అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు
వరంగల్ వాయిస్, కాటారం : రాములోరి పెండ్లి వేడుకలు ఊరూరా ఘనంగా జరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు-తలంబ్రాలు సమర్పించారు. అలాగే కాటారం మండల కేంద్రమైన గారి పెళ్లి కాటారం చింతకాని తదితర గ్రామాల్లో ఆయా దేవతామూర్తుల ఆలయాలలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని పెళ్లి వేడుకలను తిలకించారు. వేద మూర్తి వేద పండితులు మంత్రోచ్ఛారణలతో సీతారాముల కల్యాణాన్ని పూర్తి గావించారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల వద్ద అన్నదానం నిర్వహించారు. భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన వేడుకల్లో పుస్తే, మట్టే తలంబ్రాలను మద్ది నవీన్, పులి అశోక్ దంపతులు సమర్పించగా చీరల రమేష్ దంపతులు అన్నదానం నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని దత...