Warangalvoice

District News

లారీ ఢీకొని యువకుడి మృతి
Crime, District News

లారీ ఢీకొని యువకుడి మృతి

వరంగల్ వాయిస్, మల్హర్ : లారీ ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మల్హర్ మండలంలోని నాగులమ్మ క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని అన్సాన్ పల్లి గ్రామానికి చెందిన అజ్మీరా శ్రీనివాస్(18) గురువారం అడ్వాలపల్లి లంబాడీ తాండాలోని తమ బందువుల ఇంట్లో జరుగుతున్న తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడానికి తన బైక్ పై బయలుదేరారు. మండలంలోని నాగులమ్మ క్రాస్ రోడ్ నుంచి మల్లారం మధ్యలో తాడిచెర్ల వైపు వేగంగా వెళ్తున్న బొగ్గు టిప్పర్ ముందు ఉన్న లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో టిప్పర్ ముందు భాగంలో గల బంపర్ బైక్ పై వెళ్తున్న శ్రీనివాస్ కి తగిలి కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన అక్కడికక్కడే మృతి చెందారు. యువకుడి మృతితో అన్సాన్ పల్లి, అడ్వాల పల్లి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్, కాటారం సీఐ రంజిత్ రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేప...
కేయూని మూయించేందుకు కుట్ర
District News, Hanamkonda

కేయూని మూయించేందుకు కుట్ర

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ వాయిస్, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీని మూయించేందుకు కుట్ర జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో యూనివర్శిటీలు లేకుండా చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అని ఆయన మండి పడ్డారు. ఇటీవల పోలీసుల చేతిలో గాయపడిన కేయూ విద్యార్థి సంఘం నేతలను రేవంత్ రెడ్డి పరామర్శించారు. బుధవారం నగరానికి విచ్చేసిన ఆయన దీక్ష చేస్తున్న విద్యార్థులను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్శిటీలో పీహెచీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడులు చేశారని నిప్పులు చెరిగారు. వీధి రౌడీలా మాదిరిగా విద్యార్థులను కొట్టిస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. యూనివర్శిటీల్లో జరిగే అన్యాయాలపైనే విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే శత్రువుల మాదిరిగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాకతీయ వర్శిటీలో జరిగిన అన్యాయాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల...
ప్రజల మనిషి కాళోజీ
Cultural, District News, Telangana

ప్రజల మనిషి కాళోజీ

సెప్టెంబర్ 9న ఆయన జయంతి నేడు తెలంగాణ భాషాదినోత్సవం (ఆయన జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రకటించింది.) అది 1931 తెల్లదొరల పాలన నుంచి భరతమాత విముక్తి కోసం పోరాటం చేస్తున్న ఎందరో వీరులు, ఆ వీరులలో భరతమాత ముద్దుబిడ్డ  భగత్ సింగ్ పారాటం మరువలేనిది.  భగత్ సింగ్ పోరాటం రుచించని బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను ఉరితీసింది. అప్పడు విద్యర్ధి దశలో ఉన్న కాళోజి ఈ అన్యాయాన్ని తట్టుకోలేపోయాలు. అప్పడే ఆయనలో దేశభక్తి చిగురించింది.  భగత్ సింగ్‌ను ఉరితీయడాన్ని వ్యతిరేకిస్తూ రాసిన కవిత్వమది. అప్పటి నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా అతని కలం స్పందించింది. కాళోజీ తన పాఠశాల విద్యార్థి ధ నుంచి కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. ఆయన కవిత్వం 1931లోనే ప్రచురించబడింది. కత్తికంటే కలం గొప్పదని భావించాడు. కవితనే ఆయుధంగా సంధించాడు. విద్యార్థి దశలో నాటి దేశ కాల పరిస్థితుల...
ఈతకు వెళ్లిన ఇద్దరు బాలుర గల్లంతు
Crime, District News, Hanamkonda

ఈతకు వెళ్లిన ఇద్దరు బాలుర గల్లంతు

ఒకరిని కాపాడిన స్థానికులు వరంగల్ వాయిస్, హనుమకొండ : గుండ్ల సింగారం కేనాల్ లో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. సెయింట్ తామస్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్న చరణ్, విగ్నేశ్వర్ సోమవారం సాయంత్రం గుండ్ల సింగారం కేనాల్ లో ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన వీరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిని యాదవ్ నగర్ సమీపంలో స్థానికులు గుర్తించి తాడు సహాయంతో రక్షించే ప్రయత్నం చేశారు. అయితే చరణ్ మాత్రం తాడు సహాయంతో ఒడ్డుకు చేరుకోగా విగ్నేశ్వర్ కెనాల్ లో కొట్టుకు పోయినట్లు స్థానికులు వెల్లడించారు....
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు
Crime, District News, Warangal

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు

భార్యభర్తల మృతి వరంగల్ వాయిస్, పరకాల : నడి కూడ మండలం ధర్మారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం 6.30గంటల సమయంలో హనుమకొండ నుంచి పరకాలకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని పరకాలకే వస్తున్న కారు మితిమీరిన వేగంతో ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న పరకాల పట్టణ కేంద్రానికి చెందిన భార్య, భర్తల్లో భర్త పసుల మొగిలి (55) అక్కడికక్కడే మృతి చెందాగా భార్య సావిత్రికి (50) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పరకాల ఎస్ఐ శివకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మొగిలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల తరలించారు. కారు డ్రైవర్ తోపాటు యజమాని పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు....
District News, Hanamkonda, Telangana, Top Stories

