Warangalvoice

District News

ఖమ్మంలో కంటివెలుగు రెండోదశ ప్రారంభం
District News

ఖమ్మంలో కంటివెలుగు రెండోదశ ప్రారంభం

సిఎం కెసిఆర్‌ చేతులవిూదుగా ప్రారంభించాలని నిర్ణయం సిద్దిపేటలో అధికారులతో సవిూక్షించిన మంత్రి హరీష్‌ రావు వరంగల్ వాయిస్,సిద్దిపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవదశ కంటివెలుగు ప్రారంభం ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడిరచారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర రాష్టాల్రకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారని ఆయన తెలిపారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కంటి సమస్యతో ఎవరు బాధపడవద్దని రెండవదశ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు. జనవరి 18 నుంచి జూన్‌ 30వరకు జరిగే రెండవదశ కంటివెలుగు కొనసాగుతుందని అన్నారు. తొమ్మిది నుంచి సాయంత్రం 4గంటల వరకు సోమవారం నుంచి శుక్రవారం కంటి పరీక్ష చేస్తారని మంత్రి చెప్పారు. జ...
రంగు రగడ
District News, Hanamkonda

రంగు రగడ

  బీజేపీ పోస్టర్లపై కార్పొరేషన్ కలర్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకుల వాల్ పోస్టర్లపై కార్పొరేషన్ అధికారులు రంగు వేయడం వివాదాస్పదంగా మారింది. ‘‘బీజేపీలో చేరండి..దేశ భద్రతను కాపాడండి..డయల్ టోల్ ఫ్రీ నెంబర్ 8980808080.. జాయిన్ ఇన్ బీజేపీ’’ అంటూ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు పేరిట మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లను వేశారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లతోపాటు ప్రదీప్ రావు ఫొటోను కూడా అందులో ముద్రించారు. వరంగల్ తూర్పులో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రదీప్ రావు నియోజకవర్గంలోని సానుభూతి పరులను ఆకర్షించేందుకు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ ఎదుగుదలను...
అభివృద్ధికి ఆమడ దూరంలో యాదవ నగర్
District News, Hanamkonda

అభివృద్ధికి ఆమడ దూరంలో యాదవ నగర్

పేరుకే పట్టణ ప్రగతి…. పైసాలన్ని అధోగతి బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నగరం నడిబొడ్డున ఉన్న యాదవ్ నగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విమర్శించారు. బుధవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా రావు పద్మ 4వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె ఓం ప్రకాష్ అధ్వర్యంలో డివిజన్ పరిధిలోని యాదవ నగర్, గొల్లపల్లిలో ఇంటింటికీ తిరుగుతు కేంద్ర ప్రభుత్వం వరంగల్ మహానగరంలో చేసిన అభివృద్ధి పథకాలకు కేటాయించిన నిధులపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్, జిల్లా యువమోర్చ అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్, ఓబీసీ మోర్చ అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, ట్రేడర్స్ సెల్ జిల్లా కన్వీనర్ పిట్ట భరత్, 5వ డివిజన్ అధ్యక్షుడు అనిశెట్టి రంజిత్, 54వ డివిజన్ అధ్యక్షుడు కురిమిండ్ల సదానందం...
పట్టుదలతో విజయతీరం చేరాలి
District News, Hanamkonda

పట్టుదలతో విజయతీరం చేరాలి

చీఫ్ విప్ వినయ్ భాస్కర్ యువజనోత్సవాలు-2023 ప్రారంభం వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు-2023 ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువజనోత్సవాల వేదిక ద్వారా యువత తమ ప్రతిభకు పదును పెట్టి ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. పట్టుదల,క్రమశిక్షణ,ఆకుంఠిత దీక్షతో యువలోకం విజయతీరాలను చేరుకోవాలన్నారు. అలాగని ఓడిపోతే ఓడిన చోటనే గెలుపు సూత్రాలను నేర్చుకుని విజయాన్ని ముద్దాడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్ కుమార్,ఇందిర, సారంగపాణి, కందుల సృజన్,నరేష్ తదితరులు పాల్గొన్నారు....
యువత కళలలో రాణించాలిములుగు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య
Cultural, District News, Mulugu

యువత కళలలో రాణించాలిములుగు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య

వరంగల్ వాయిస్, ములుగు: జిల్లా యువత కళలలో రాణించాలని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ గార్డెన్స్ లో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి జానపద నృత్యాలు, జానపద గీతాలు, కబట్టి ,వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ను స్ఫూర్తిగా తీసుకొని యువత చదువుతో పాటు సాంస్కృతిక రంగంలో రాణించాలన్నారు. ములుగు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇవి మొట్టమొదటిసారి యువజన ఉత్సవాలు అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి పి. వెంకటరమణ చారి, న్యాయ నిర్ణయితలుగా నరసింహ, తాడిచెర్ల రవి, సంధ్యా రాణి,...
రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
Crime, District News

రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉప్పల్ - భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద క్షేత్రస్థాయి పరిశీలన వరంగల్ వాయిస్ , క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం వెల్లడించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా భీంపల్లి క్రాస్ రోడ్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, ఆర్అండ్ బీ , స్థానిక ప్రజా ప్రతినిధులతో కల్సి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సి చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పాటు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వాహనాల వేగాన్ని తగ్గించేందుకుగాను స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, స...
కాజీపేట చౌరస్తాలో ఎంఎస్పి పార్టి జెండా ఆవిష్కరణ
District News, Hanamkonda

కాజీపేట చౌరస్తాలో ఎంఎస్పి పార్టి జెండా ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, కాజీపేట : కాజిపేట మండల కేంద్రము కాజీపేట చౌరస్తాలో ఎంఎస్పి పార్టీ మండల ఇంచార్జి చిలువేరు ఆశీర్వాదం మాదిగ ఆధ్వర్యంలో ఎంఎస్పి పార్టి జెండాను ముఖ్య అతిథిగా బండారు సురేందర్ మాదిగ విచ్చేసి ఆవిష్కరించారు. జనవరి 13. 14. 15. తేదిలలో మంద కృష్ణ మాదిగ ఆధ్యర్యంలో బెంగుళూర్ లో ఏర్పాటు చేసే సమావేశానికి అందరూ సన్నధం కావాలని పిలుపిపినిచ్చారు. ఈ కార్యకక్రంలో జేరుపోతుల సారంగపాణి మాదిగ, రేనుకుంట మహేశ్ మాదిగ, జేరుపోతుల సతీష్ మాదిగ, మంద స్వారాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు....
ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరూరి….
District News, Hanamkonda

ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరూరి….

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ నెల 13నుండి ఉగాది వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆలయ ఈవో, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....
అట్టహాసంగా వేముల నామినేషన్
District News, Hanamkonda

అట్టహాసంగా వేముల నామినేషన్

మద్దతుగా టీఏజేఎఫ్, టీడబ్లూజేఎఫ్ నేతలు నాగరాజు గెలుపు ఖాయం: ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ వరంగల్ వాయిస్, హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రధాన యూనియన్ అయినా టీయూడబ్ల్యూజే ఐజేయూ నుంచి వేముల నాగరాజు అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం సాయంత్రం 4.50గంటలకు ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీతోపాటు జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, వివిధ యూనియన్ల ప్రతినిధుల ఆధ్వర్యంలో తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి సామంతుల శ్రీనివాస్ కు అందజేశారు. వేముల నాగరాజు గెలుపు కోసం తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ నాయకులతో పాటు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ సభ్యులు తరలివచ్చి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ హాలీ మాట్లాడుతూ రాష్ట్రంలో టీయూడబ్ల్యూజే 143 ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవన్న...
టీయూడబ్ల్యూజే హనుమకొండ జిల్లా అధ్యకుడిగా సుధాకర్
District News, Hanamkonda

టీయూడబ్ల్యూజే హనుమకొండ జిల్లా అధ్యకుడిగా సుధాకర్

వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (హెచ్-143) హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మహా న్యూస్ సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ మస్కపురి సుధాకర్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని యునియన్ సభ్యులందరితో సంప్రదించి ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలిపారు. గతంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగిన సుధాకర్ ఇకపై హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలిపారు. జిల్లాలో మెంబర్ షిప్ ప్రక్రియను పూర్తి చేసి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు. యూనియన్ బలోపేతానికి కృషి: మస్కపురి సుధాకర్ తనపై నమ్మకంతో టీయూడబ్ల్యూ జే హెచ్ -143 హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్...