Warangalvoice

District News

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
Cultural, District News, Hanamkonda

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

ఆలయాల్లో భక్తుల రద్దీపుట్టలో పాలు పోసి మొక్కులుచల్లంగా చూడాలని ‘నాగన్న’కు పూజలు వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తి శ్రద్ధలతో పుట్టల్లో పాలు పోయడానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయాలను సుందరంగా అలంకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లోని పుట్టలకు, నాగమయ్యను పూజించడానికి భక్తులు తరలివచ్చారు. అభిషేకాలు, పాలు, పండ్లు, పసుపు కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్, ఉర్సు నాగమయ్య గుడికి భక్తులు బారులు తీరారు. తమ కుటుంబాన్ని చల్లంగా చూడాలని నాగమయ్యను వేడుకున్నారు. దయానంద కాలనీలో..వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దయానంద కాలనీ శ్రీ కనకదుర్గ మాత దేవాలయం ఆవరణలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో నాగుల పంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ మాత ఆలయ కమిటీ చైర్మన్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ....
ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తిపై పీడీయాక్ట్
Crime, District News

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తిపై పీడీయాక్ట్

వరంగల్ వాయిస్, క్రైం: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాటు ఉద్యోగాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగుల వద్ద డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న గుంటూరు జిల్లా పట్టాబిపురానికి చెందిన ఎస్.కె.గౌస్, పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ నిందితుడు గౌస్ కు వరంగల్ రైల్వే స్టేషన్లో వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసి చర్లపల్లి కారాగారానికి తరలించారు.పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులను నమ్మించడం ప్రారంభించి.. సంబంధిత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు రూ.8లక్షల నుంచి 20 లక్షల్లో డబ్బు వసూలు చేసిన సంఘటనలో నిందితుడిని మీల్స్ కాలనీ, టాస...
అనుమానం.. రెండు ప్రాణాలు బలి
Crime, District News, Warangal

అనుమానం.. రెండు ప్రాణాలు బలి

భార్యను నరికి చంపిన భర్త ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్య రెండు నెలల కిందటే వివాహం ఆత్మకూరు మండల కేంద్రంలో విషాదం వరంగల్ వాయిస్, ఆత్మకూరు: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్, తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితమే భార్యతో గొడవపడిన హరీష్‌ క్రిమిసంహారక మందు తాగాడు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకొని ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. అయితే మరోసారి భార్యాభర్తల మధ్య ఇదే విషయమై వివాదం జరిగింది. దీంతో కోపోద్రోక్తుడైన భర్త హరీష్‌ మంగళవారం తెల్లవారుజామున భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి త...
కోనారెడ్డి.. వెలవెల
District News, Today_banner

కోనారెడ్డి.. వెలవెల

చెరువు కట్ట తెగి మూడేళ్లు..ఇప్పటికీ పూర్తికాని మరమ్మతు పనులు2వేల ఎకరాల ఆయకట్టుకు నీరందని దుస్థితినాసిరకంగా పనులు.. పట్టించుకోని అధికారులు వరంగల్ వాయిస్, వర్ధన్నపేట: మండలం కేంద్రంలో రైతులకు పెద్దదిక్కు అయినా కోనారెడ్డి చెరువు కట్ట తెగిపోయి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద ఆయకట్టు 2000 ఎకరాలు ఇప్పుడు పంట పండించలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం కోనారెడ్డి చెరువు పనులను చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు.తూతూ మంత్రంగా పనులుకోనారెడ్డి చెరువు కట్ట కాంట్రాక్టు పనులు చేస్తున్న సంస్థలు పనులను చేపట్టి చేతులు దులుపుకొని పోతున్నాయి తప్ప రైతులకు మేలు చేకూర్చే విధంగా పనులను ముందుకు తీసుకెళ్లడంలో కాంట్రాక్టర్లు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం చెరువు కట్ట రిపేరు కోసం దాదాపు రూ.40 లక్షల కాంట్రాక్టులను దక్...
హాస్టల్ లో ఫైటింగ్
Crime, District News, Top Stories

హాస్టల్ లో ఫైటింగ్

ముగ్గురు విద్యార్థినులకు గాయాలుకారణాలు బయటకు పొక్కనివ్వని సిబ్బందితల్లిదండ్రుల ఆందోళ‌న‌తో ఆల‌స్యంగా వెలుగులోకి వరంగల్ వాయిస్‌, వ‌రంగ‌ల్ టౌన్: న‌గ‌రంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ గర్ల్స్ స్కూల్‌ శంభునిపేటలో 9వ తరగతి చదువుతున్న‌ ముగ్గురు విద్యార్థునులకు గొంతుపై కోసిన‌ట్లు గాయాలు కావ‌డం న‌గ‌రంలో సంచ‌ల‌నం సృష్టించింది. ఈనెల 24న సంఘ‌ట‌న జ‌రిగినా గురుకుల సిబ్బంది దీనిని గోప్యంగా ఉంచ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. గురుకుల సిబ్బందే ట్రీట్‌మెంట్ ఇప్పించ‌డంపై తల్లిదండ్రులు మండిప‌డుతున్నారు. సోమ‌వారం బాధిత విద్యార్థునుల త‌ల్లిదండ్రులు గురుకులం ఎదుట ఆందోళన‌కు దిగ‌డంతో విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అయితే విద్యార్థినుల త‌ల్లిదండ్రుల‌ను కూడా గురుకుల సిబ్బంది గేటు వ‌ద్దే అడ్డుకోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యార్థినుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌...
తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచుదాం
Crime, District News, Hanamkonda, Top Stories

తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచుదాం

వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి రెడ్ క్రాస్ లో పోలీసుల ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం వరంగల్ వాయిస్, క్రైం: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి యువతకు పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు కోసం హన్మకొండ రెడ్ క్రాస్ పిలుపునందుకోని హనుమకొండ డివిజినల్ పోలీసుల ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో పాటు పోలీస్ సిబ్బంది, అధికారులు సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేయడంలో వారిని ప్రోత్సహించే విధంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ శిబిరం ముందుగా రక్తదానం చేసి యువతకు అదర్శంగా నిలిచారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రక్తదాతలకు సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ ...
లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..
Bhupalapally, District News, Hanamkonda, Mahabubabad, Top Stories, Warangal

లీడర్‌ బన్‌ గయా ఆటోవాలా..

ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. నేతలు, లీడర్లు అంతా ఆటో కార్మికులను కలిసి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, వరంగల్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, బీజేపీ నేత రాకేష్‌ రెడ్డి తదితరులు ఆటో నడిపి ఆటో కార్మికులను ఉత్సాహపరిచారు. -వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రతినిధి Gandra Venkataraman Reddy...
స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు
District News, Jangaon, Top Stories

స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు

వరంగల్‌ వాయిస్‌, జనగాం : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ మరియు హెల్పర్స్‌ యూనియన్‌ టీఎన్‌ జీవో (తెలంగాణ నాన్‌ గెజిటడ్‌ ఆఫీసర్స్‌) అనుబంధం జనగాం జిల్లా అధ్యక్షురాలు కాసగోని స్వరూపరాణి, కార్యదర్శి గుమ్మడవెల్లి రమాదేవి ఆధ్వర్యంలో స్టేషన్‌ ఘనపూర్‌ ప్రాజెక్ట్‌, రఘునాథపల్లి మండల కేంద్రంలోని కోమళ్ళలో అంగన్వాడీ టీచర్స్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షురాలు స్వరూపారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల జీవితాలు బాగున్నాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతను వివరించారు. రఘునాథపల్లి మండలం అధ్యక్షురాలు గొట్టం మంజుల, కార్యదర్శి ఎండీ ఫాతిమా, కోశాధికారి ఐలమ్మ, కోమళ్ల సర్కిల్‌ అధ్యక్షురాలు ఇల్లందుల రాజమణి, కార్యదర్శి నల్ల నర్సమ్మ, కోశాధికారి తమ్మడపల్లి శారద, కార్యవర్గ సభ్యుల బొల్లాపల్లి ప్రేమలత, చేపురి మమత, కింద విజయ, మార...
చాయ్ వాలాకు సత్కారం
District News, Warangal

చాయ్ వాలాకు సత్కారం

వ‌రంగ‌ల్ వాయిస్‌, కాశిబుగ్గ : ఎంజీఎం రెండో గేటు ముందు గత 20 సంవత్సరాలుగా టీ కొట్టు న‌డిపిస్తూ వీధి వ్యాపారం నిర్వహణలో మొదటి స్థానం దక్కించుకున్న మహమ్మద్ మహబూబ్‌ పాషాని వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమ‌వారం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలకోసం కాకుండా స్వయం కృషితో అభివృద్ది చెందాల‌న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, సాయి, శైలజ, శ్రీకాంత్ హోటల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు....
ఆటో డ్రైవర్ల‌కు అండగా ఉంటా
District News, Warangal

ఆటో డ్రైవర్ల‌కు అండగా ఉంటా

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వ‌రంగ‌ల్ వాయిస్‌, క‌రీమాబాద్ : ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమ‌వారం భారీ ర్యాలీ, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంత‌రం జెండా ఆవిష్కరించి ఆటో డ్రైవర్ల‌నుద్దేశించి మాట్లాడారు. ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్ని విధాల అండగా ఉంటున్నదన్నారు. భవిష్యత్‌లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. నగరంలోని అన్ని ఆటో అడ్డాల‌లో మౌళిక వసతుల కోసం కృషి చేస్తాన‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నదన్నారు. లైసెన్స్, బ్యాడ్జ్ క‌లిగి ఉన్న ఆటో డ్రైవర్లు ప్రమాద వశాత్తు మరణ...