Warangalvoice

District News

మెట్టుగుట్టపై ప్రత్యేక పూజలు
District News, Hanamkonda

మెట్టుగుట్టపై ప్రత్యేక పూజలు

వరంగల్ వాయిస్, కాజీపేట : మడికొండలోని చారిత్రక మెట్టుగుట్టపై దక్షిణ కాశీ, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రములలో పునర్వసు నక్షత్రం(శ్రీరాముని జన్మనక్షత్రం) సందర్భంగా గురువారం అర్చకులు పరాశరం విష్ణు వర్ధనాచార్యులు శ్రీ స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించి, విశేషంగా అలంకరించి తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. యాగశాలలో శ్రీ రామ మూలమంత్ర హోమం నిర్వహించారు. తదుపరి శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేకములు చేశారు. ముఖ్యంగా ఈనెల 29వ తేదీ నుంచి శ్రావణ ఆగష్టు 29 వరకు శ్రావణ మాసోత్సవములు నిర్వహించబడునని, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని, అభిషేకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కే. శేషు భారతి, కే. వెంకటయ...
బీసీల చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన చీఫ్ విప్
District News, Hanamkonda

బీసీల చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన చీఫ్ విప్

ఆగస్టు 7న బీసీ మహాసభను విజయవంతం చెయ్యండిచీఫ్ విప్ వినయ్ భాస్కర్వరంగల్ వాయిస్, హనుమకొండ :ఆగస్టు 7న ఢిల్లీలో జరగబోయే బీసీ మహాసభను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న ఢిల్లీలో జరిగే బీసీల మహాసభ పోస్టర్ ను బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ దగ్గర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ దేశంలోని బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన చర్చించడానికి ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో 10 వేల మంది బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ త్వరలో చేపట్టే జనాభా లెక్కలలో ...
ఘనంగా గుండు సుధారాణి పుట్టినరోజు వేడుకలు
District News, Hanamkonda

ఘనంగా గుండు సుధారాణి పుట్టినరోజు వేడుకలు

వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ తూర్పు కాశిబుగ్గ చౌరస్తాలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఆకెన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నాయకుడు యూత్ గుండు విజయరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆకెన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గుండు విజయరాజ్ తో కేకు కట్ చేసి, పండ్ల పంపిణీతో పాటు, గులాబీ మొక్కలను పంపిణి చేశారు. కాశిబుగ్గలోని మదర్ ధెరిస్సా అనాధ ఆశ్రమంలో అనాధలకు అన్నదానం చేశారు. మేయర్ ఛాంబర్ లో గుండు సుధారాణి కలుసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమములో టీఆర్ఎస్ నాయకులు పెరుమాండ్ల లక్ష్మణ్, మామిడాల సురేందర్, విరాటి ప్రకాష్ రెడ్డి, గంజి సాంబయ్య, సాంబారి సాయన్న, మార్...
బాధితుడికి ఆర్థిక సాయం అందజేత
District News, Warangal

బాధితుడికి ఆర్థిక సాయం అందజేత

వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్ ఐఏఎస్ సహకారంతో గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో దొంతూరి సమ్మయ్య గౌడ్, ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో బాల్నే రాజు గౌడ్ ఇటీవల గీత వృత్తి చేసుకుంటూ ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై నుంచి పడి నడుము విరగగా అతడి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.15000 చెక్కులను బుర్రా వెంకటేష్ గౌడ్ పంపించారు. హనుమకొండ జిల్లా బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్ కందాల శంకరయ్య గౌడ్ తో కలిసి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొనగాని యాదగిరి గౌడ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నారగోని కుమారస్వామి గౌడ్, గ్రేటర్ వరంగల్ గోపా అధ్యక్షుడు పులి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జనగాం వెంకటేశ్వర్లు గౌడ్, ఐనవోలు మండల అధ్యక్షులు పట్టాపురం ఎల్లా గౌడ్, బత్తిని నాగరాజు గౌడ్, గడ్డం రమేష్ గౌడ్ లు అందించారు. అనంతరం...
గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి
Bhupalapally, District News

గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్వరంగల్ వాయిస్, భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత బాలికల హాస్టల్, జిల్లా ఎస్ఎంహెచ్ హాస్టల్లో ఉన్న సమస్యల పై గురువారం హాస్టల్ ను వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ సందర్శించారు. అనంతరం హాస్టల్లోని విద్యార్థులు అక్కడ జరుగుతున్న ఇబ్బందులను ఆయనకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన పూర్తి స్థాయి మెనూ విధానాన్ని అమలు చేయడం లేదని, నాసిరకంగా బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు ఉన్నాయని, భోజనంలో పురుగులు వస్తున్నాయని, భోజనం నాణ్యత ఉండట్లేదని, పర్మినెంట్ మహిళ వార్డులను, టీచర్లని నియమించాలని విద్యార్థులు చెప్పారు. నిన్న కొంతమంది హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు కిషన్ ను కలిసి హాస్టల్ సమస్యలు తెలియజేశారని, విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ సిబ్బందితో మాట్లాడితే సిబ్బంది అమర్యాదగా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్న...
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల
District News, Warangal

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల

ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించండి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఎంఎస్ కార్యాలయంలో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు కొనసాగాలంటే, జనాభా దామాష ప్రకారం బీసీల వాటా బీసీలకు దక్కాలంటే బీసీ లెక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీ కుల గణపైన పార్లమెంట్ లో చట్టం చేయాలని, జనాభాలో 55 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్ప...
ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
Bhupalapally, District News

ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

వరంగల్ వాయిస్, చిట్యాల : మండలంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జుకల్ గ్రామంలో అధికారులతో కలిసి జడ్పీటీసీ గొర్రె సాగర్, మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ ఎస్ఆర్ఎస్పీ కాలువ ఇరుపక్కలా మొక్కలు నాటారు. అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో కొత్తగా నిర్మింస్తున్న భవనాలను పరిశీలించారు. వారి వెంట పంచాయతీరాజ్ ఏఈ రవికుమార్, గ్రామ సర్పంచ్ పుట్టపాక మహేందర్, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, జగదీష్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, టి.అపర్ణ, చిరంజీవి, గ్రామ సీనియర్ నాయకులు ఎండీ కాజా, గొడుగు రమేశ్, వర్క్ ఇన్ స్పెక్టర్ అంజి, గ్రామ యూత్ అధ్యక్షుడు సవోడ కిషన్, అవెంచ రమేష్, తదితరుల పాల్గొన్నారు...
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ
Bhupalapally, District News, Warangal

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో ఇటీవల మరణించిన పలు బాధిత కుటుంబాలను గురువారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. ప్రకాశరెడ్డిపేటలో గాదె పాపిరెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పోస్టల్ కాలనీలో సూరవు దయాకర్ రావు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరికొండ మధుసూదనాచారి వెంట 50వ డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్, కార్యకర్తలు ఉన్నారు....
కేంద్రం కేటాయించిన నిధులపై ఆర్టీఐ దరఖాస్తు
District News, Warangal

కేంద్రం కేటాయించిన నిధులపై ఆర్టీఐ దరఖాస్తు

వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక మండల అభివృద్ధి అధికారి రాజ్యలక్ష్మి, మండల పంచాయతీ అధికారి ధనలక్ష్మి కిసమాచార హక్కు చట్టం ద్వారా మండల పరిషత్, మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు వినియోగానికి సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పక్షాన మాజీ శాసనసభ్యుడు నల్లూరి ఇంద్రసేనారెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఆయా మండల పరిధిలో గల గ్రామాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014-15వ ఆర్థిక సంవత్సరం నుంచి జూన్ 30 2022 ఆర్థిక సంవత్సరం వరకు ఏమేం నిధులు కేటాయించాయి, వాటి వినియోగం ఏ విధంగా జరిగింది అనే అంశాలను ప్రాతిపదికన సమాచార సేకరణ కోసం ప్రతి మండలానికి ఈ దరఖా...
పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి
District News, Mahabubabad

పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో మంద కృష్ణ మాదిగపిలుపు మేరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా 8వ రోజు రిలే నిరాహారదీక్షలో ఎంఎస్పీ మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ గుగ్గిళ్ల పీరయ్య మాదిగ పాల్గొన్నారు. దీక్ష లో ఎంఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి పాషా, మండల ఇంఛార్జి కందిపాటి భిక్షపతి, వీహెచ్ పీఎస్ జిల్లా నాయకులు చలగొల వెంకన్న, మోలుగురి కుమార్, ఎంఎస్పీ మండల నాయకులు, మంద సంపత్, మట్టె మహేష్, బిర్రు మంజుల, బొడ సక్రియా, సాంబ లక్ష్మీ, భిక్ష నాయక్, మాలోతు అమ్మి, చెవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు....