayini Rajender Reddy | ఆత్మరక్షణ శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరం : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

ఆత్మరక్షణ శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ వాయిస్, హనుమకొండ  : ఆత్మరక్షణ  శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు. హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం( జేఎన్ఎస్) ఇండోర్ స్టేడియంలో బాలికల స్వీయ రక్షణకై యూఎస్‌ఏలో లో స్థిరపడ్డ గ్రాండ్ మాస్టర్ గూడూరు సుధాకర్ నేతృత్వంలో ఆత్మరక్షణ మెలుకువలు (సెల్ఫ్ డిఫెన్స్) శిక్షణ శిబిరాన్ని కలెక్టర్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ తో  కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలపై పెరుగుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వారి భద్రతను నిర్ధారించడానికి పాఠశాలల్లో వారికి ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వాలని సూచించారు. బాలికలకు ఆత్మరక్షణ, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, ఆత్మబలాభివృద్ధిని న...
Warangal Court | వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
District News

Warangal Court | వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో పోలీసులు, లాయ‌ర్లు, కోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వరంగల్ వాయిస్, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో పోలీసులు, లాయ‌ర్లు, కోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కోర్టు వ‌ద్ద‌కు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. లాయ‌ర్లు, కోర్టు సిబ్బంది భ‌యంతో గ‌డుపుతున్నారు. జిల్లా జ‌డ్జికి మెయిల్ ద్వారా ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి బాంబు పెట్టామ‌ని మెయిల్ చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యాన్ని తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. నిన్న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, నాగ‌ర్‌క‌ర్నూల్ క‌లెక్ట‌రేట్ల‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే....
Jurala project | జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.. ఎమ్మెల్యేకు రైతుల మొర
District News

Jurala project | జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.. ఎమ్మెల్యేకు రైతుల మొర

ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టు చెంతనే ఉన్న నందిమల్ల, మూలమల్ల, మస్తీపూర్ తదితర గ్రామాలకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మొర పెట్టుకున్నారు. వరంగల్ వాయిస్, అమరచింత : ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టు  చెంతనే ఉన్న నందిమల్ల, మూలమల్ల, మస్తీపూర్ తదితర గ్రామాలకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి  మొర పెట్టుకున్నారు. సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సమీపంలో ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను నందిమల్ల గ్రామానికి చెందిన రైతులు రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సరోజ నరసింహుల తో పాటు పలువురు రైతులు విజ్ఞప్తి చేశ...