రైల్వే వర్క్ షాప్ పేరిట రాజకీయ పార్టీల డ్రామా

రైల్వే రిపేరు వర్క్ పేరిట ప్రజలను మోసంరాబోయే ఎన్నికల కోసం  పార్టీల స్టంట్కాజీపేట తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జాక్  వరంగల్ వాయిస్, కాజీపేట : కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ (పి ఓ హెచ్), వ్యాగన్ తయారీ పరిశ్రమ విషయంలో గత నాలుగైదు రోజులుగా మీడియాలో, పత్రికలలో కాజీపేట ప్రాంత ప్రజలను అయోమయానికి గురిచేసేవిదంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు  ఈ పరిశ్రమల పైన అవగాహన లేకుండా, ఒక పెద్ద డ్రామాలు మాట్లాడుతున్నారన్నారు. అందుకే తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో  కాజీపేట రైల్వే ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణలో  ఏర్పాటు విలేకరుల సమావేశంలో కాజీపేట  తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జాక్ కో, కన్వీనర్ పాక వేద ప్రకాష్ మాట్లాడుతూతెలంగాణ రైల్వే జాక్ 2011 పిబ్రవరి నెలలో ఆవిర్భావం రైల్వే సమస్యల పైన కాజీపేట జంక్షన్ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న విషయం ఈ ప్రాంతంలోని ప్రజానీకానికి తెలిసిందే అని, అప్ప...
గిరిజన ఆదివాసీ జీవితాల్లో వెలుగులు
District News, Telangana

గిరిజన ఆదివాసీ జీవితాల్లో వెలుగులు

పోడు పట్టాలతో పాటు పోడు కేసుల ఎత్తివేత ఇకముందు వారిపై ఎలాంటి కేసులూ ఉండవు ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనే 47వేల ఎకరాలకు పోడు పట్టాలు పోడు పట్టాలతో పాటు రైతుబంధు కూడా అమలు ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీ ఫేజ్‌ కరెంట్‌కు ఆదేశాలు కౌటాలా వార్ధా మధ్య బ్రిడ్జికి 75 కోట్లు మంజూరు ఆసిఫాబాద్‌ వేదికగా సిఎం కెసిఆర్‌ ప్రకటన వరంగల్ వాయిస్ , కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ : గిరిజనులకు పోడు పట్టాలు అందించడంతో పాటు వారికి మరో శుభవార్తను కెసిఆర్‌ అందించారు. పోడుభూములకు సంబంధించి ఆదివాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇక వారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. పట్టాలు పంపిణీ చేసిన అనంతరం కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత పేదల బతుకుల గురించి ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. తెలంగా...
రంగసాయిపేటలో బీరన్న బోనాలు
District News, Warangal

రంగసాయిపేటలో బీరన్న బోనాలు

వరంగల్ వాయిస్, రంగసాయిపేట : ఈరోజు రంగసాయిపేటలో ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ బిరన్న దేవస్థానంలో బోనాల జాతర జరిగినది. ఆలయానికి ప్రధాన పూజారి మండల నర్సింహా రాములు, కుటుంబ సభ్యులతో ఆలయానికి పూజా సామాన్ల గంప నెత్తిపై ధరించి ఆలయానికి కురుమ కళాకారులు డప్పు చప్పులతో కళాకారులు ఆలయానికి విన్యాసాలు చేస్తూ ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం ఆలయ పూజారి స్వామివారి లింగాలను పాలాభిషేకం పసుపు బండారి తో అలంకరించారు స్వామివారి కంకణాలు పసుపు బండారి మరియు గొర్రె పాలతో కంకణాలకు అభిషేకం చేశారు. స్వామివారి గద్దె మీద పెట్టి నైవేద్యం పళ్ళు పెట్టి స్వామివారికి చూపించారు. పూలతో అలంకరణ అఖండ దీపం వెలిగించి టెంకాయ కొట్టి గుమ్మడికాయ తో ఆలయానికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి మంగళ హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు కంకణాలు భక్తులకు ఆలయ పూజారి ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక వైద్య నిపుణులు డాక్టర్ కె చంద్రశేఖర్, ఆర్య డాక్టర్...
ఉపవాస పర్వం, భక్తి శ్రద్ధల పారవశ్యం – తొలి ఏకాదశి
Cultural, District News, Telangana

ఉపవాస పర్వం, భక్తి శ్రద్ధల పారవశ్యం – తొలి ఏకాదశి

తొలి ఏకాదశి జూన్ 29న శ్రీ మహా విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే సమయం చాతుర్మాస వ్రతం పుణ్యఫలం ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం...
రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ ….
District News, Telangana, Top Stories

రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ ….

జూన్ 28న జయంతి      రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పీవీకి పేరుంది.  పదవిని చేపట్టినా అది ప్రజల పక్షంగానే నడిపించింది. తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం ఆయన సొంతూరు. రుక్మిణి, సీతారామారావు తల్లిదండ్రులు. 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. పీవీ ప్రాథమిక విద్య వంగర, హన్మకొండలో సాగింది. 1936లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులయ్యారు. 1938లో నిజాం వ్యతిరేక పోరాటంలో పీవీ పాల్గొన్నారు. దీంతో ఆనాడు రాష్ర్టంలో ఎక్కడ చదవకుండా ప్రభుత్వం నిర్భంధం విధించింది. చదువుపై మమకారంతో మహారాష్ర్టలోని పూణేలో బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన పీవీ హైదరాబాద్ రాష్ర్ట ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటు ప్రత్యేక మ...