యూట్యూబ్ లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి
దొంగనోట్ల ముఠా అరెస్ట్
నిందితులంతా ఉమ్మడి జిల్లా వారే
వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి
వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రెండు వేల రూపాయల నోట్లు మూడు వందలు (ఆరులక్షలు), కలర్ ప్రింటర్, ఏడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీ అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన సయ్యద్ యాకుబ్ ఆలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), న్యూరాయపురకు చెందిన యం.డి సమీర్ (ప్రస్తుతం పరారీలో వున్నాడు), పెద్దమ్మగడ్డకు చెందిన పేరాల అవినాష్, నర్సంపేటకు చెందిన కత్తి రమేష్, మచిలీబజార్ కు చెందిన యం.డి అక్రం ఆలీ, కాజీపేటకు చెందిన గడ్డం ప్రవీణ్, గుండ్...