దుష్ప్రచారం తగదు
ఆర్టికల్ 342 (2) అనుసరించే లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్స్.
చరిత్రపై అవగాహన లేకనే లంబాడీల పై వలస వాదులుగా చెడు ప్రచారం.
అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించాలి.
లంబాడీలది తెలంగాణలో వెయ్యి ఏళ్ల చరిత్ర
లంబాడీలపై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్య
తెలంగాణ గిరిజన చరిత్ర (లంబాడీలు)లో ఒక గొప్ప అధ్యాయం
(వరంగల్ వాయిస్, వరంగల్): భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పొందుపరివిన రిజర్వేషన్స్ నేపథ్యంలో కొన్ని గిరిజన తెగలను గుర్తించడం జరిగింది. ఒక తెగను గిరిజనులుగా గుర్తించడానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఒక తెగ ను ఎస్‌టీగా గుర్తించాలంటే ఆతెగకు ప్రత్యేక సంస్కృతి, భాష, ఆచారాలు, అడవులు, కొండ కోనల్లో తిరుగుతూ అక్కడే వృత్తి చేసుకునే వారై ఉండాలి. 1956 కంటే ముందు తెలంగాణలో లంబాడాలు బీసీ-ఏ జాబితాలో ఉన్నారు...